త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | లేడీ గ్యాంగ్‌స్ట‌ర్‌గా కీర్తి సురేష్ – యాక్ష‌న్ అవ‌తార్‌లో మ‌హాన‌టి – ఓటీటీలోకి బాలీవుడ్ వెబ్‌సిరీస్

మ‌హాన‌టి కీర్తి సురేష్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ హిందీలో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. అక్క పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌లో త‌న ఇమేజ్‌కు భిన్నంగా యాక్ష‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్ అక్టోబ‌ర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Sep 29, 2026, 3.28 pm IST

Keerthy Suresh | లేడీ గ్యాంగ్‌స్ట‌ర్‌గా కీర్తి సురేష్ – యాక్ష‌న్ అవ‌తార్‌లో మ‌హాన‌టి – ఓటీటీలోకి బాలీవుడ్ వెబ్‌సిరీస్
Advertisement

Keerthy Suresh |  కీర్తి సురేష్ పేరు చెప్ప‌గానే ఎక్కువ‌గా సాఫ్ట్ రోల్స్ గుర్తొస్తాయి. అందం, అమాయ‌క‌త్వం క‌ల‌బోసిన స‌గ‌టు అమ్మాయి పాత్ర‌ల్లోనే ఈ మ‌హాన‌టి ఎక్కువ‌గా క‌నిపించింది. ఫ‌స్ట్ టైమ్ ఓ బాలీవుడ్ వెబ్‌సిరీస్ కోసం త‌న ఒరిజిన‌ల్ ఇమేజ్‌ను ప‌క్క‌న‌పెట్టేసింది. కంప్లీట్ యాక్ష‌న్ రోల్‌తో ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యింది. కీర్తి సురేష్‌, రాధికా ఆప్టే ప్ర‌ధాన పాత్ర‌ల్లో హిందీలో అక్క పేరుతో ఓ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సిరీస్‌కు ధ‌ర్మ‌రాజ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌...

అక్క వెబ్‌సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో పాటు రిలీజ్ డేట్ ఖ‌రార‌య్యాయి.గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌ అక్టోబ‌ర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల అవుతోంది.

లేడీ గ్యాంగ్‌స్ట‌ర్‌...

అక్క వెబ్‌సిరీస్‌లో లేడీ గ్యాంగ్‌స్ట‌ర్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో కీర్తి సురేష్ క‌నిపించ‌బోతుంది. పెర్నూర్ అనే న‌గ‌రంలో బంగారం అక్ర‌మ వ్యాపారాన్ని సాగించే ఓ లేడీ గ్యాంగ్ చుట్టూ ఈ వెబ్‌సిరీస్ సాగ‌నుంది. ఈ మాఫియా గ్యాంగ్‌కు నాయ‌కురాలిగా ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో కీర్తి సురేష్ క‌నిపించ‌బోతుంది. ఈ మాఫియా సామ్రాజ్యంలో విభేదాలు సృష్టించి వారిని నాశ‌నం చేయాల‌ని కుట్ర‌లు ప‌న్నింది ఎవ‌రు? శ‌త్రువుల ప‌న్నాగాల‌ను గ్యాంగ్ లీడ‌ర్ ఎలా తిప్పికొట్టింది అనే అంశాల‌తో ధ‌ర్మ‌రాజ్ శెట్టి ఈ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కిస్తోన్నారు. యాక్ష‌న్ రోల్‌లో కీర్తి సురేష్ న‌ట‌న‌, ఆమెపై వ‌చ్చే యాక్ష‌న్ సీన్స్ స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయ‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

ఫ‌స్ట్ వెబ్‌సిరీస్‌...

కీర్తి సురేష్ న‌టిస్తోన్న తొలి వెబ్‌సిరీస్ ఇది. ఈ హిందీ సిరీస్‌తోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. త‌న్వీ ఆజ్మీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. బేబీ జాన్‌తో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్‌. ఈ మూవీ త‌ర్వాత ఆమె హిందీలో చేస్తోన్న సెకండ్ ప్రాజెక్ట్ ఇది.

 

Advertisement
Advertisement