Sapthami Gowda | మెగా హీరో సరసన కాంతార బ్యూటీ – తెలుగులో మరో ఛాన్స్
నితిన్ తమ్ముడు తర్వాత కాంతార హీరోయిన్ సప్తమిగౌడ తెలుగులో హీరోయిన్గా మరో అవకాశాన్ని సొంతం చేసుకుంది. మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌తో ఓ సినిమా చేయబోతుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ఫేమ్ తేజ కాకుమాను దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On Oct 15, 2026, 2.40 pm IST
Sapthami Gowda | కాంతార హీరోయిన్ సప్తమి గౌడ తెలుగులో మరో ఛాన్స్ దక్కించుకుంది. మెగా హీరోతో రొమాన్స్ చేయబోతుంది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార కన్నడంలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 450 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ మైథాలజీ మూవీలో హీరోయిన్గా నటించింది సప్తమి గౌడ. సహజ నటనతో మెప్పించింది. కాంతార హిట్‌తో సప్తమి గౌడకు తెలుగుతో పాటు కన్నడంలో మంచి క్రేజ్ ఏర్పడింది. అవకాశాలు భారీగానే వస్తున్నాయి. కానీ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ బ్యూటీ డిఫరెంట్ స్క్రిప్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటోంది.
నితిన్ తమ్ముడు...
కాంతార క్రేజ్‌తో నితిన్ తమ్ముడులో ఛాన్స్ దక్కించుకుంది సప్తమిగౌడ. టాలీవుడ్లో తొలి అడుగు ఈ కన్నడ బ్యూటీకి అచ్చిరాలేదు. తమ్ముడు డిజాస్టర్‌గా నిలిచింది. నితిన్ మూవీ తర్వాత తెలుగులో మరో వెరైటీ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సేవ్ ది టైగర్స్...
సాయిధరమ్‌తేజ్ హీరోగా సేవ్ ది టైగర్స్ వెబ్‌సిరీస్ ఫేమ్ తేజ కాకుమాను డైరెక్షన్లో ఓ సినిమా రాబోతుంది. సాయిధరమ్‌తేజ్ బర్త్‌డే సందర్భంగా గురువారం ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందబోతున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్గా సప్తమి గౌడను మేకర్స్ ఖరారు చేశారు.
డీ గ్లామర్ లుక్‌లో...
హీరోయిన్ రోల్ డీ గ్లామర్ లుక్‌తో ఉంటుందని, పర్పార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో ఈ కన్నడ బ్యూటీని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పులి చుట్టూ సాగే కథ ఇదని, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ హంగులకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుందని అంటున్నారు. సాయిధరమ్‌తేజ్ హీరోగా నటిస్తోన్న 19వ సినిమా ఇది. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం కన్నడంలో ఉగ్రయుద్ధం,హలగలి అనే సినిమాలు చేస్తోంది సప్తమి గౌడ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Duddilla Sridhar Babu | కేటీఆర్! ఆధారాలుంటే బయటపెట్టండి.. లేదంటే బురద జల్లడం మానుకోండి
- ●IPO | ఐపీఓ అంటే ఏమిటి.. అందులో ఎలా పెట్టుబడులు పెట్టాలి.. జియో ఐపీఓకు దరఖాస్తు చేయొచ్చా..?
- ●Jantar Mantar Protest Site Ban | జంతర్ మంతర్‌పై నిషేధం.. కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక
- ●Ramchandar Rao | రైతులు అల్లాడుతున్నా రోజుకు 2-3 గంటలే కరెంటిస్తున్నరు
- ●CJI Surya Kant on Rahul Gandhi | "న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు": సుప్రీంకు రాహుల్ గాంధీ మార్చ్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం
- ●Imran Khan Leave India Notice | అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలి: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు

Duddilla Sridhar Babu | కేటీఆర్! ఆధారాలుంటే బయటపెట్టండి.. లేదంటే బురద జల్లడం మానుకోండి

IPO | ఐపీఓ అంటే ఏమిటి.. అందులో ఎలా పెట్టుబడులు పెట్టాలి.. జియో ఐపీఓకు దరఖాస్తు చేయొచ్చా..?

Jantar Mantar Protest Site Ban | జంతర్ మంతర్‌పై నిషేధం.. కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

Ramchandar Rao | రైతులు అల్లాడుతున్నా రోజుకు 2-3 గంటలే కరెంటిస్తున్నరు






