త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | ఇద్ద‌రు మ‌గాళ్లు ప్రేమ‌లో ప‌డితే – తెలుగులో రిలీజ్ అవుతోన్న కీర్తి సురేష్ వివాదాస్ప‌ద‌ సినిమా

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన డోర‌తీ మూవీపై త‌మిళ‌నాట విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. స్క‌లింగ సంప‌ర్కుల ప్రేమ‌క‌థ‌తో డైరెక్ట‌ర్ కార్తిక్ సుబ్బ‌రాజు తెర‌కెక్కించిన ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ త‌మిళ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది. అక్టోబ‌ర్ 2న తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

N

Entertainment | Published On Sep 26, 2026, 3.42 pm IST

Keerthy Suresh | ఇద్ద‌రు మ‌గాళ్లు ప్రేమ‌లో ప‌డితే – తెలుగులో రిలీజ్ అవుతోన్న కీర్తి సురేష్ వివాదాస్ప‌ద‌ సినిమా
Advertisement

Keerthy Suresh | కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ కోలీవుడ్ మూవీ డోర‌తిపై ప్ర‌శంస‌ల కంటే విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా వ‌స్తోన్నాయి. ఈ శుక్ర‌వారం రిలీజైన ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. స్వ‌లింగ సంప‌ర్కం కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన డోర‌తీని మ‌లేషియా, ఖ‌త‌ర్‌తో పాటు మ‌రికొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. ఈ సినిమా క‌థ‌, ఇందులోని సీన్ల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. ఇద్ద‌రు మ‌గాళ్లు ప్రేమ‌లో ప‌డ‌టం, వారి మ‌ధ్య ఇంటిమేట్ సీన్లు పెట్ట‌డంపై డైరెక్ట‌ర్ కార్తిక్ సుబ్బ‌రాజును నెటిజ‌న్లు ట్రోల్ చేస్తోన్నారు.

తెలుగులోకి...

ఈ త‌మిళ వివాదాస్ప‌ద మూవీ తెలుగులోకి వ‌స్తోంది. అక్టోబ‌ర్ 2న డోర‌తీ తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. డోర‌తీ అనే పేరుతోనే ఈ మూవీ విడుద‌ల అవుతోంది.

డివైడ్ టాక్‌...

కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కాన్సెప్ట్ కార‌ణంగా త‌మిళంలో డోర‌తీ మూవీకి డివైడ్ టాక్ వ‌చ్చింది. తొలిరోజు కేవ‌లం 69 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే వ‌చ్చాయి. కీర్తి సురేష్ లాంటి స్టార్ హీరోయిన్‌, ఇళ‌య‌రాజా మ్యూజిక్‌, కార్తిక్ సుబ్బ‌రాజు లాంటి అగ్ర ద‌ర్శ‌కుడు రూపొందించిన సినిమా అయినా ఆడియెన్స్ డోర‌తీని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఈ మూవీ కంటే నాని ప్యార‌డైజ్ త‌మిళ వెర్ష‌న్ ఎక్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

ఏడు కోట్ల బ‌డ్జెట్‌...

డోర‌తీ మూవీ ఏడు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందింది. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ సినిమా కోసం కీర్తి సురేష్ త‌న రెమ్యూన‌రేష‌న్‌ను త‌గ్గించుకున్న‌ట్లు స‌మాచారం. ఇళ‌య‌రాజా సంగీతం అందించిన 1540వ సినిమా ఇది.

స్వ‌లింగ‌సంప‌ర్కులు...

కార్తి, సుబ్బు ఇద్ద‌రూ చిన్న‌నాటి స్నేహితులు. స్వ‌లింగ‌సంప‌ర్కులుగా మారుతారు. త‌మ మ‌ధ్య ఉన్న బంధాన్ని బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తారు. డోర‌తీ అనే యువ‌తి కార‌ణంగా వారి జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయ‌నే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది.

స్పెష‌ల్ సాంగ్‌...

డోర‌తీతో పాటు తెలుగు మూవీ ప్యార‌డైజ్‌లో కీర్తి సురేష్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. తెలుగులో ఆమె చేసిన ఫ‌స్ట్ ఐటెంసాంగ్ ఇదే. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. ప్యార‌డైజ్ మొద‌టి రోజే 80 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోగా...డోర‌తీ కోటి కూడా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది.

 

Advertisement
Advertisement