త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | ఆ విష‌యంలో అదృష్ట‌వంతురాలిని – సుబ్బ‌ల‌క్ష్మిగా స‌ర్‌ప్రైజ్ చేస్తా – క‌య‌దు లోహ‌ర్ కామెంట్స్‌

త‌మిళ మూవీ డ్రాగ‌న్ వ‌ల్లే ప్యార‌డైజ్‌లో ఛాన్స్ వ‌చ్చింద‌ని క‌య‌దు లోహ‌ర్ అన్న‌ది. ఈ సినిమాలో సుబ్బ‌ల‌క్ష్మిగా నా పాత్ర చాలా స‌ర్‌ప్రైజ్‌ల‌తో సాగుతుంద‌ని చెప్పింది. అన్ని భాష‌ల ఆడియెన్స్ ప్రేమ‌ను పొందండం అదృష్టంగా భావిస్తున్నాన‌ని క‌య‌దు లోహ‌ర్ తెలిపింది.

N

Entertainment | Published On Sep 22, 2026, 4.11 pm IST

Kayadu Lohar | ఆ విష‌యంలో అదృష్ట‌వంతురాలిని – సుబ్బ‌ల‌క్ష్మిగా స‌ర్‌ప్రైజ్ చేస్తా – క‌య‌దు లోహ‌ర్ కామెంట్స్‌
Advertisement

Kayadu Lohar |  "ప్యార‌డైజ్‌లో సుబ్బ‌ల‌క్ష్మి అనే పాత్ర చేశా. కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌తో పోలిస్తే ఈ రోల్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది" అని క‌య‌దు లోహ‌ర్ పేర్కొన్న‌ది. ఆమె హీరోయిన్‌గా న‌టించిన ప్యార‌డైజ్ మూవీ సెప్టెంబ‌ర్ 24న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. నాని హీరోగా న‌టించిన ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్యార‌డైజ్ రిలీజ్ సంద‌ర్భంగా కక‌య‌దు లోహ‌ర్ పాత్రికేయుల‌తో ముచ్చ‌టించింది. ఆ విశేషాలివి...

సుబ్బ‌ల‌క్ష్మిగా...

‘ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. తనని న‌న్ను సుబ్బు అని పిలుస్తుంటారు. నా క్యారెక్ట‌ర్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. అవన్నీ మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. జడల్ లవ్ పార్ట్‌నర్‌గా కనిపిస్తాను. అలాగే నాకంటూ సినిమాలో ఒక‌ జర్నీ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర. కథలో చాలా కీలకంగా ఉంటుంది. సుబ్బు క్యారెక్టర్ గురించి అప్పుడే ఎక్కువ రివీల్ చేయకూడదు. ఇప్ప‌టివ‌ర‌కు నేను చేసిన పాత్రలన్నిటితో పోలిస్తే చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది.

లుక్ టెస్ట్‌...

‘డ్రాగన్’ వ‌ల్లే ఈ సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది. డ్రాగ‌న్ చూసిన డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల సుబ్బ‌ల‌క్ష్మి క్యారెక్ట‌ర్ నేను చేయగలనని న‌మ్మారు లుక్ టెస్ట్ చేసి ఓకే చేశారు. కెరీర్‌లోనే నేను చేస్తోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ఇది.

చాలా నేర్చుకున్నా...

ఈ సినిమాలో నాని జడలతో కనిపిస్తారు. జ‌డ‌ల‌తో నటించడం, యాక్షన్ చేయడం అంత ఈజీ కాదు. కానీ నాని చాలా కాన్ఫిడెంట్‌గా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. షూటింగ్‌లో నాని నుంచి ఎన్నోమంచి విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.ప్యార‌డైజ్‌లో నాని చేసిన జ‌డ‌ల్ క్యారెక్టర్ నా ఫేవరేట్.మోహ‌న్‌బాబు, రాఘ‌వ్ జుయాల్‌తో పాటు ప్ర‌తి పాత్ర ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ థియేటర్‌లో బ్లాస్ట్ అవుతాయి.

బ‌యోపిక్ చేయాలి...

ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ‌గా రొమాంటిక్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేశారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేయాల‌నుంది. బయోపిక్‌లో కూడా అవకాశం న‌టిస్తా. తెలుగు, త‌మిళ అనే భేదాలు లేకుండా ప్రతి పరిశ్రమ నుంచి నాకు ఎంతో ప్రేమ లభిస్తోంది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. అన్ని పరిశ్రమల్లో పని చేసే అవకాశం రావడం, ప్రేక్షకుల ప్రేమ దక్కడం ఆనందంగా ఉంది.

సూర్య మూవీ...

ప్రస్తుతానికైతే నా దృష్టి అంతా నటన మీదే ఉంది.భ‌విష్య‌త్తులో అవ‌కాశం వ‌స్తే డైరెక్ష‌న్‌, ప్రొడ‌క్ష‌న్ గురించి ఆలోచిస్తా. ప్ర‌స్తుతం త‌మిళంలో సూర్యతో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే మారి సెల్వరాజ్ డైరెక్ష‌న్‌లో లేడీ ఓరియెంటెడ్‌మూవీని అంగీక‌రించా. శింబు మ‌రో మూవీ డిస్క‌ష‌న్స్‌లో ఉంది. వాటితో పాటు మ‌రికొన్ని సినిమాలు క‌మిట‌య్యా.

 

Advertisement
Advertisement