Oscars 2026 | రూ. 318 కోట్ల డైమండ్ నక్లెస్‌తో హాలీవుడ్ హీరోయిన్ ర్యాంప్ వాక్ – ఆస్కార్ చరిత్రలోనే రికార్డ్
ఆస్కార్ రెడ్‌కార్పెట్‌పై 318 కోట్ల విలువైన డైమండ్ నక్లెస్‌తో హాలీవుడ్ హీరోయిన్ ర్యాంప్‌వాక్ చేసింది. ఆస్కార్ హిస్టరీలోనే ఓ హీరోయిన్ ధరించిన అత్యంత ఖరీదైన నక్లెస్ ఇదేనని అంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరంటే?
Entertainment | Published On Mar 16, 2026, 1.55 pm IST
Oscars 2026 | 98వ ఆస్కార్ వేడుక వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో హాలీవుడ్ హీరోయిన్లు ర్యాంప్ వాక్‌పై తమ వయ్యారాలతో ఆహుతులను అలరించారు. హీరోయిన్ల గ్లామర్ తళుకులతో ఆస్కార్ వేదిక వెలిగిపోయింది. హాలీవుడ్ టాప్ హీరోయిన్లు అందరూ రాడ్‌కార్పెట్‌పై మెరిశారు.
హాలీవుడ్ హీరోయిన్ కేట్ హడ్సన్ మాత్రం ఆస్కార్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె ధరించిన నక్లెస్ ఆస్కార్ ఈవెంట్‌కు హాట్ టాపిక్‌గా మారింది. సాంగ్ సంగ్ బ్లూ సినిమాకు గాను బెస్ట్ హీరోయిన్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్‌లో కేట్ హడ్సన్ నిలిచింది.
318 కోట్లు...
ఆస్కార్ సెలబ్రేషన్స్‌కు కేట్ హడ్సన్ డైమండ్ నక్లెస్ ధరించి అటెండ్ అయ్యింది. చూడటానికి సింపుల్‌గా ఉన్న ఈ డైమండ్ నక్లెస్ ఖరీదు వింటే మాత్రం షాకవ్వాల్సిందే. 35 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 318 కోట్లకుపైనే ఉంటుందట.
ఇటలీ సంస్థ...
41 క్యారెట్ల రేర్ గ్రీన్ డైమండ్స్‌తో ఇటలీకి చెందిన గారెట్టి అనే సంస్థ ఈ డైమండ్ నక్లెస్‌ను తయారు చేసిందట. ఆస్కార్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జ్యూవెల్లరీ ధరించి అటెండ్ అయిన హీరోయిన్‌గా కేట్ హడ్సన్ నిలిచింది.
ఆస్కార్స్‌లో కేట్ హడ్సన్‌కు నిరాశే ఎదురైంది. బెస్ట్ హీరోయిన్ విభాగంలో తుది రేసులో నిలిచినా ఆమెకు అవార్డు దక్కలేదు. హామ్నేట్ సినిమాకుగాను జెస్సీ బక్లీ బెస్ట్ హీరోయిన్‌గా అవార్డును కైసవం చేసుకుంది. కేట్ హడ్సన్ సాంగ్ సంగ్ బ్లూ మూవీ కేవలం బెస్ట్ హీరోయిన్ కేటగిరీలో మాత్రమే ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది.30 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన సాంగ్ సంగ్ బ్లూ మూవీ 58 మిలియన్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. ఈ సినిమాలో హ్యూజ్‌జాక్‌మన్ హీరోగా నటించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Disha Patani | హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం.. స్పెషల్ శిక్షణ తీసుకుంటున్న హాట్‌బ్యూటీ దిశా పటానీ..!
మే 13, 2026

Movie Collections | 1400 కోట్లతో తీస్తే ఆరు కోట్లు వచ్చాయి… వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్ మూవీ ఇదే
మే 9, 2026

Priyanka Chopra | హాలీవుడ్ సినిమాకు ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా…
మే 7, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



