త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | రాజ‌కీయాలు చేయ‌డం నాకు రాదు – త‌మిళ సినిమా కాంట్ర‌వ‌ర్సీపై క‌య‌దు లోహ‌ర్ కామెంట్స్‌

ఈ వారం రిలీజైన త‌మిళ మూవీ ఇమ్మోర్ట‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు క‌య‌దు లోహ‌ర్ దూరంగా ఉండ‌టంపై కోలీవుడ్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. త‌మిళ ఇండ‌స్ట్రీతో పాటు చిన్న హీరోల‌పై ఈ అస్సాం బ్యూటీ వివ‌క్ష చూపుతుంద‌ని కామెంట్లు పెడుతున్నారు. ఈ కాంట్ర‌వ‌ర్సీపై క‌య‌దు లోహ‌ర్ రియాక్ట్ అయ్యింది. ఇమ్మోర్ట‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉండ‌టం వెనుక ఎలాంటి దురుద్దేశం లేద‌ని అన్న‌ది.

N

Entertainment | Published On Sep 4, 2026, 4.28 pm IST

Kayadu Lohar | రాజ‌కీయాలు చేయ‌డం నాకు రాదు – త‌మిళ సినిమా కాంట్ర‌వ‌ర్సీపై క‌య‌దు లోహ‌ర్ కామెంట్స్‌
Advertisement

Kayadu Lohar |ఈ వారం అస్సాం బ్యూటీ క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. మ‌ల‌యాళం మూవీ ఐ యామ్ గేమ్ గురువారం ప్రేక్ష‌కుల ముందుకు రాగా... త‌మిళ సినిమా ఇమ్మోర్ట‌ల్ శుక్ర‌వారం రిలీజైంది. ఈ రెండు సినిమాల్లో క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా క‌నిపించింది. అయితే ఐ యామ్ గేమ్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న ఈ హీరోయిన్ ఇమ్మోర్ట‌ల్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు డుమ్మా కొట్టింది. క‌నీసం ఒక్క ఈవెంట్‌లో కూడా క‌నిపించ‌లేదు.

బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌...

ఇమ్మోర్ట‌ల్ త‌మిళంలో క‌య‌దు లోహ‌ర్ అంగీక‌రించిన ఫ‌స్ట్ మూవీ. రెండేళ్ల క్రితం ఈ ఫాంట‌సీ ల‌వ్‌స్టోరీ షూటింగ్ మొద‌లైంది. వీఎఫ్ఎక్స్‌తో పాటు బ‌డ్జెట్ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల కార‌ణంగా రిలీజ్ ఆల‌స్య‌మైంది. ఈ గ్యాప్‌లో ఇమ్మోర్ట‌ల్‌ త‌ర్వాత క‌య‌దు లోహ‌ర్ అంగీక‌రించిన త‌మిళ సినిమాలు డ్రాగ‌న్‌, ఇద‌యం ముర‌ళి రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ఈ స‌క్సెస్‌ల‌తో క‌య‌దు లోహ‌ర్ స్టార్‌గా మారిపోయింది.

కోలీవుడ్ ఫిల్మ్ ఛాంబ‌ర్‌....

ఇమ్మోర్ట‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు డ్రాగ‌న్ బ్యూటీ దూరంగా ఉండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. చిన్న హీరో సినిమా కావ‌డంతో ఇమ్మోర్ట‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉంద‌ని, దుల్క‌ర్ స్టార్ కావ‌డంతో ఐ యామ్ గేమ్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు అటెండ్ అయ్యిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వివాదం కోలీవుడ్ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ర‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం.
వివ‌ర‌ణ ఇవ్వాల్సిన ప‌నిలేదు...

రాజ‌కీయాలు...

ఈ కాంట్ర‌వ‌ర్సీపై క‌య‌దు లోహ‌ర్ క్లారిటీ ఇచ్చింది. ఇమ్మోర్ట‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు ఎందుకు అటెండ్ కాలేద‌నేదానిపై ఎవ‌రికి వివ‌ర‌ణ ఇవ్వాల్సిన ప‌నిలేద‌ని అన్న‌ది. "ఈ విమ‌ర్శ‌ల వెనుక చాలా రాజ‌కీయాలు, పీఆర్ గేమ్స్ ఉన్నాయి. అలాంటివి చేయ‌డం నాకు రాదు. ఈ ట్రోల్స్‌ను నేను పెద్ద‌గా ప‌ట్టించుకోను. ఐ యామ్ గేమ్ కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డానో అదే స్థాయిలో ఇమ్మోర్ట‌ల్ కోసం శ్ర‌మించాను. కేవ‌లం ప్ర‌మోష‌న్స్‌కు అటెండ్ కాలేద‌నే సాకుతో త‌మిళ ఇండ‌స్ట్రీని త‌క్కువ చేశాన‌ని, చిన్న హీరోల‌పై వివ‌క్ష చూపుతున్నానంటూ కావాల‌నే న‌న్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ కామెంట్లు, విమ‌ర్శ‌లు అల‌వాటైపోయాయి. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌, మీమ్స్‌ను అస్స‌లు ప‌ట్టించుకోను" అని క‌య‌దు అన్న‌ది.

దురుద్దేశం లేదు...

అంతే కాకుండా "సినిమా షూటింగ్ అంటే కేవ‌లం యాక్టింగ్ చేయ‌డం ఒక్క‌టి మాత్ర‌మే కాదు. దాని వెనుక ఎంతో క‌ష్టం ఉంటుంది. ఇమ్మోర్ట‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు హాజ‌రుకావాల‌ని అనుకున్నాను. కానీ అప్ప‌టికే ఉన్న క‌మిట్‌మెంట్స్‌, టైమ్ లేక‌పోవ‌డం వ‌ల్ల కుద‌ర‌లేదు. అంతే త‌ప్ప దీని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు" అంటూ క‌య‌దు లోహ‌ర్‌ చెప్పింది.
ఆ బేధాలు లేవు...,
త‌మిళం, మ‌ల‌యాళం, తెలుగు అనే భేదాలు లేవ‌ని, త‌న‌కు పేరు, గౌర‌వాన్ని తెచ్చిపెట్టిన సినిమాను ఎప్పుడూ త‌క్కువ చేయ‌న‌ని క‌య‌దు లోహ‌ర్ అన్న‌ది. ఆమె కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.

 

Advertisement
Advertisement