ATM Cash Crunch Warning | దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు..? ఎంతకీ ఏం జరిగిందంటే..?
ATM Cash Crunch Warning | దేశవ్యాప్తంగా ఏటీఎం సేవలపై నగదు కొరత ప్రభావం పడే ప్రమాదం ఉన్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) భారతీయ బ్యాంకుల సంఘం (IBA)ను అధికారికంగా హెచ్చరించింది. ఏటీఎంలలో నగదు నింపే ప్రక్రియకు అవసరమైన కరెన్సీ సరఫరా తగినంతగా అందుబాటులో లేకపోవడం వల్ల రాబోయే రోజుల్లో సేవల్లో అంతరాయం తలెత్తే అవకాశం ఉందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
ATM Cash Crunch Warning | దేశవ్యాప్తంగా ఏటీఎం సేవలపై నగదు కొరత ప్రభావం పడే ప్రమాదం ఉన్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) భారతీయ బ్యాంకుల సంఘం (IBA)ను అధికారికంగా హెచ్చరించింది. ఏటీఎంలలో నగదు నింపే ప్రక్రియకు అవసరమైన కరెన్సీ సరఫరా తగినంతగా అందుబాటులో లేకపోవడం వల్ల రాబోయే రోజుల్లో సేవల్లో అంతరాయం తలెత్తే అవకాశం ఉందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఏటీఎం ఇండస్ట్రీ ప్రకారం.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో క్యాష్ రీఫిల్లింగ్ సైకిల్ ఆలస్యమవుతోందని, ఇది కొనసాగితే ఏటీఎంల వద్ద నగదు అందుబాటు మరింత తగ్గే అవకాశం ఉందని సూచించింది. ముఖ్యంగా రోజువారీ నగదు లావాదేవీలపై ఆధారపడే వినియోగదారులు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ఈ సమస్య ప్రభావం రూరల్, సెబీ అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. డిజిటల్ చెల్లింపుల వాడకం పెరుగుతున్నప్పటికీ.. డీబీటీ ద్వారా వచ్చే సబ్సిడీ, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ సహాయాన్ని తీసుకునేందుకు జనం ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. నగదు సరఫరా తగ్గితే ఆయావర్గాల వారికి తక్షణ ఆర్థిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నది. చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు కూడా నగదు లభ్యత తగ్గితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని బ్యాంకులు నగదు నిర్వహణ ఖర్చులు పెరగడం, లాజిస్టిక్స్ సమస్యలు వంటి కారణాలతో రీఫిల్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనకపోతే దేశవ్యాప్తంగా ఏటీఎం నెట్‌వర్క్‌పై నమ్మకం తగ్గే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తక్షణ చర్యల ద్వారా నగదు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీస్ భారతీయ బ్యాంకుల సంఘాకి సూచించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి
జూన్ 5, 2026

Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్
జూన్ 5, 2026

KCR | రెండేళ్లు సహకరించండి.. పాలమూరు బీఆర్ఎస్ నేతలకు సీఎం రిక్వెస్ట్..!
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | కేసీఆర్కు అసెంబ్లీలోనే క్షమాపణ చెబుతా : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | పాలమూరు జిల్లాలో నీ జెండా ఎగరనివ్వను.. కేసీఆర్ను హెచ్చరించిన సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | పాదయాత్రలు కాదు.. పొర్లు దండాలు చేసినా మీ పాపాలు తీరవు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Janhvi Kapoor | వామ్మో...జాన్వీ కపూర్ హ్యాండ్బ్యాగ్ ధర అన్ని లక్షలా?
- ●CM Revanth Reddy | కేసీఆర్ను గుండెల్లో పెట్టుకున్నాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
- ●Ponguleti Srinivas Reddy | కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి

CM Revanth Reddy | కేసీఆర్కు అసెంబ్లీలోనే క్షమాపణ చెబుతా : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | పాలమూరు జిల్లాలో నీ జెండా ఎగరనివ్వను.. కేసీఆర్ను హెచ్చరించిన సీఎం రేవంత్

CM Revanth Reddy | పాదయాత్రలు కాదు.. పొర్లు దండాలు చేసినా మీ పాపాలు తీరవు : సీఎం రేవంత్ రెడ్డి

Janhvi Kapoor | వామ్మో...జాన్వీ కపూర్ హ్యాండ్బ్యాగ్ ధర అన్ని లక్షలా?



