Kayadu Lohar | నేను సింగిలే – డేటింగ్ రూమర్లపై ఫంకీ హీరోయిన్ రియాక్షన్
ప్రస్తుతం పది సినిమాలు చేస్తూ దక్షిణాదిలో మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతోంది కయదు లోహర్. ఇటీవలే ఫంకీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లపై కయదు లోహర్ రియాక్ట్ అయ్యింది.
Entertainment | Published On Mar 14, 2026, 5.30 pm IST
Kayadu Lohar | దక్షిణాదిలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరూ అనగానే నయనతార, సాయిపల్లవి అంటూ టాప్ స్టార్స్ పేర్లు వినిపిస్తుంటాయి. కానీ సినిమా అవకాశాల్లో ఈ సీనియర్ హీరోయిన్ల దాటేసింది డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కలిపి ప్రస్తుతం పది సినిమాలు చేస్తోంది. మరో మూడేళ్ల వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవట. ఓ సినిమా కాగానే మరో సినిమాతో గత ఏడాది కాలంగా సింగిల్ డే కూడా బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేస్తుందట కయదు లోహర్.
ప్రేమలో పడిందా?
తాజాగా కయదు లోహర్ ప్రేమలో పడిందని, త్వరలోనే ప్రియుడితో ఏడడుగులు వేయబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ రూమర్లపై ఓ తమిళ ఇంటర్వ్యూలో కయదు రియాక్ట్ అయ్యింది.
తాను సింగిల్ అని బదులిచ్చింది. "ఈ రూమర్లు ఎలా మొదలయ్యాయో తెలియదు. ప్రస్తుతానికైతే నేను సింగిలే. యాక్టింగ్‌తోనే ప్రేమలో ఉన్నాను. నటన, సినిమాల గురించి తప్ప ప్రేమ, పెళ్లి వంటి బంధాల గురించి ఆలోచించే తీరిక దొరకడం లేదు" అని అన్నది.
పెళ్లి చేసుకుంటా...
పెళ్లిపై కూడా రియాక్ట్ అయ్యింది కయదు లోహర్. "నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ అందుకు చాలానే టైమ్ ఉంది. నా ఆలోచనలు, అభిప్రాయాలు గౌరవించే వ్యక్తి కోసం తారసపడితే నా అభిప్రాయం మారవచ్చు. కానీ అలాంటి వ్యక్తి ఇప్పటివరకు కనిపించలేదు" అంటూ కయదు లోహర్ చెప్పింది.
మిక్స్‌డ్ టాక్...
ఇటీవలే ఫంకీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కయదు లోహర్. విశ్వక్‌సేన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫంకీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా నాని ప్యారడైజ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్‌లో కయదు లోహర్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్‌తో పాటు పళ్లిచట్టంబి, తారమ్ సినిమాలు చేస్తోంది. తమిళంలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఓ మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
సంబంధిత వార్తలు

Avika Gor | ఫారిన్లో ఇళ్లు కొన్న టాలీవుడ్ హీరోయిన్ – సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?
మే 10, 2026

Reba Monica John | తల్లి కాబోతున్న శ్రీవిష్ణు హీరోయిన్ – బేబీ బంప్ ఫొటోలతో గుడ్‌న్యూస్…
మే 1, 2026

Samantha Birthday Photos | సమంత బర్త్‌డే సెలబ్రేషన్స్ …ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన సామ్
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



