త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | రూటు మార్చిన మ‌హాన‌టి – బాలీవుడ్ మూవీలో బోల్డ్ రోల్‌

మ‌హాన‌టి కీర్తి సురేష్ కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ బోల్డ్ రోల్ చేస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బాలీవుడ్‌లో ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీని అంగీక‌రించింద‌ట‌ కీర్తి సురేష్‌. ఈ సినిమాలో గ్లామ‌ర‌స్ రోల్‌లో ఈ కోలీవుడ్ బ్యూటీ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Jun 2, 2026, 6.44 pm IST

Keerthy Suresh | రూటు మార్చిన మ‌హాన‌టి – బాలీవుడ్ మూవీలో బోల్డ్ రోల్‌
Advertisement

Keerthy Suresh |ద‌క్షిణాదిలో ట్రెడిష‌న‌ల్ రోల్స్‌లో క‌నిపిస్తోన్న కొంద‌రు హీరోయిన్లు బాలీవుడ్‌లో మాత్రం అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొడుతోన్నారు. హై జ‌వానీతో ఇష్క్ హోనా హైలో పూజా హెగ్డే, కాక్ టెయిల్ 2లో ర‌ష్మిక మంద‌న్న గ్లామ‌ర్ రోల్స్ క‌నిపించ‌డంపై జోరుగా డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. తెలుగులో ప‌ర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ‌లు బాలీవుడ్‌లో మాత్రం గ్లామ‌ర్ ప‌రంగా హ‌ద్దులు దాటేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తాజాగా వీరి బాట‌లోనే మ‌రో హీరోయిన్ అడుగులు వేయ‌బోతుంద‌ట‌. ఫ‌స్ట్ టైమ్ ఓ బోల్డ్ రోల్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు మ‌హాన‌టి కీర్తి సురేష్‌.

రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ...

ద‌క్షిణాదిలో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇటీవ‌లే బాలీవుడ్‌లో ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఫ్యాష‌న్ ప్ర‌పంచంలోని చీక‌టి కోణాల‌ను ఆవిష్క‌రిస్తూ ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో కీర్తి సురేష్ అల్ట్రా మోడ్ర‌న్ యువ‌తిగా క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం.ఆమె క్యారెక్ట‌ర్ డిజైనింగ్‌, డైలాగ్స్ చాలా బోల్డ్‌గా ఉంటాయ‌ట‌. ఈ బాలీవుడ్ మూవీతో కొత్త మ‌హాన‌టిని చూడ‌టం ఖాయ‌మంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌. అత‌డెవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే రివీల్ కానున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

రౌడీ జ‌నార్ధ‌న...

ప్ర‌స్తుతం తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రౌడీ జ‌నార్ధ‌న సినిమా చేస్తోంది కీర్తి సురేష్‌. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌మిళం, మ‌ల‌యాళంలో కీర్తి సురేష్ న‌టించిన ఈ సినిమాలు ఈ ఏడాదే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి.

 

Advertisement
Advertisement