OTT | 44 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి కమల్‌హాసన్, శ్రీదేవి బ్లాక్‌బస్టర్ మూవీ
కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ మూండ్రంపిరై నలభై నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. మే 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Apr 30, 2026, 5.34 pm IST
OTT | కమల్ హాసన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ మూండ్రంపిరై నలభై నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. డిజిటల్ రీ మాస్టర్ వెర్షన్ మే 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతోన్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు బాలు మహేంద్ర దర్శకత్వం వహించాడు. ఇళయరాజా మ్యూజిక్ అందించారు.
బెస్ట్ యాక్టర్‌గా....
1982లో థియేటర్లలో రిలీజైన మూండ్రంపిరై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఏడాదికిపైగా థియేటర్లలో ఆడింది. ఈ సినిమాకుగాను బెస్ట్ యాక్టర్‌గా కమల్‌హాసన్‌కు నేషనల్ అవార్డు దక్కింది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా బాలు మహేంద్ర మరో జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఈ సినిమాలో సిల్క్ స్మిత కీలక పాత్రలో నటించింది.
వసంత కోకిల...
మూండ్రంపిరై సక్సెస్‌లో ఇళయరాజా మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. వసంత కోకిల పేరుతో తెలుగులోకి డబ్ అయిన ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించింది. హిందీలో సద్మా పేరుతో ఈ సినిమా రీమేక్ అయ్యింది. బాలీవుడ్ వెర్షన్‌లో కమల్ హాసన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించారు.
గతం మర్చిపోతే...
కారు ప్రమాదంలో లక్ష్మి అనే యువతి గతాన్ని మర్చిపోతుంది. సోము ఆమెను చేరదీస్తాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. గతం గుర్తుకురావడంతో లక్ష్మి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతుంది. తమ ప్రేమను సోము ఆమెకు గుర్తుచేయాలని అనుకుంటాడు. కానీ లక్ష్మి అతడిని పట్టించుకోదు ఆ తర్వాత ఏమైంది అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Sridevi | కోర్ట్ హీరోయిన్ కొత్త మూవీ – ఉమెన్‌న్ కాలేజీలో యువకుడికి అడ్మిషన్ దొరికితే!
అక్టోబర్ 6, 2026

Singer Chinmayi | తెలుగు ఓటీటీ షోలో కంటెస్టెంట్‌గా సింగర్ చిన్మయి – బిగ్‌బాస్ కంటే డబుల్ ప్రైజ్‌మనీ
అక్టోబర్ 6, 2026

Sreeleela | సూపర్ స్టార్ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ – ధర్మన్‌లో ధమాకా బ్యూటీ
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy Slams BJP | రాహుల్ పోరాటానికి కేంద్రం గజగజ.. సీఈసీ రాజీనామా చేసేవరకు విశ్రమించం
- ●Captain Smit Machchhar | 174 మందిని కాపాడిన భారత పైలట్‌కు అమెరికా చట్టసభ సలాం
- ●Future City Police Commissionerate | ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధి ఖరారు: ఇబ్రహీంపట్నం డివిజన్‌లోకి అబ్దుల్లాపూర్ మెట్
- ●CM Revanth Reddy Erravalli Review | ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం.. సీఎం సీరియస్.. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు
- ●PM Narendra Modi 25 Years | సీఎంగా మొదలై పీఎంగా విశ్వవేదికపైకి.. పాలనాధినేతగా మోదీ 25 ఏళ్ల ప్రభంజనం: కేంద్ర మంత్రివర్గం చారిత్రక తీర్మానం
- ●Sridevi | కోర్ట్ హీరోయిన్ కొత్త మూవీ - ఉమెన్‌న్ కాలేజీలో యువకుడికి అడ్మిషన్ దొరికితే!

Revanth Reddy Slams BJP | రాహుల్ పోరాటానికి కేంద్రం గజగజ.. సీఈసీ రాజీనామా చేసేవరకు విశ్రమించం

Captain Smit Machchhar | 174 మందిని కాపాడిన భారత పైలట్‌కు అమెరికా చట్టసభ సలాం

Future City Police Commissionerate | ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధి ఖరారు: ఇబ్రహీంపట్నం డివిజన్‌లోకి అబ్దుల్లాపూర్ మెట్

CM Revanth Reddy Erravalli Review | ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం.. సీఎం సీరియస్.. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు



