త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | జ‌న‌నాయ‌గ‌న్…టీవీకే పార్టీ ప్ర‌చార చిత్రం – కోలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ కామెంట్స్‌

జ‌న‌నాయ‌గ‌న్ లీక్‌పై తమిళ సీనియ‌ర్ హీరోయిన్ క‌స్తూరి సంచ‌ల‌న కామెంట్లు చేసింది. జ‌న‌నాయ‌గ‌న్ లీక్‌డ్ సీన్ల‌ను తాను చూశాన‌ని, ఈ సినిమా విజ‌య్ టీవీకే పార్టీ ప్రొప‌గాండ మూవీలా ఉంద‌ని అన్న‌ది. విజ‌య్ సానుభూతి ప‌రులే ఈ సినిమా లీక్ చేసి ఉంటార‌ని చెప్పింది.

N

Entertainment | Published On Apr 13, 2026, 8.32 pm IST

Jana Nayagan | జ‌న‌నాయ‌గ‌న్…టీవీకే పార్టీ ప్ర‌చార చిత్రం – కోలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ కామెంట్స్‌
Advertisement

Jana Nayagan | ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ క‌ష్టాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. విడుద‌ల‌కు ముందే ఈ సినిమా లీక్ కావ‌డం కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సినిమాలోని సీన్లు మొత్తం ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఈ లీక్‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. పైర‌సీతో మ‌రికొంత మందికి సంబంధం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌న‌నాయ‌గ‌న్ లీక్‌పై త‌మిళం, తెలుగు హీరోలంద‌రూ రియాక్ట్ అయ్యారు. జ‌న‌నాయ‌గ‌న్ టీమ్‌కు మ‌ద్ద‌తుగా పోస్ట్‌లు పెట్టారు.

రాజ‌కీయ భావ‌జాలాన్ని...

జ‌న‌నాయ‌గ‌న్ లీక్‌పై సీనియ‌ర్‌ హీరోయిన్ క‌స్తూరి చేసిన కామెంట్లు త‌మిళ‌నాట దుమారాన్ని రేపుతున్నాయి. జ‌న‌నాయ‌గ‌న్ లీక్‌డ్ వీడియోల‌ను తాను చూశాన‌ని.... టీవీకే ప్రొప‌గాండ సినిమాలా ఉంద‌ని అన్న‌ది. ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయ భావ‌జాలాన్ని, టీవీకే పార్టీ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికే ఈ సినిమా తీశార‌ని చెప్పింది. జ‌న‌నాయ‌గ‌న్‌ను క‌మ‌ర్షియ‌ల్ సినిమా అన‌డం కంటే టీవీకే పార్టీ మూడు గంట‌ల రాజ‌కీయ ప్ర‌చారం చిత్రంగా చెప్ప‌డం క‌రెక్ట్ అని క‌స్తూరి పేర్కొన్నారు. విజ‌య్ పొలిటిక‌ల్‌ మైలేజీ కోస‌మే ఆయ‌న సానుభూతి ప‌రులే ఎవ‌రో ఈ సినిమాను లీక్ చేసి ఉంటార‌ని క‌స్తూరి ఆరోపించింది.

డీఎంకే పార్టీ...

అధికార డీఎంకే పార్టీపై కూడా క‌స్తూరి సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసింది. ద‌ళ‌ప‌తి విజ‌య్‌ని రాజ‌కీయంగా దెబ్బ కొట్ట‌డం కోస‌మే జ‌న‌నాయ‌గ‌న్‌ను డీఎంకే పార్టీ అడ్డుకుంటుంద‌ని, కానీ దాని వ‌ల్ల బీజేపీతో పాటు డీఎంకేకు పెద్ద‌గా ఒరిగేది ఉండ‌ద‌ని క‌స్తూరి అన్న‌ది. ఆమె కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి. విజ‌య్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం క‌స్తూరికి స‌పోర్ట్ చేస్తున్నారు. ఆమె మాట‌లు నిజ‌మేన‌ని అంటున్నారు. కాగా క‌స్తూరి తెలుగుతో పాటు త‌మిళంలో హీరోయిన్‌గా ప‌లు సినిమాలు చేసింది. అన్న‌మ‌య్య‌, మెరుపు, చిల‌క్కొట్టుడు, ర‌థ‌యాత్ర‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది.

Advertisement
Advertisement