త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త్రిష వివాదం ఎఫెక్ట్ …దిగొచ్చిన కరుప్పు టీమ్…

త్రిష‌తో క‌రుప్పు మూవీ టీమ్‌కు నెల‌కొన్న వివాదం కోలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌మోష‌న్స్‌లో త‌న‌కు స‌రైన ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం లేదంటూ మేక‌ర్స్‌పై త్రిష సెటైర్లు వేసింది. ఈ వివాదాల న‌డుమ త్రిష‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ సోమ‌వారం ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On May 4, 2026, 5.39 pm IST

Trisha | త్రిష వివాదం ఎఫెక్ట్ …దిగొచ్చిన కరుప్పు టీమ్…
Advertisement

Trisha | సినిమా ప్ర‌మోష‌న్స్‌లో త‌న‌కు స‌రైన ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం లేదంటూ క‌రుప్పు మూవీ టీమ్‌పై ఇటీవ‌ల‌ త్రిష విమ‌ర్శ‌లు గుప్పించింది. క‌నీసం త‌న‌ను ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు ఇన్వైట్ చేయ‌లేద‌ని సెటైరిక‌ల్ పోస్ట్‌లు పెట్ట‌డం వైర‌ల్‌గా మారింది. తాను సినిమాలో న‌టించిన విష‌యాన్ని గుర్తుచేసినందుకు థాంక్స్ ఇటీవ‌ల మేక‌ర్స్ రిలీజ్ చేసిన ఓ వీడియోకు త్రిష రిప్లై ఇవ్వ‌డం కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌రుప్పు మూవీని సూర్య సినిమాగానే ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఇందులో తాను న‌టించిన విష‌యాన్ని కూడా ప‌ట్టించుకోవ‌డం లేదంటూ త్రిష అసంతృప్తితో ఉన్న‌ట్లు వార్త‌లొచ్చాయి.

ట్రెడిష‌న‌ల్ లుక్‌...

త్రిష విమ‌ర్శ‌ల‌పై ఇన్నాళ్లు సెలైంట్‌గా ఉన్న మేక‌ర్స్ ఎట్ట‌కేల‌కు దిగొచ్చారు. త్రిష బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ స్పెష‌ల్ పోస్ట‌ర్‌లో త్రిష చీర‌లో ట్రెడిష‌న‌ల్ లుక్‌లో డ్యాన్స్ చేస్తూ క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ పోస్ట‌ర్‌లో సౌత్ క్వీన్ అని కాకుండా డిప్యూటీ సీఎం అని క్యాప్ష‌న్ ఇస్తే బాగుండేద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తోన్నారు.
విజ‌య్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌గానే క‌రుప్పు టీమ్ ప్లేట్ ఫిరాయించింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్నాళ్లు త్రిష‌ను మూవీ టీమ్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ ఇప్పుడు త్రిష క్రేజ్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా మార‌నుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

రిలీజ్ పోస్ట్‌పోన్‌...

మ‌రోవైపు త్రిష పోస్ట‌ర్‌లో క‌రుప్పు మూవీ రిలీజ్ డేట్ క‌నిపించ‌క‌పోవ‌డం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది మేక‌ర్స్ ఈ సినిమాను మే 14న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ లైన్‌లోకి రావ‌డంతో క‌రుప్పు రిలీజ్ డైల‌మాలో ప‌డింది. జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ డేట్‌పైనే క‌రుప్పు భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంద‌ట‌.

ఇర‌వై ఏళ్ల త‌ర్వాత‌...

క‌రుప్పు మూవీకి ఆర్‌జీ బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు ఇర‌వై ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత సూర్య‌, త్రిష క‌లిసి న‌టిస్తున్న మూవీ ఇది. సూర్య హీరోగా న‌టించిన మౌనం పేసియాదే మూవీతోనే త్రిష యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది.

Advertisement
Advertisement