Anupama Parameswaran | మలయాళ బ్యూటీ నయా టాలెంట్ – మెగాఫోన్ పట్టబోతున్న అనుపమ
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తనలోని కొత్త టాలెంట్‌ను బయటపెట్టబోతుంది. త్వరలోనే మెగాఫోన్ పట్టనుంది. మలయాళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీకి అనుపమ పరమేశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
Entertainment | Published On Jul 12, 2026, 3.41 pm IST
Anupama Parameswaran | మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తనలోని కొత్త టాలెంట్‌ను వెలికితీసే ప్రయత్నంలో ఉంది. త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళ సినిమాలతో అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ప్రారంభమైంది. కానీ మాతృభాష కంటే తెలుగు, తమిళంలోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. విభిన్నమైన కథలతో కూడిన నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటోంది. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ త్వరలోనే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చిరకాల కోరిక...
డైరెక్టర్‌గా మారాలన్నది తన చిరకాల కోరిక అంటూ పలు సినిమా ఈవెంట్లలో ఈ అమ్మడు చెప్పింది. ప్రస్తుతం ఆ కలను నెరవేర్చుకునే పనిలో ఉంది. ఓ మలయాళ లేడీ ఓరియెంటెడ్ మూవీకి అనుపమ దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డైరెక్షనల్ డెబ్యూ మూవీ కోసం ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఓ వైపు యాక్టర్‌గా సినిమాలు చేస్తూనే గ్యాప్‌లో కథను రాసుకుందని అంటున్నారు. డైలాగ్ వెర్షన్‌తో సహా స్క్రిప్ట్ మొత్తం రెడీ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు కేవలం దర్శకురాలిగా మాత్రమే అనుపమ కనిపించనున్నట్లు సమాచారం. ఓ స్టార్ హీరోయిన్ లీడ్ రోల్‌లో నటించనుందని చెబుతున్నారు. త్వరలోనే అనుపమ పరమేశ్వరన్ డైరెక్షనల్ డెబ్యూ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలిసింది. ఈ మలయాళ సినిమాను తెలుగు, తమిళంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్...
గతంలో మణియారాయిలే అశోకన్ అనే మలయాళ సినిమాకు అనుపమ పరమేశ్వరన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
భోగి...క్రేజీ కళ్యాణం
ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌తో భోగి సినిమా చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కందుల సులోచన రాణి అనే పాత్రలో కనిపించబోతుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీ ఆగస్ట్‌లో రిలీజ్ కాబోతుంది. భోగితో పాటు క్రేజీ కళ్యాణం పేరుతో రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తోంది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ రెండు సినిమాలు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కబోతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

S Janaki | దిగ్గజ గాయని ఎస్ జానకి కన్నుమూత – అరవై ఏళ్ల సినీ ప్రయాణం – యాభై వేల పాటలు
జులై 11, 2026

AMMA | ‘అమ్మా’కు రేవతి, పద్మప్రియ గుడ్‌బై.. భద్రత, గౌరవం కల్పించడంలో విఫలమైందని ఆరోపణలు
జులై 7, 2026

Parvathy Thiruvothu | హీరోలంటే దేవుళ్లు కాదు – స్టార్ కల్చర్‌పై మలయాళ హీరోయిన్ సంచలన కామెంట్స్
జులై 7, 2026
తాజావార్తలు
- ●Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు
- ●DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే
- ●MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
- ●Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ
- ●Argentina vs Switzerland | ఎక్స్ట్రా టైమ్‌లో విశ్వరూపం: స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా!
- ●Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైదరాబాద్‌కు చెందిన టీచర్ మృతి

Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు

DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే

MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ



