Kayadu Lohar | రామ్ సినిమాకు హీరోయిన్ కష్టాలు – శ్రీనిధి శెట్టి ప్లేస్‌లో డ్రాగన్ బ్యూటీకి ఛాన్స్?
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. కాగా రామ్ డైరెక్షనల్ డెబ్యూ మూవీకి ఇంకా హీరోయిన్ దొరకలేదట. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి
Entertainment | Published On Jun 15, 2026, 3.03 pm IST
Kayadu Lohar | టాలీవుడ్ హీరో రామ్ పోతినేని డైరెక్టర్‌గా మారబోతున్నారు. తానే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. రామ్ బర్త్‌డే సందర్భంగా ఇటీవల ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. రామ్ డైరెక్షనల్ డెబ్యూ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయట. సినిమాకు పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులను కూడా ఫైనల్ చేశారట. కానీ హీరోయిన్ విషయంలోనే కష్టాలు ఎదురవుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేజీఎఫ్ బ్యూటీ...
తొలుత ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో హీరోయిన్ కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని తీసుకోవాలని రామ్ అండ్ టీమ్ ప్లాన్ చేశారు. ఆమెను అప్రోచ్ కూడా అయ్యారట. కానీ ఈ తెలుగు సినిమా కోసం కన్నడ బ్యూటీ కోటిన్నరకుపైగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఆమె రెమ్యూనరేషన్‌ను విని మేకర్స్ షాకయ్యారట. దాంతో శ్రీనిధిని కాదని ఆమె ప్లేస్‌లో కయదు లోహర్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఎనిమిది సినిమాలు...
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కలిపి ఎనిమిది సినిమాలు చేస్తోంది కయదు లోహర్. ఈ అస్సాం బ్యూటీని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసిన నిర్మాతలే ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూస్తోన్నారు. ఈ బిజీ షెడ్యూల్స్ మధ్య రామ్ సినిమాకు కయదు ఒకే చెబుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. కయదు లోహర్‌తో పాటు మరో ఛాయిస్‌గా సంయుక్త మీనన్ పేరు కూడా వినిపిస్తోంది.
లిమిటెడ్ బడ్జెట్‌లో...
రామ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న ఈ సినిమాను అతడి సోదరుడు కృష్ణ చైతన్య నిర్మిస్తోన్నారు. లిమిటెడ్ బడ్జెట్‌లోనే ఈ సినిమాను పూర్తిచేయాలని రామ్ అనుకుంటున్నారట. కానీ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లతోనే అనుకున్న బడ్జెట్ దాటిపోయినట్లు సమాచారం. ఇందులో విలన్ పాత్రలో నటించడానికి ఎస్‌జే సూర్య దాదాపు 8 కోట్లకుపైనే పారితోషికం ఆడిగారట. దాంతో సీనియర్ యాక్టర్లను పక్కనపెట్టి కొత్త వారితో సినిమా తీయాలని రామ్ ఫిక్సైనట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం






