CM Revanth Reddy | పాదయాత్రలు కాదు.. పొర్లు దండాలు చేసినా మీ పాపాలు తీరవు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | అధికారం కోసం కలలు కంటున్న వారు పాదయాత్రలు కాదు.. పొర్లు దండాలు చేసినా మీ పాపాలు తీరవు.. మీ అన్యాయాలను ఈ జిల్లా ప్రజలు మరువరు అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : అధికారం కోసం కలలు కంటున్న వారు పాదయాత్రలు కాదు.. పొర్లు దండాలు చేసినా మీ పాపాలు తీరవు.. మీ అన్యాయాలను ఈ జిల్లా ప్రజలు మరువరు అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
కొంతమంది మాట్లాడుతున్నరు.. దొంగలకు చద్దులు మోసేటోళ్లు, తిన్నింటి వాసాలు లెక్కపెట్టెతోడు.. అన్నం పెట్టినోడికి సున్నం పెట్టెటోడు.. నిన్న మొన్న మహబూబ్‌నగర్ జిల్లాలో మాట్లాడుతున్నడు పాదయాత్రలు చేస్తామని, పాదయాత్రలు కాదు పోర్లు దండాలు చేసినా కాశీ వరకు చేసినా మీరు చేసినా పాపాలు తీరవు.. మీరు చేసిన అన్యాయాన్ని ఈ ప్రజలు మరవరు అని రేవంత్ రెడ్డి అన్నారు.
కన్నీళ్లు తుడిచవా..? సాగునీళ్ల గురించి మాట్లాడావా..?
కేసీఆర్‌ను సూటిగా అడుగుతున్నా.. జూరాల మేం పూర్తి చేశాం. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల, మక్తల్ నారాయణపేట ఎత్తిపోతల కావొచ్చు.. ఏ ప్రాజెక్టు అయినా పూర్తి చేశావా..? రైతులతో మాట్లాడవా.. కన్నీళ్లు తుడిచవా..? సాగునీళ్ల గురించి మాట్లాడావా..? రైతుబిడ్డలకు భరోసా ఇచ్చావా..? అని కేసీఆర్‌ను సీఎం నిలదీశారు.
పిల్లలమర్రి చెట్టు ఎంత మందికి నీడనిస్తుందో..
కేసీఆర్, ఆయన కొడుకు, మనువడు రాజ్యాలు ఏలాలట.. మన దళితులు చెప్పులు కుట్టుకోవాలట, ముదిరాజ్‌లు చేపలు పట్టాలట, యాదవులు గొర్రెలను మేపుకోవాలట.. వారేమో రాజ్యాలు ఏలుతారట..? మారుమూల ప్రాంతం నుంచి రైతుబిడ్డగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నన్ను.. సరిగ్గా 20 ఏండ్లకు ముఖ్యమంత్రిని చేశారు. పిల్లలమర్రి చెట్టు ఎంత మందికి నీడనిస్తుందో.. ఈనాడు మీరు ఆశీర్వదించడంతో ముఖ్యమంత్రిని అయి మీ ముందు నిలబడ్డాడు. ఇదా గొప్పతనం. ఎంపీగా గెలిపిస్తే పారిపోయి గజ్వేల్‌లో సీఎం అయి గోదావరి జలాల కోసం మూడేండ్లలో లక్ష కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం కూలేశ్వరం అయింది.. ఆయన పాలమూరు ద్రోహి.. మీ బిడ్డ పాలమూరును అభివృద్ధి చేసిండా లేడా ఆలోచించండి అని సీఎం తెలిపారు.
పంచ కట్టుకున్నోడు వైఎస్సార్ కాడు..
మీరు పొర్లినా, పాదయాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు.. మా ఆడబిడ్డలు సలాకీ కాల్చి వాత పెడుతారు. ఒకాయన పంచ కట్టి.. వైఎస్సార్ అంటడు. లాల్చి వేసుకున్నోడు లాల్ బబహదూర్ శాస్త్రి కాడు, గడ్డం పెంచుకున్నోడు భగత్ సింగ్ కాడు.. పంచ కట్టుకున్నోడు వైఎస్సార్ కాడు.. పంచలో తొండలు ఈడ్సి కొడుతరు.. మీరు పాదయాత్ర చేస్తారా..? అని సీఎం ఫైర్ అయ్యారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- ●PM Modi | అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ
- ●Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు
- ●Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - వీటిని మిస్సవ్వొద్దు...
- ●DK Shivakumar | అవును మాటిచ్చా.. కానీ, హైకమాండ్‌దే తుది నిర్ణయం.. రామలింగారెడ్డి రాజీనామాపై డీకే రెస్పాన్స్..
- ●CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన

BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

PM Modi | అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ

Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు

Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - వీటిని మిస్సవ్వొద్దు...





