OTT | ఓటీటీలోకి లైగర్ హీరోయిన్ రొమాంటిక్ మూవీ – సాయిపల్లవి ఫిదాతో కంపేరిజన్స్…
అనన్యా పాండే హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ డిజాస్టర్ మూవీ తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ ఓటీటీలోకి వచ్చింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ మూవీ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.
Entertainment | Published On Feb 19, 2026, 7.06 pm IST
OTT | లైగర్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ మూవీలో జాకీ ష్రాఫ్, నీనా గుప్తా కీలక పాత్రల్లో నటించారు. సమీర్ విద్యాన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేశాడు.
90 కోట్ల బడ్జెట్...
టీజర్, ట్రైలర్‌లో ఆకట్టుకున్న తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 45 కోట్ల కంటే తక్కువే కలెక్షన్స్ రాబట్టింది.
టైటిల్‌లో ఉన్న క్రియేటివిటీ సినిమాలో లేదంటూ విమర్శలు వచ్చాయి. జెన్‌జీ ఆడియెన్స్ కోసం జోడించిన రొమాంటిక్ సీన్లు, మసాలా హంగులేవి సినిమాను గట్టెక్కించలేకపోయాయి. కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే కెమిస్ట్రీ సరిగ్గా కుదరలేదు. వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన ఫిదా మూవీని కాపీ కొట్టి ఈ సినిమా తీశారంటూ అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి.
వెడ్డింగ్ ప్లానర్‌తో పెళ్లి
రెహాన్ మెహ్రీ అమెరికాలో వెడ్డింగ్ ప్లానర్‌గా పనిచేస్తుంటాడు. రూమీ ఆగ్రాకు చెందిన నవలా రచయిత్రి. ఓ గొడవతో మొదలైన ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. రూమీని పెళ్లి చేసుకోవాలని రెహాన్ అనుకుంటాడు. కానీ రూమీ మాత్రం అతడి ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తుంది. అగ్రాలోని సెటిలైతేనే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెడుతుంది. ఆమె కండీషన్‌కు రెహాన్ అంగీకరించాడా? రూమీ చెల్లి పెళ్లికి ప్లానర్‌గా పనిచేసే కాంట్రాక్ రెహాన్‌కు ఎలా వచ్చింది? కూతురి ప్రేమకు రూమీ తండ్రి ఆనంద్ వర్ధన్ అంగీకరించాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్ తర్వాత అనన్యా పాండేకు బాలీవుడ్‌లో సరైన హిట్టు లేదు. తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ, కేసరి ఛాప్టర్ వన్, ఖేల్ ఖేల్ మే, క్యో గయే హమ్ కహాన్ డిజాస్టర్స్‌గా నిలిచాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్‌గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్





