త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA | సున్నం చెరువు, తమ్మిడికుంట అభివృద్ధిపై హైడ్రా ఫోకస్

HYDRAA | సున్నం చెరువుతో పాటు తమ్మిడికుంట పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అధికారులను ఆదేశించారు. చెరువుల్లో పూడిక పూర్తిస్థాయిలో తొలగించి లోతు పెంచిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. చెరువుల చుట్టూ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

P

Hyderabad | Published On Sep 29, 2026, 4.55 pm IST

HYDRAA | సున్నం చెరువు, తమ్మిడికుంట అభివృద్ధిపై హైడ్రా ఫోకస్
Advertisement
  • ప‌నుల‌ను ప‌రిశీలించిన క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌
  • ప‌రిస‌రాల‌ను సుంద‌రంగా తీర్చిదిద్దాల‌ని ఆదేశం

HYDRAA | సున్నం చెరువుతో పాటు తమ్మిడికుంట పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అధికారులను ఆదేశించారు. చెరువుల్లో పూడిక పూర్తిస్థాయిలో తొలగించి లోతు పెంచిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. చెరువుల చుట్టూ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం క్షేత్రస్థాయిలో సున్నం చెరువు, తమ్మిడికుంట పరిసరాలను పరిశీలించిన కమిషనర్‌.. చెరువుల చుట్టూ బలమైన ఫెన్సింగ్‌, పాత్‌వే, గ్రీనరీ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దసరా పండుగ రోజుల్లో ఈ రెండు చెరువులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

సున్నం చెరువు ఇన్‌లెట్‌ కాలువతో పాటు అక్కడ కల్వర్టు నిర్మించి రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్‌ ఆదేశించారు. గాయత్రినగర్‌, బోరబండ ప్రాంతాల నుంచి చెరువుకు వచ్చే మార్గాలను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాలను సైతం సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సున్నం చెరువును ఆనుకుని ఉన్న ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులను కూడా కమిషనర్‌ పరిశీలించారు.

ఒకప్పటి సున్నం చెరువుకు, ప్రస్తుతం కనిపిస్తున్న చెరువుకు ఎంతో మార్పు వచ్చిందని స్థానికులు హైడ్రా కమిషనర్‌ను కలిసి అభినందించారు. చెరువులో పూర్తిస్థాయిలో నీరు ఉంటే మరింత నయనమనోహరంగా కనిపించేదని పేర్కొన్నారు. పలు ఆటంకాలను అధిగమించి చెరువును సుందరంగా తీర్చిదిద్దినందుకు హైడ్రాను అభినందించారు. ఎన్‌ కన్వెన్షన్‌ను తొలగించి తమ్మిడికుంటను అభివృద్ధి చేసిన తీరును కూడా పలువురు ప్రశంసించారు. త్వరలో ప్రారంభానికి సిద్ధం చేస్తున్న సున్నం చెరువు, తమ్మిడికుంట వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, సీఎంసీ కమిషనర్‌ సృజన సమీక్షించారు.

Advertisement
Advertisement