త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OPPO K14 Plus | ఒప్పో నుంచి కె14 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్‌.. 8000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో అదిరిపోయింది..

OPPO K14 Plus | మొబైల్స్ త‌యారీ సంస్థ ఒప్పో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ ఒప్పో కె14 ప్ల‌స్ 5జిని భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ విభాగానికి చెందిన వినియోగ‌దారుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో ప‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అధిక బ్యాట‌రీ బ్యాక‌ప్‌తోపాటు ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, వాట‌ర్‌, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.

S

Technology | Published On Sep 29, 2026, 5.01 pm IST

OPPO K14 Plus | ఒప్పో నుంచి కె14 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్‌.. 8000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో అదిరిపోయింది..
Advertisement

OPPO K14 Plus | మొబైల్స్ త‌యారీ సంస్థ ఒప్పో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ ఒప్పో కె14 ప్ల‌స్ 5జిని భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ విభాగానికి చెందిన వినియోగ‌దారుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో ప‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అధిక బ్యాట‌రీ బ్యాక‌ప్‌తోపాటు ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, వాట‌ర్‌, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో లాంచ్ చేశారు. వర్చువల్ ర్యామ్‌ను అదనంగా 16 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. వేడిని నియంత్రించేందుకు 5,000 చదరపు మిల్లీమీటర్ల వేపర్ ఛాంబర్‌ను అందించారు.

8000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ..

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 8000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇది 45 వాట్ల సూపర్‌వూక్ వైర్డ్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 1,800 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ ప్రారంభ సామర్థ్యంలో కనీసం 80 శాతం నిలుపుకుంటుందని కంపెనీ తెలిపింది. రోజువారీ ఛార్జింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఇది సుమారు ఆరేళ్ల కాలానికి సమానమని ఒప్పో పేర్కొంది. గేమింగ్‌ వంటి ఎక్కువ సమయం కొనసాగే పనుల సమయంలో బైపాస్ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. ఇతర పరికరాలకు విద్యుత్‌ అందించేందుకు 10 వాట్ల రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ కూడా అందించారు. కంపెనీ అంతర్గత పరీక్షల ప్రకారం సాధారణ మిశ్రమ వినియోగంలో బ్యాటరీ 2.95 రోజుల వరకు పనిచేస్తుంది. నిర్మాణ పరంగా ఏఎం04 ఏరోస్పేస్‌-గ్రేడ్ అల్యూమినియం అలాయ్ చాసిస్‌, స్ట్రక్చరల్ కొలిజన్ ఫ్రేమింగ్‌, అంతర్గత కార్నర్ కుషనింగ్‌తో కూడిన ఆర్మర్ బాడీని ఈ ఫోన్‌లో ఉపయోగించారు. దుమ్ము, నీటి రక్షణ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కె ధ్రువీకరణలు ఉన్నాయి. నీటి జెట్లు, ఆవిరితో శుభ్రపరచడం, ఎక్కువసేపు నీటిలో ఉండడం వంటి పరిస్థితులను తట్టుకునేలా ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

ప‌వ‌ర్‌ఫుల్ ఫీచ‌ర్లు..

ఈ ఫోన్‌లో 6.78 ఇంచుల 1.5కె అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. అందువల్ల ఔట్ డోర్ లో డిస్‌ప్లే స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఈ ఫోన్‌లో ఆప్టిక‌ల్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ ప్ర‌ధాన కెమెరా, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఆధారిత క‌ల‌ర్ ఓఎస్‌16ను ఇచ్చారు. ఈ ఫోన్‌ను ఐఫోన్ల‌కు సుల‌భంగా క‌నెక్ట్ చేసి ఫైల్స్‌ను ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చ‌ని కంపెనీ తెలిపింది. అలాగే ఏఐ లింక్ బూస్ట్ 4.0 అనే టెక్నాల‌జీ ద్వారా వైఫై, సిమ్ సిగ్న‌ల్‌ను మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. స్పామ్ కాల్స్‌ను ఆటోమేటిగ్గా గుర్తించే స‌దుపాయం ఇచ్చారు. ఈ ఫోన్‌ను 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256 స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. డ్యుయ‌ల్ సిమ్ స‌పోర్ట్ ఉంది. 5జి, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి త‌దిత‌ర క‌నెక్టివిటీ ఫీచ‌ర్ల‌ను అందించారు.

ధ‌ర‌, ఆఫ‌ర్ల వివ‌రాలు..

ఒప్పో కె14 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌ను మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియెంట్ల‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.29,999 ఉండ‌గా, లాంచ్ ఆఫ‌ర్ల అనంత‌రం రూ.25,999కు ల‌భిస్తుంది. 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.32,999 ఉండగా, ఆఫ‌ర్ల త‌రువాత రూ.28,999కు పొంద‌వ‌చ్చు. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.35,999 ఉండ‌గా, లాంచ్ ఆఫ‌ర్ల‌తో రూ.31,999కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్‌పై లాంచింగ్ సంద‌ర్భంగా ప‌లు బ్యాంకుల కార్డుల‌తో రూ.4వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. 6 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం ఉంది. సోలార్ ఆరెంజ్‌, స్టార్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. అక్టోబ‌ర్ 8 నుంచి ఈ ఫోన్‌ను ఫ్టిప్‌కార్ట్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Advertisement
Advertisement