త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?

KTR | తెలంగాణకు, దక్షిణానికి లాభం జరిగే ఈ డీలిమిటేషన్‌ (Delimitation)ను కాంగ్రెస్ (Congress) ఎందుకు వ్యతిరేకిస్తున్నదని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Nov 29, 2026, 2.15 pm IST

KTR | డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?
Advertisement
  • జ‌నాభా ప్ర‌కార‌మే చేయాల‌నేది వాళ్ల వాద‌న‌నా?
  • అలా చేస్తే తెలంగాణ, ద‌క్షిణాదికి తీవ్ర నష్టం జ‌ర‌గ‌దా? వారి వైఖ‌రేంటో చెప్పాలి
  • బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణకు, దక్షిణానికి లాభం జరిగే ఈ డీలిమిటేషన్‌ (Delimitation)ను కాంగ్రెస్ (Congress) ఎందుకు వ్యతిరేకిస్తున్నదని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్ర‌శ్నించారు. జ‌నాభా ప్ర‌కార‌మే జ‌ర‌గాల‌న్న‌ది వాళ్ల వాద‌న‌నా అని సందేహం వ్య‌క్తం చేశారు. అలా చేస్తే తెలంగాణ‌, ద‌క్షిణాదికి తీవ్ర నష్టం జ‌రుగుతుంద‌న్నారు. ఈ విష‌యంలో వారి వైఖ‌రేంటో స్ప‌ష్టంగా తెలియ‌జేయాల‌ని సూచించారు. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతం త‌గ్గ‌కుండా తీసుకొస్తున్న తొలి డీలిమిటేషన్ ఇదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈమేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

ఇది ద‌క్షిణాది ప్ర‌జ‌ల విజ‌యం

తెలంగాణ, దక్షిణాది ప్రాతినిధ్యాన్ని యథాతథంగా కొనసాగించే డీలిమిటేషన్ దక్షిణాది ప్రజల విజయం. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు శిక్ష పడొద్దు. నాలుగు సంవత్సరాలుగా డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ ఒకటే వాదన కొనసాగిస్తున్నది. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల 24 శాతం ప్రాతినిధ్యం కొనసాగాలి అన్నదే మా డిమాండ్. అందుకు వ్యతిరేకంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించాం. కేంద్రం బుద్ధి తెచ్చుకొని దక్షిణాది రాష్ట్రాల, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే డీలిమిటేషన్ బిల్లును స్వాగతిస్తున్నాం.

ఐక్య ఉద్యమాలు ఫలించాయి

డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ పోరాటం, దక్షిణాది ఐక్య ఉద్యమాలు ఫలించాయి. తెలంగాణకు అసెంబ్లీ స్థానాలు 180, లోక్‌సభ స్థానాలు 26కు పెరిగే అవకాశం ఉంది. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, అన్ని పార్టీల భాగస్వామ్యంతో జరగాలి. కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement