త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rishab Shetty | ప్రొడ్యూస‌ర్‌గా మారిన కాంతార హీరో – రోడ్ జ‌ర్నీ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియ‌న్ మూవీ

కాంతార హీరో రిష‌బ్ శెట్టి ప్రొడ్యూస‌ర్‌గా మారాడు. మోట‌ర్ సైకిల్ డైరీస్ పేరుతో ఓ రోడ్ జ‌ర్నీ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు. టాలీవుడ్ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి రిష‌బ్ శెట్టి భార్య ప్ర‌గ‌తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

N

Entertainment | Published On Nov 29, 2026, 3.11 pm IST

Rishab Shetty | ప్రొడ్యూస‌ర్‌గా మారిన కాంతార హీరో – రోడ్ జ‌ర్నీ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియ‌న్ మూవీ
Advertisement

Rishab Shetty |  కాంతార‌, కాంతార చాఫ్ట‌ర్ వ‌న్ విజ‌యాల‌తో పాన్ ఇండియ‌న్ హీరోగా మారిపోయారు రిష‌బ్ శెట్టి. ఈ రెండు సినిమాలు అత‌డికి తెలుగు, బాలీవుడ్‌తో పాటు ప‌లు భాష‌ల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. హీరోగా బిజీగా ఉన్న రిష‌బ్ శెట్టి తాజాగా ప్రొడ్యూస‌ర్‌గా అవ‌తారం ఎత్తాడు. టాలీవుడ్ నిర్మాత‌తో క‌లిసి రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయ‌బోతున్నారు.

మోటార్ సైకిల్ డైరీస్‌...

రిష‌బ్ శెట్టి ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాకు మోటార్‌సైకిల్ డైరీస్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి రిష‌బ్ శెట్టి భార్య ప్ర‌గ‌తి ఈ సినిమాను నిర్మిస్తోంది. కాంతార‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన శివా చిరంత‌న ఈ సినిమాతో మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నాడు.

ప్రీ లుక్‌...

ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో స‌గం డైరీ... మిగిలిన స‌గం అడ‌వులు, న‌దితో నిండిన ఓ దివి ప్రాంతం క‌నిపిస్తోంది. ఓ యువ‌కుడు హెల్మెట్ పెట్టుకొని బైక్‌పై ప్ర‌యాణిస్తూ ఈ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నాడు. ప్రతి మైలురాయి ఓ జ్ఞాపకంగా, ప్రతి మలుపు ఓ కథగా మారేలా సాగే ఓ అందమైన ప్రయాణమే ఈ సినిమా ఇతివృత్తం. గమ్యస్థానాల కంటే ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, జీవితంలో మరిచిపోలేని సంఘటనలకు దృశ్య‌రూప‌మిస్తూ హార్ట్ ట‌చింగ్‌ ట్రావెల్ ఫిల్మ్‌గా తెర‌కెక్కించ‌బోతున్నాం అని మేక‌ర్స్ వెల్ల‌డించారు.

జీవీ ప్ర‌కాష్ కుమార్‌....

మోటార్ సైకిల్ డైరీస్ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, భువన్ రెడ్డి సినిమాటోగ్రఫీ స‌మ‌కూర్చుతున్నారు. ఈ సినిమాలో హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. రిష‌బ్ శెట్టి సోద‌రుడు ర‌క్షిత్ శెట్టి క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగు, క‌న్న‌డంతో పాటు మ‌ల‌యాళం, హిందీ, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

Advertisement
Advertisement