TRS Protest | పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ నేతల ఆందోళన.. కర్రలతో స్థానికుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
TRS Protest | పల్నాడు వాటర్‌గ్రిడ్ (Palnadu Water Grid) ప్రాజెక్టు వద్ద తెలంగాణ రక్షణ సేన నాయకులు (TRS Leaders), కార్యకర్తలు ఆదివారం ఆందోళన (Protest)కు పూనుకున్నారు.
TRS Protest | త్రినేత్ర న్యూస్: పల్నాడు వాటర్‌గ్రిడ్ (Palnadu Water Grid) ప్రాజెక్టు వద్ద తెలంగాణ రక్షణ సేన నాయకులు (TRS Leaders), కార్యకర్తలు ఆదివారం ఆందోళన (Protest)కు పూనుకున్నారు. డెడ్ స్టోరేజ్ వద్ద కృష్ణా నది నీళ్ల (Krishna Water)ను పల్నాడు జిల్లాకు మళ్లిస్తున్నారంటూ ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు, స్థానికుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పలువురు కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. ఒకానొక దశలో ఒకరినొకరు తోసేసుకున్నారు. మహిళలని కూడా చూడకుండా వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు రంగ ప్రవేశం చేసి టీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు శివారెడ్డి, విక్రాంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదన్నారు. పోలీసుల సమక్షంలోనే తమపై ప్రైవేటు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయాలని, అరెస్ట్ చేసిన నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఖండించిన టీఆర్ఎస్ చీఫ్
ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన తెలంగాణ రక్షణ సేన నాయకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసుల సమక్షంలోనే మహిళా నాయకులపై ప్రైవేట్ వ్యక్తులు దాడి చేయడం దారుణం. ఆంధ్రకు అక్రమంగా నీటిని తరలించుకపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస సోయి లేదు. అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ నాయకులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని టీఆర్ఎస్ చీఫ్ కవిత (Kavitha) హెచ్చరించారు.
ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన తెలంగాణ రక్షణ సేన నాయకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
పోలీసుల సమక్షంలోనే మహిళా నాయకులపై ప్రైవేట్ వ్యక్తులు దాడి చేయడం దారుణం
ఆంధ్రకు అక్రమంగా నీటిని తరలించుకపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస సోయి లేదు
అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 29, 2026
తాజావార్తలు
- ●Delimitation Bill 2026 | లోక్‌సభలో మోదీ సర్కార్ మార్క్ '371'.. డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కేదిలా!
- ●Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయలు
- ●KTR | రేవంత్ రెడ్డి నోట.. కేసీఆర్ పేరు కోటి సార్లు
- ●Renu Desai | గుడికి వెళ్లి పూజలు చేస్తారు... కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను పట్టించుకోరు - రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్
- ●Delimitation Bill 2026 | స్టాలిన్‌ను ఒప్పించలేకపోయిన సోనియా, రాహుల్.. గంటపాటు సాగిన చర్చలు విఫలం!
- ●KTR | 90 సీట్లు కాదు.. 900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతి పెడుతాం

Delimitation Bill 2026 | లోక్‌సభలో మోదీ సర్కార్ మార్క్ '371'.. డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కేదిలా!

Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయలు

KTR | రేవంత్ రెడ్డి నోట.. కేసీఆర్ పేరు కోటి సార్లు

Renu Desai | గుడికి వెళ్లి పూజలు చేస్తారు... కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను పట్టించుకోరు - రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్





