త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | రామాయ‌ణ ఫ్లాప్ అంటూ నెటిజ‌న్ పోస్ట్ – లైక్ కొట్టిన ప్రియాంక చోప్రా

ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన రామాయ‌ణ మూవీ 24 రోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా 1815 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. రెండువేల కోట్ల మైలురాయి దిశ‌గా సాగుతోంది. కాగా రామాయ‌ణ సినిమా కోసం పెట్టిన బ‌డ్జెట్‌కు త‌గ్గ‌ట్లుగా వ‌సూళ్లు రావ‌డం లేద‌ని, సినిమా ఫ్లాప్ అంటూ ఓ నెటిజ‌న్ పెట్టిన పోస్ట్‌కు గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా లైక్ కొట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రియాంక చోప్రాను ర‌ణ‌బీర్‌ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

N

Entertainment | Published On Nov 29, 2026, 2.31 pm IST

Priyanka Chopra | రామాయ‌ణ ఫ్లాప్ అంటూ నెటిజ‌న్ పోస్ట్ – లైక్ కొట్టిన ప్రియాంక చోప్రా
Advertisement

Priyanka Chopra  ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి (Sai Pallavi)  హీరోహీరోయిన్లుగా న‌టించిన రామాయ‌ణ (Ramayana Movie) రిలీజై ఇర‌వై రోజులు దాటినా క‌లెక్ష‌న్స్ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇర‌వై నాలుగు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా 1815 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. వాల్మీకి రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కిన ఈ మైథాల‌జీ మూవీలో క‌న్న‌డ హీరో య‌శ్ రావ‌ణాసురుడిగా క‌నిపించారు. నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఆస్కార్ బ‌రిలో....

రామాయ‌ణ ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వితో పాటు య‌శ్ న‌ట‌న‌, వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ బాగున్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల వీఎఫ్ఎక్స్ కేట‌గిరీలో టాప్ 20 సినిమాల్లో ఒక‌టిగా ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ కూడా అయ్యింది. రామాయ‌ణంపై ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు కూడా భారీగానే వ‌స్తున్నాయి. వాల్మీకి రామాయ‌ణాన్ని వ‌క్రీక‌రిస్తూ నితీష్ తివారీ ఈ సినిమాను తెర‌కెక్కించారంటూ కొన్ని హిందూ వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్నాయి.

రామాయ‌ణ ఫ్లాప్‌...

తాజాగా రామాయ‌ణ మూవీ ఫ్లాప్ అంటూ ఓ నెటిజ‌న్ చేసిన ట్వీట్‌ను గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) లైక్ చేయ‌డం బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రామాయ‌ణ సినిమా బ‌డ్జెట్, బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ను విశ్లేషిస్తూ స్క్రీన్‌రైట‌ర్‌ క్రిటిక్ వివ‌శ్వ‌న్ చౌద‌రి సోష‌ల్ మీడియాలో ఓ రీల్ పోస్ట్ చేశారు. . పెట్టిన బ‌డ్జెట్‌కు త‌గ్గ‌ట్లుగా ఈ మైథాల‌జీ మూవీకి వ‌సూళ్లు రావ‌డం లేద‌ని, సినిమా ఫ్లాప్ ఈ పోస్ట్‌లో వివ‌శ్వ‌న్ చౌద‌రి పేర్కొన్నారు. అత‌డి పోస్ట్‌ను ప్రియాంక చోప్రా లైక్ చేసింది.

స్క్రీన్‌షాట్‌...

ఈ విష‌యాన్ని స్వ‌యంగా వివ‌శ్వ‌న్ చౌద‌రి వెల్ల‌డించాడు. ప్రియాంక చోప్రా లైక్ కొట్టిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. ఆమెకు థాంక్స్ కూడా చెప్పాడు. స్క్రీన్‌షాట్ వైర‌ల్ కావ‌డంతో ప్రియాంక ఈ పోస్ట్‌ను అన్‌లైక్ చేసింది. కానీ జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

విమ‌ర్శ‌లు...

రామాయ‌ణ ఫ్లాప్ అంటూ పెట్టిన పోస్ట్‌కు లైక్ చేయ‌డంపై గ్లోబ‌ల్ స్టార్‌ను ర‌ణ‌బీర్‌క‌పూర్‌ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వ‌కుండా ప‌క్క‌న‌పెట్ట‌డంతో ప్రియాంక హిందీ ఇండ‌స్ట్రీపై ఇలా రివేంజ్ తీర్చుకుంటుంద‌ని అంటున్నారు. రామాయ‌ణ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింద‌ని కామెంట్లు పెడుతోన్నారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం అస‌లు ప్రియాంక చోప్రా ఈ పోస్ట్‌కు లైక్ కొట్ట‌లేద‌ని, ఏఐతో ఎడిట్ చేసిన స్క్రీన్‌షాట్ ఇద‌ని అంటున్నారు. కావాల‌నే ఈ వివాదంలోకి ఆమెను లాగార‌ని చెబుతున్నారు.

వివాదాస్ప‌ద పోస్ట్‌

ఈ వివాదాస్ప‌ద పోస్ట్‌పై ప్రియాంక చోప్రా మాత్రం రియాక్ట్ కాలేదు. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న వార‌ణాసిలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. టైమ్ ట్రావెల్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో మందాకిని అనే యాక్ష‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న వార‌ణాసి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

Advertisement
Advertisement