Sreeleela | రూమర్లకు చెక్ పెట్టిన శ్రీలీల – సెట్స్‌పైకి తమిళ మూవీ – నిర్మాతగా కోలీవుడ్ స్టార్ హీరో భార్య
అజిత్ డేర్‌డెవిల్ మూవీ పూజా కార్యక్రమాలు సోమవారం చెన్నైలో జరిగాయి. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌కు శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు వచ్చిన వార్తలకు ఈఈవెంట్‌తో శ్రీలీల చెక్ పెట్టింది.
Entertainment | Published On Nov 2, 2026, 6.26 pm IST
Sreeleela | అజిత్ హీరోగా నటిస్తోన్న తమిళ మూవీ డేర్‌డెవిల్ నుంచి శ్రీలీల (Sreeleela )తప్పుకున్నట్లు గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. శ్రీలీల ప్లేస్‌లో కయదు లోహర్‌ను మేకర్స్ ఎంపికచేసినట్లు వార్తలొచ్చాయి. ఈ రూమర్లకు అఫీషియల్‌గా చెక్ పెట్టింది శ్రీలీల.
ప్రత్యేక ఆకర్షణ...
డేర్‌డెవిల్ మూవీ పూజా కార్యక్రమాలను సోమవారం చెన్నైలో నిర్వహించారు. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌లో శ్రీలీల పాల్గొన్నది. ఈ వేడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కథను మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో ధమాకా బ్యూటీ కనిపించబోతుంది.
షాలిని నిర్మాత...
డేర్‌డెవిల్ మూవీకి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ షాలిని నిర్మాతగా అరంగేట్రం చేస్తోంది. భర్త సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది.
అజిత్ దూరం...
డేర్‌డెవిల్ ఓపెనింగ్ ఈవెంట్‌కు హీరో అజిత్ మాత్రం అటెండ్ కాలేదు. రేసింగ్ ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లడంతో ఈ వేడుకకు దూరమయ్యారు. ఈ తమిళ మూవీ షూటింగ్ నవంబర్ రెండో వారం నుంచి హైదరాబాద్‌లో మొదలుకాబోతున్నట్లు సమాచారం. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియన్ మూవీ రూపొందుతోన్నట్లు చెబుతోన్నారు.
మూడో సినిమా...
శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న మూడో తమిళ మూవీ ఇది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన పరాశక్తితో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ధనుష్‌తో ఓం అనే సినిమా చేస్తోంది. తెలుగుకు దూరమైన శ్రీలీల...కోలీవుడ్, బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Immortal Movie Review | రక్తం తాగే ఏలియన్ అందమైన అమ్మాయిగా మారితే – కయదు లోహర్ హారర్ మూవీ ఎలా ఉందంటే?
నవంబర్ 1, 2026

Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడలి తమిళ మూవీ – టాలీవుడ్ హీరోలతో పోటీ…
నవంబర్ 1, 2026

Jailer 2 Collections | 800 కోట్లకు చేరువలో జైలర్ 2 – తెలుగులో రజనీకాంత్ సినిమాకు భారీ లాభాలు
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●Harish Rao | ఎండిన పంటలను పరిశీలిస్తూ.. అండగా ఉంటామని భరోసానిస్తూ
- ●US Halloween Mass Shootings | 'హాలోవీన్' వేళ అమెరికాలో తూటాల వర్షం: గర్భిణీ సహా 13 మంది మృతి, 90 మందికి పైగా గాయాలు
- ●ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు..
- ●TTD | ముగిసిన టీటీడీ బోర్డు పాలకవర్గం.. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు..
- ●Hackers hijacked digital billboards | బిల్ బోర్డులపై హ్యాకర్ల దాడి.. అశ్లీల వీడియోల ప్రసారం
- ●Thummala Nageshwar Rao | మార్కెట్లలో ఏఐని మనమే మొదలు తీసుకొద్దాం

Harish Rao | ఎండిన పంటలను పరిశీలిస్తూ.. అండగా ఉంటామని భరోసానిస్తూ

US Halloween Mass Shootings | 'హాలోవీన్' వేళ అమెరికాలో తూటాల వర్షం: గర్భిణీ సహా 13 మంది మృతి, 90 మందికి పైగా గాయాలు

ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు..

TTD | ముగిసిన టీటీడీ బోర్డు పాలకవర్గం.. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు..



