త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | ఓటీటీలోకి కీర్తి సురేష్ బోల్డ్ మూవీ – త‌మిళంలో హిట్ – తెలుగులో డిజాస్ట‌ర్‌

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన బోల్డ్ మూవీ డోర‌తి త‌మిళంలో సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌గా తెలుగులో మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది. కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కాన్సెప్ట్‌తో రూపొందిన డోర‌తీ ఓటీటీలోకి వ‌స్తోంది. అక్టోబ‌ర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Oct 11, 2026, 4.02 pm IST

Keerthy Suresh | ఓటీటీలోకి కీర్తి సురేష్ బోల్డ్ మూవీ –  త‌మిళంలో హిట్ – తెలుగులో డిజాస్ట‌ర్‌
Advertisement

Keerthy Suresh |కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ డోర‌తీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటోంది. సొసైటీలో ట్రాన్స్‌జెండ‌ర్లు ఎదుర్కొంటున్న వివ‌క్ష‌, క‌ష్టాల‌తో ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇళ‌య‌రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో రిషికాంత్‌, స‌నంద్‌ హీరోలుగా న‌టించారు.

కోలీవుడ్‌లో హిట్‌...

డోర‌తీ మూవీ టొరంటోతో పాటు ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. ఇటీవ‌లే థియేట‌ర్లలో త‌మిళంతో పాటు తెలుగులో రిలీజైంది. కోలీవుడ్‌లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్ మాత్రం ప‌ట్టించుకోలేదు.

ఓటీటీలోకి...

కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కాన్సెప్ట్‌తో రూపొందిన డోర‌తీ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. అక్టోబ‌ర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. త‌మిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది.
ట్రాన్స్‌జెండ‌ర్ల ప‌ట్ల స‌మాజంలో ఉన్న చిన్న‌చూపు, వారికి ఎదుర‌య్యే అవ‌మానాల‌ను బోల్డ్‌గా ఈ సినిమాలో చూపించారు. గే క‌ల్చ‌ర్‌ను ప్రోత్స‌హించేలా ఈ సినిమా ఉందంటూ మ‌లేషియాతో పాటు మ‌రికొన్ని దేశాలు  బ్యాన్ చేశాయి. త‌మిళ‌నాడులోనూ ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ  గొడ‌వ‌లు జ‌రిగాయి. ఇళ‌య‌రాజా సంగీతం అందించిన 1540వ సినిమా ఇది.

నిడివి త‌క్కువే...

డోర‌తీ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర నిడివి త‌క్కువే అయినా అద్భుత న‌ట‌న‌తో త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. సుబ్బు (స‌నంద్‌), కార్తి( రిషికాంత్‌) ప్రాణ స్నేహితులు. చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసే పెరుగుతారు. పెరిగి పెద్ద‌య్యేకొద్ది సుబ్బులో స్త్రీ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. స‌మాజం, కుటుంబం నుంచి ఎదుర‌య్యే అవ‌మానాల కార‌ణంగా పైకి మ‌గాడిగానే న‌టిస్తుంటాడు. అలాంటి టైమ్‌లోనే సుబ్బు కుటుంబంలోకి డోర‌తీ వ‌స్తుంది. ఆమె ఎవ‌రు? డోర‌తీ రాక‌తో సుబ్బు జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి? డోర‌తీ ఎలా చ‌నిపోయింది? సుబ్బును చంపాల‌ని కార్తి ఎందుకు అనుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఓటీటీలో పోటీ....

డోర‌తీతో పాటు కీర్తి సురేష్ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన తెలుగు మూవీ ది ప్యార‌డైజ్ ఒక్క రోజు గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. ఓటీటీలో కూడా ఈ రెండు సినిమాలు ఒకే టైమ్‌లో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నాని హీరోగా న‌టించిన ప్యార‌డైజ్ మూవీ కూడా అక్టోబ‌ర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement