త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala Story 2 OTT | వారం ముందుగానే ఓటీటీలోకి కేర‌ళ స్టోరీ 2 – రిలీజ్ డేట్ ఛేంజ్‌…

బాలీవుడ్ వివాదాస్ప‌ద సినిమా కేర‌ళ స్టోరీ 2 అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతుంది. మే 8న కాకుండా మే 1 నుంచే ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ ఆదివారం ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Apr 26, 2026, 4.29 pm IST

Kerala Story 2 OTT | వారం ముందుగానే ఓటీటీలోకి కేర‌ళ స్టోరీ 2 – రిలీజ్ డేట్ ఛేంజ్‌…
Advertisement

Kerala Story 2 OTT | బాలీవుడ్ వివాదాస్ప‌ద సినిమా కేర‌ళ స్టోరీ 2 ప్ర‌క‌టించిన‌ డేట్ కంటే వారం ముందుగానే ఓటీటీలోకి రాబోతుంది. కామాఖ్య నారాయ‌ణ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఉల్కా గుప్తా, ఐశ్వ‌ర్య ఓజా, అధితి భాటియా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ మూవీ మే8న జీ5 ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ మారింది. అనౌన్స్ చేసిన డేట్ కంటే వారం ముందుగానే మే 1 నుంచే జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు  నిర్మాత ఆదివారం సోష‌ల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు.

ద‌క్షిణాది భాష‌ల్లో...

ముందుగానే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లోనూ కేర‌ళ స్టోరీ 2 విడుద‌ల‌కాబోతుంది. భారీ అంచ‌నాల న‌డుమ ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

యాభై కోట్ల లోపే...

కేర‌ళ స్టోరీ మూవీ మూడు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. దాంతో సీక్వెల్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. కానీ కాన్సెప్ట్‌లో ఆస‌క్తి లోపించ‌డం, క‌థ‌ను ఎంగేజింగ్‌గా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో యాభై కోట్ల‌లోపే క‌లెక్ష‌న్స్‌తో స‌రిపెట్టుకుంది.

ల‌వ్ జిహాద్ కాన్సెప్ట్‌తో...

ల‌వ్ జిహాద్ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు కామాఖ్యా నారాయ‌ణ్ సింగ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ప్రేమ పేరుతో ముగ్గురు హిందూ అమ్మాయిలు ఎలా మోస‌పోయారు? మంచివారిగా న‌టిస్తూ వారిని మోసం చేసిన వాళ్లెవ‌రూ అనే అంశాల‌తో ఈ సినిమా రూపొందింది. థియేట‌ర్ల‌లో రిలీజ్‌కు ముందు కేర‌ళ స్టోరీ 2ను చాలానే వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కేర‌ళ సీఎం ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేర‌ళ స్టోరీకి వ్య‌తిరేకంగా హైకోర్టులో కేసులో వేశారు. ప‌లు అడ్డంకుల‌ను దాటుకొని ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

Advertisement
Advertisement