Mask Movie Review | మాస్క్ రివ్యూ – ఓటీటీలో రిలీజైన వెట్రిమారన్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – అందరూ విలన్లే!
కోలీవుడ్ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన తమిళ మూవీ మాస్క్ ఇటీవల జీ5 ఓటీటీలో రిలీజైంది.ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కెవిన్, ఆండ్రియా హీరోహీరోయిన్లుగా నటించారు.
Entertainment | Published On Jan 20, 2026, 12.15 pm IST
Mask Movie Review | కెవిన్, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ మాస్క్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెట్రి మారన్ ప్రజెంట్‌గా వ్యవహరించారు. విక్రమన్ అశోక్ దర్శకత్వం వహించారు. మాస్క్ మూవీ ఎలా ఉందంటే...
డిటెక్టివ్ అన్వేషణ...
వేలు (కెవిన్) ఓ ప్రైవేటు డిటెక్టివ్. తన దగ్గరకు వచ్చిన క్లయింట్స్ సీక్రెట్స్ తెలుసుకొని వారినే డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. భూమికి (ఆండ్రియా) సామాజిక కార్యకర్తగా సోసైటీలో మంచి పేరు ఉంటుంది. పేద అమ్మాయిలకు తన ఎన్జీవోలో ఆశ్రయం కల్పిస్తూ చదుతూ చెప్పిస్తున్నట్లుగా నటిస్తూ హ్యూమన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ బిజినెస్‌లు చేస్తుంటుంది. ఎమ్మెల్యే మణివన్నన్‌కు బినామీగా ఉంటుంది. తన సీక్రెట్స్ తెలిసిన వారిని చంపడానికి కూడా భూమి వెనుకాడదు. ఎలెక్షన్స్ వస్తుండటంతో తన దగ్గర ఉన్న 440 కోట్ల బ్లాక్‌మనీని భూమికి చెందిన ఓ సూపర్ మార్కెట్‌లో దాచిపెడతాడు మణివన్నన్. ఆ డబ్బును మాస్క్‌లు ధరించిన ఓ గ్యాంగ్ కొట్టేస్తుంది. ఆ మాస్క్ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి వేలు సహాయం కోరుతుంది భూమి. అనుకోకుండా భూమి దగ్గర నుంచి మాస్క్ గ్యాంగ్ కొట్టేసిన డబ్బులో కొంత వేలు దగ్గరే బయటపడుతుంది. ఆ దొంగతానికి వేలుకు ఉన్న సంబంధం ఏమిటి? వేలు లవర్ రాతి (రుహాణీ శర్మ) ఎలా చనిపోయింది? భూమి బారి నుంచి వేలును మాస్క్ గ్యాంగ్ ఎందుకు కాపాడింది? మణివన్నన్ చేసిన అన్యాయంపై కొందరు సామాన్యులు ఎలా రివేంజ్ తీర్చుకున్నారు? అన్నదే ఈ మూవీ కథ.
నెగెటివ్ షేడ్స్...
సాధారణంగా సినిమాలో ఒకటో, రెండో మెయిన్ విలన్ క్యారెక్టర్లు ఉంటాయి. కానీ మాస్క్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. సినిమాలో హీరో కెవిన్ మొదలుకొని కనిపించే ప్రతి క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తోనే సాగుతుంది. ప్రతి మనిషిలో తెలియని మరో కోణం దాగి ఉంటుఉందనే కాన్సెప్ట్‌ను నమ్మే డైరెక్టర్ ఇందులోని పాత్రలను డిజైన్ చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. సినిమాలోని ప్రతి పాత్ర రెండు వేరియేషన్స్‌తో సాగుతుంది. ఈ క్యారెక్టర్స్‌లో కనిపించే షేడ్స్ మాస్క్ మూవీలో థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి.
రొటీన్ రివేంజ్ మూవీనే కానీ...
కథగా చూసుకుంటే మాస్క్ రొటీన్ రివేంజ్ మూవీనే. పొలిటికల్ లీడర్ తమకు చేసిన అన్యాయంపై కొందరు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు అన్నదే ఈ సినిమా కథ. హీరోనే తెలివిగా విలన్‌ను చీట్ చేయడం లాంటి ఫార్మెట్‌లో ఈ కథలు సాగుతుంటాయి. కానీ డైరెక్టర్ విక్రమన్ మాత్రం పాత కథగా కొత్తగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. మిస్టరీని సాల్వ్ చేసే క్రమంలో హీరో కూడా ఈ రివేంజ్‌లో ఎలా భాగమయ్యాడు అన్నది లాజిక్స్‌తో రాసుకున్నారు. క్లైమాక్స్‌లో చార్లీ పాత్రకు సంబంధించి వచ్చే ట్విస్ట్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది.
ప్రెడిక్టబుల్...
కాన్సెప్ట్ బాగుంటే సరిపోదు...దానిని ఎంగేజింగ్‌గా చెప్పగలిగినప్పుడే ఇలాంటి కథలు ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. భూమి, వేలు ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు చాలా ఫ్లాట్‌గా ప్రెడిక్టబుల్‌గా ఉంటాయి.
విలన్‌గా ఆండ్రియా...
మనీమైండెడ్ డిటెక్టివ్ పాత్రలో కెవిన్ యాక్టింగ్ బాగుంది. సెటిల్డ్ యాక్టింగ్‌ను కనబరిచారు. విలన్ పాత్రలో ఆండ్రియా అదరగొట్టింది. తన కళ్లు, హావభావాలతోనే విలనిజాన్ని పండించింది. రుహానీ శర్మ పాత్ర లెంగ్త్ తక్కువే. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ బాగుంది.
మాస్క్ రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నమైన ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. రన్ టైమ్ రెండు గంటలే.
సంబంధిత వార్తలు

Lockdown Review | లాక్డౌన్ రివ్యూ – అనుపమ పరమేశ్వరన్ ధైర్యానికి హ్యాట్సాఫ్ – హార్డ్ హిట్టింగ్ మూవీ
మార్చి 12, 2026

Cheekatilo Review | చీకటిలో రివ్యూ – శోభిత ధూళిపాళ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
జనవరి 23, 2026

Crime Thriller OTT | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన వెట్రిమారన్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – ట్విస్ట్‌లను ఊహించడం కష్టమే|
జనవరి 9, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



