CM Revanth Reddy | కేసీఆర్‌కు అసెంబ్లీలోనే క్షమాపణ చెబుతా : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై, రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలోనే చర్చ చేద్దాం.. ఒక వేళ చర్చలో ఓడిపోతే అసెంబ్లీలోనే కేసీఆర్‌కు క్షమాపణ చెబుతా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై, రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలోనే చర్చ చేద్దాం.. ఒక వేళ చర్చలో ఓడిపోతే అసెంబ్లీలోనే కేసీఆర్‌కు క్షమాపణ చెబుతా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జడ్చర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
రాస్కో బిడ్డా.. మేం ఈ రెండున్నరేండ్లలో ఏం చేశామో చెబుతాం. 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాను. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాను. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన. 45 లక్షల కుటుంబాలకు రూ. 500 సిలిండర్ ఇచ్చాను. 10 వేల కోట్లు మహాలకక్ష్మీ పథకానికి ఇచ్చాను. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఇచ్చాను. పెట్రోల్ బంకులు, వెయ్యి బస్సులు కొనుక్కునే శక్తిని మహిళలకు ఇచ్చాను. 67,616 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇచ్చాను. 25 లక్షల 35 వేల రైతులకు 20 వేల 616 కోట్ల రుణమాఫీ చేశాను. 27 వేల కోట్లు రైతుభరోసా ఇచ్చాను, 500 బోనస్ రైతులకు ఇచ్చాను. 1 లక్షా 56 వేల కోట్లు వ్యవసాయానికి ఖర్చు పెట్టాను. చెప్తే రామయాణం, రాస్తే భారతమంతా అయితది.. ఈ 30 నెలల్లో చేసింది. ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు అని కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు.
నీకు చేతనైతే రా అసెంబ్లీకి.. పౌరుషం ఉంటే, నీ పేరు కేసీఆర్ అయితే అసెంబ్లీకి రా.. పదేండ్ల నీ పాలనపై, రెండున్నరేండ్ల నా పాలన మీద చర్చ చేద్దా. ఒక వేళ చర్చలో ఓడిపోతే అక్కడికక్కడే క్షమాపణ చెబుతా.. లేకపోతే నోరు మూసుకోని ఫామ్ హౌజ్‌లో బోర్లా బొక్కలో పండుకో.. నిన్ను అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు.. మీకు మీకే పొంతన లేదు మీరా మా గురించి మాట్లాడేది.. ఉత్తమ్‌కు రాసిన లెటర్ చూస్తే ఏడ్వాలో నవ్వాలో తెలియడం లేదు. సన్నాసితో చదువు చెప్పించుకోవడం మాకు దాపురించలేదు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన
జూన్ 5, 2026

CM Revanth Reddy | పాలమూరు జిల్లాలో నీ జెండా ఎగరనివ్వను.. కేసీఆర్‌ను హెచ్చరించిన సీఎం రేవంత్
జూన్ 5, 2026

CM Revanth Reddy | పాదయాత్రలు కాదు.. పొర్లు దండాలు చేసినా మీ పాపాలు తీరవు : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు
- ●Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - వీటిని మిస్సవ్వొద్దు...
- ●DK Shivakumar | అవును మాటిచ్చా.. కానీ, హైకమాండ్‌దే తుది నిర్ణయం.. రామలింగారెడ్డి రాజీనామాపై డీకే రెస్పాన్స్..
- ●CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన
- ●Yash | 24 కోట్లతో ఇళ్లు కొన్న కేజీఎఫ్ హీరో - విరాట్, షారుఖ్ బాటలో రాఖీభాయ్
- ●ATM Cash Crunch Warning | దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు..? ఎంతకీ ఏం జరిగిందంటే..?

Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు

Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - వీటిని మిస్సవ్వొద్దు...

DK Shivakumar | అవును మాటిచ్చా.. కానీ, హైకమాండ్‌దే తుది నిర్ణయం.. రామలింగారెడ్డి రాజీనామాపై డీకే రెస్పాన్స్..

CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన



