త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | వ‌య‌సులో 30 ఏళ్లు పెద్ద – ఆ హీరోతో క‌య‌దు లోహ‌ర్ రొమాన్స్ – నెటిజ‌న్ల ట్రోల్స్‌

ప్ర‌స్తుతం క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఆరు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. తాజాగా అమ్మ‌డు మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమాకు ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. అజిత్ హీరోగా ఆదిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాలో క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా ఫిక్సైన‌ట్లు చెబుతున్నారు.

N

Entertainment | Published On Jul 14, 2026, 5.12 pm IST

Kayadu Lohar | వ‌య‌సులో 30 ఏళ్లు పెద్ద – ఆ హీరోతో క‌య‌దు లోహ‌ర్ రొమాన్స్ – నెటిజ‌న్ల ట్రోల్స్‌
Advertisement

Kayadu Lohar |  ప్ర‌స్తుతం ద‌క్షిణాది చిత్రసీమలో క‌య‌దు లోహ‌ర్ హ‌వా న‌డుస్తోంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం... మూడు భాష‌ల్లో ఈ అమ్మ‌డు ఫుల్‌ బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం క‌య‌దు లోహ‌ర్ న‌టిస్తున్న ఆరు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. తాజాగా మ‌రో సినిమాకు ఓకే చెప్పింది. త‌మిళ అగ్ర హీరో అజిత్‌తో జోడీ క‌ట్ట‌బోతుంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ త‌ర్వాత‌....

గుడ్ బ్యాడ్ అగ్లీ త‌ర్వాత అజిత్ హీరోగా ఆధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రాబోతుంది. ఈ సినిమాతోనే అజిత్ నిర్మాత‌గా మార‌బోతున్నాడు. కోయంబ‌త్తూరుకు చెందిన ఓ వ్యాపార‌వేత్త‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొదలైన‌ట్లు తెలిసింది.

రెమ్యూన‌రేష‌న్ వ‌ల్లే...

ఈ సినిమా కోసం అజిత్ నిర్మాత‌గా మార‌డానికి అత‌డి భారీ రెమ్యూన‌రేష‌న్‌ కార‌ణ‌మ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు అజిత్ 150 కోట్ల‌కుపైగా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేస్తున్నారు. గ‌త కొన్నేళ్లుగా అజిత్‌కు స‌రైన హిట్లు లేవు. అత‌డి గ‌త సినిమాలు నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చాయి. అజిత్ పారితోషికం కార‌ణంగా ఆధిక్ ర‌విచంద్ర‌న్ సినిమాను తెర‌కెక్కించ‌డానికి నిర్మాత‌లెవ‌రూ ముందుకు రాలేదు. దాంతో అజిత్ స్వ‌యంగా ప్రొడ‌క్ష‌న్‌లోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతున్నారు.

క‌య‌దు లోహ‌ర్‌...

కాగా అజిత్, ఆధిక్ ర‌విచంద్ర‌న్ సినిమాలో క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని టాక్‌. ఇటీవ‌లే ఈ ముద్దుగుమ్మ‌ను క‌లిసిన డైరెక్ట‌ర్ ఆధిక్ క‌థ‌ను వినిపించిన‌ట్లు స‌మాచారం. అజిత్ సినిమాలో అవ‌కాశం కావ‌డంతో క‌య‌దు సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ సినిమాకు ఓకే చెప్పింద‌ట‌. అజిత్‌కు జోడీగా ఆమె క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. కాగా అజిత్‌, క‌య‌దు లోహ‌ర్ ఏజ్ గ్యాప్‌పై నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అజిత్ వ‌య‌సు 55 ఏళ్లు కాగా...క‌య‌దు లోహ‌ర్‌కు 26 సంవ‌త్స‌రాలు ఉన్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య దాదాపు 30 ఏళ్లు తేడా ఉండ‌టంపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కూతురు వ‌య‌సున్న హీరోయిన్‌తో రొమాన్స్ ఏంటి అని అజిత్ ను ఉద్దేశించి కామెంట్లు పెడుతోన్నారు. క‌య‌దుపై కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రెమ్యూన‌రేష‌న్ కోస‌మే సినిమాలు చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు.

నాని ప్యార‌డైజ్‌...

తెలుగులో ప్ర‌స్తుతం నాని ప్యార‌డైజ్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది క‌య‌దు లోహ‌ర్‌. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో సుబ్బ‌ల‌క్ష్మి అనే అమ్మాయిగా క‌నిపించ‌బోతుంది. ఇటీవ‌లే సూర్య‌, టీజే జ్ఞాన‌వేళ్ సినిమాను అంగీక‌రించింది.

 

Advertisement
Advertisement