త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | త‌మిళ ఇండ‌స్ట్రీ అంటే అంత చిన్న‌చూపా? – క‌య‌దు లోహ‌ర్‌పై ఫ్యాన్స్ ఫైర్‌

క‌య‌దు లోహ‌ర్‌పై త‌మిళ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. డ్రాగ‌న్ బ్యూటీ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళ మూవీ ఐ యామ్ గేమ్‌, త‌మిళ సినిమా ఇమ్మోర్ట‌ల్ సెప్టెంబ‌ర్ 3న రిలీజ్ అవుతున్నాయి. ఇమ్మోర్ట‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉంటున్న క‌య‌దు లోహ‌ర్ ఐ యామ్ గేమ్ ప్ర‌మోష‌న్స్‌లో యాక్టివ్‌గా పాల్గొన‌డంపై కోలీవుడ్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

N

Entertainment | Published On Aug 31, 2026, 2.26 pm IST

Kayadu Lohar | త‌మిళ  ఇండ‌స్ట్రీ అంటే అంత చిన్న‌చూపా? – క‌య‌దు లోహ‌ర్‌పై ఫ్యాన్స్ ఫైర్‌
Advertisement

Kayadu Lohar |  ప్యార‌డైజ్ హీరోయిన్ క‌య‌దు లోహ‌ర్‌పై కోలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. త‌మిళ సినిమా అంటే అంత చిన్న‌చూపా అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళ మూవీ ఐ యామ్ గేమ్‌, త‌మిళ సినిమా ఇమ్మోర్ట‌ల్ ఒకే రోజు థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. సెప్టెంబ‌ర్ 3న రిలీజ్ అవుతున్నాయి. ఆదివారం ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జ‌రిగాయి. ఇమ్మోర్ట‌ల్‌ను స్కిప్ చేసిన క‌య‌దు లోహ‌ర్ ఐ యామ్ గేమ్ వేడుక‌లో పాల్గొన్న‌ది. ఈ వేడుక‌కు ముందు జ‌రిగిన‌ ఇమ్మోర్ట‌ల్ ప్ర‌మోష‌న్స్‌లో క‌య‌దు క‌నిపించ‌లేదు.

మ‌ల‌యాళ‌మే ఎక్కువా...

త‌మిళ సినిమా కంటే మ‌ల‌యాళ సినిమాకు ఈ బ్యూటీ ఎక్కువ‌గా ప్రాధాన్య‌త‌ ఇవ్వ‌డంపై కోలీవుడ్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మిళంలో ఇప్ప‌టివ‌ర‌కు డ్రాగ‌న్‌తో పాటు ఇద‌యం ముర‌ళి సినిమాలు చేసింది క‌య‌దు లోహ‌ర్‌. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందు ఇమ్మోర్ట‌ల్‌ను అంగీక‌రించింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్ర‌కాష్ హీరోగా న‌టించిన ఈ సినిమాతోనే క‌య‌దు లోహ‌ర్ త‌మిళంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ నిర్మాణ ప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల రిలీజ్ ఆల‌స్య‌మైంది. క‌య‌దు లోహ‌ర్ మూడో త‌మిళ సినిమాగా రిలీజ్ కాబోతుంది.

చిన్న‌చూపు...

క‌య‌దు లోహ‌ర్‌కు క్రేజ్‌, స్టార్‌డ‌మ్ లేని టైమ్‌లో హీరోయిన్‌గా ఆమెకు ఇమ్మోర్ట‌ల్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అవ‌కాశ‌మిచ్చార‌ని, కానీ ఇప్పుడు అదే సినిమా ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉండ‌టం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు. త‌మిళ సినిమాలే క‌య‌దుకు పేరు, గుర్తింపును తీసుకొచ్చాయ‌ని, వాటిని చిన్న‌చూపు చూడ‌టం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఈ డ్రాగ‌న్ బ్యూటీని ట్రోల్ చేస్తున్నారు. ఇమ్మోర్ట‌ల్ ఈవెంట్‌కు అటెండ్ కాలేక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ చిన్న వీడియో బైట్ లాంటిది కూడా క‌య‌దు రిలీజ్ చేయ‌క‌పోవ‌డం త‌మిళ ఫ్యాన్స్ కోపాన్ని మ‌రింత పెంచుతుంది. హీరోయిన్‌గా ఒక‌టి, రెండు విజ‌యాలు ద‌క్క‌గానే గ‌ర్వం త‌ల‌కెక్కిందంటూ ఓ నెటిజ‌న్ పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. కోలీవుడ్ ఇండ‌స్ట్రీ ఆమెను బ్యాన్ చేయాలంటూ కామెంట్లు పెడుతోన్నారు. నెటిజ‌న్లు పెట్టిన పోస్ట్‌లు వైర‌ల్ అవుతోన్నాయి.

జీవీ ప్ర‌కాష్ రియాక్ష‌న్‌...

ఈ వివాదంపై జీవీ ప్ర‌కాష్‌ను రియాక్ట్ అయ్యారు. ఇమ్మోర్ట‌ల్ ఈవెంట్‌కు ఎందుకు అటెండ్ కాలేదో ఆమెనే అడిగితే బెట‌ర్ అని కామెంట్స్ చేశారు.
నాని ప్యార‌డైజ్‌...
ప్ర‌స్తుతం క‌య‌దు లోహ‌ర్ ద‌క్షిణాదిలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. త‌మిళంలో సూర్య 48తో సినిమాతో మ‌రో సినిమాను అంగీక‌రించింది. తెలుగులో నాని ప్యార‌డైజ్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. సెప్టెంబ‌ర్ 24న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

Advertisement
Advertisement