Kayadu Lohar | నితిన్‌కు రుక్మిణి దొరికిందా? – రచయితగా కయదు లోహర్
నాచురల్ స్టార్ నాని నిర్మాతగా నితిన్ హీరోగా అలియాస్ రుక్మిణి పేరుతో ఇటీవలే ఓ కొత్త మూవీ ప్రారంభైమంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కయదు లోహర్ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Aug 14, 2026, 5.48 pm IST
Kayadu Lohar |నాచురల్ స్టార్ నాని సినిమా అంటే హిట్టే అనే నమ్మకం ఆడియెన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తుంది. హీరోగా ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు నిర్మాతగా కూడా కంటెంట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. స్వీయ నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్‌పై గత ఏడాది నాని నిర్మించిన కోర్ట్ మూవీ చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది. కోర్ట్ తర్వాత నిర్మాతగా తన నెక్స్ట్ మూవీని నాని ఇటీవలే అనౌన్స్ చేశాడు. అలియాస్ రుక్మిణి పేరుతో రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు.
దండోరా డైరెక్టర్...
అలియాస్ రుక్మిణిలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. దండోరా ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా హీరో, సాంకేతిక నిపుణులతో షూటింగ్ వివరాలను రివీల్ చేసిన మేకర్స్ హీరోయిన్ ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ రొమాంటిక్ మూవీలో నితిన్‌కు జోడీగా రుక్మిణి వసంత్ కథానాయికగా కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉండటంతో రుక్మిణి వసంత్ అలియాస్ రుక్మిణి సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయినట్లు సమాచారం.
రచయితగా...
రుక్మిణి వసంత్ ప్లేస్‌లో కయదు లోహర్‌ను హీరోయిన్‌గా మేకర్స్ ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో రుక్మిణిగా టైటిల్ రోల్‌లో అస్సాం బ్యూటీ కనిపించనున్నట్లు చెబుతున్నారు. ఇందులో రచయితగా కయదు లోహర్ నటించనుంది. భార్యాభర్తల అనుంబంధానికి ఓ థ్రిల్లర్ ఎలిమెంట్‌ను జోడించి ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం.
సుబ్బలక్ష్మి...
ప్రస్తుతం నానితో ప్యారడైజ్ సినిమా చేస్తోంది కయదు లోహర్. ఈ సినిమాలో సుబ్బలక్ష్మి అనే పాత్రలో నటిస్తోంది. సెప్టెంబర్‌లో ప్యారడైజ్ రిలీజ్ కాబోతుంది. ప్యారడైజ్‌లో నానికి జోడీగా నటిస్తోన్న ఈ బ్యూటీ నెక్స్ట్ తెలుగు మూవీని అతడి బ్యానర్‌లోనే చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Prabhas | ఏడేళ్ల తర్వాత ఇన్‌స్టా డీపీ ఛేంజ్ చేసిన ప్రభాస్ – ఇన్నాళ్లు బాహుబలి … ఇకపై ఫౌజీ
ఆగస్టు 14, 2026

Naga Durga | రాజు వెడ్స్ రాంబాయి హీరోతో నాగదుర్గ రొమాన్స్ – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శనార్తి
ఆగస్టు 14, 2026

George Krish | శర్వానంద్ జార్జ్ క్రిష్ షురూ – ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●1947 రియల్ సీక్రెట్స్: కేవలం స్వాతంత్య్రం మాత్రమే కాదు... భారత్ విలీనం వెనుక మిలిటరీ థ్రిల్లర్ ఇది!
- ●Talasani Srinivas Yadav | 22ఎ కింద మీ భూమి మీకే ఇప్పిస్తా అంటున్నడు.. ప్రజల భూమి ప్రజలకివ్వడానికి రేవంత్ ఎవరు?
- ●BRS Party | టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను రద్దు చేయండి.. లోకాయుక్తకు బీఆర్ఎస్ విన్నపం
- ●KCR | బావమరిది శ్రీనివాసరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళి
- ●HDFC Mid Cap Fund | రూ.10 లక్షలను రూ.1కోటిగా మార్చిన ఫండ్ ఇది.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం..
- ●Manan Kumar Mishra | మోదీ గారూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ సంస్థే

1947 రియల్ సీక్రెట్స్: కేవలం స్వాతంత్య్రం మాత్రమే కాదు... భారత్ విలీనం వెనుక మిలిటరీ థ్రిల్లర్ ఇది!

Talasani Srinivas Yadav | 22ఎ కింద మీ భూమి మీకే ఇప్పిస్తా అంటున్నడు.. ప్రజల భూమి ప్రజలకివ్వడానికి రేవంత్ ఎవరు?

BRS Party | టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను రద్దు చేయండి.. లోకాయుక్తకు బీఆర్ఎస్ విన్నపం

KCR | బావమరిది శ్రీనివాసరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళి



