Thalapathy Vijay | విజయ్ రాజకీయాల గురించి నాకెందుకు – కమల్‌హాసన్ కామెంట్స్ – జెలసీ అంటూ నెటిజన్ల విమర్శలు
దళపతి విజయ్‌పై విలక్షణ నటుడు కమల్‌హాసన్ చేసిన కామెంట్లు తమిళనాట వివాదాస్పదమయ్యాయి. విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే నాకెందుకు అంటూ కమల్‌హాసన్ అన్నారు. విజయ్ రాజకీయాల గురించి నాకు అవనసరం అంటూ కమల్‌హాసన్ పేర్కొన్నారు. విలక్షణ నటుడిగాపై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Entertainment | Published On Mar 21, 2026, 4.17 pm IST
Thalapathy Vijay | తమిళగ వెట్రి కజగం ( టీవీకే) పార్టీని అనౌన్స్ చేసిన నాటి నుంచి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనతో పాటు సీబీఐ ఎంక్వైరీలు, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, విడాకులతో గత కొద్ది నెలలుగా ప్రతి నిత్య వార్తల్లో నిలుస్తోన్నారు విజయ్.
ఈ వివాదాలను పట్టించుకోకుండా టీవీకే పార్టీ ప్రచారంలో బిజీగా ఉన్నారు విజయ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ తొలిసారి పోటీ చేయబోతున్నది. తమిళనాడులోని అన్ని స్థానాల్లో బరిలో దిగనుంది. విజయ్‌కి పలువురు కోలీవుడ్ హీరోలు సపోర్ట్ చేస్తున్నారు.
కమల్‌హాసన్ విమర్శలు...
తాజాగా దళపతి విజయ్‌పై కమల్‌హాసన్ విమర్శలు గుప్పించారు. విజయ్‌తో పాటు అతడి పార్టీని ఉద్దేశించి కమల్‌హాసన్ చేసిన కామెంట్లు కోలీవుడ్ నాట వివాదాస్పదంగా మారాయి. ఇటీవల కమల్‌హాసన్ ఓ వేడుకలో పాల్గొన్నారు. ఇందులో తన సినిమాల గురించి పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు కూల్‌గా సమాధానం ఇచ్చిన కమల్‌హాసన్ దళపతి విజయ్ ప్రస్తావన రాగానే సీరియస్ అయ్యారు. దళపతి విజయ్ పెరంబూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది కదా...నిజమేనా అంటూ కమల్‌హాసన్‌ను పాత్రికేయులు ప్రశ్నించారు.
నాకెందుకు...
"విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే నాకెందుకు అంటూ కమల్‌హాసన్ సీరియస్‌గా సమాధానమిచ్చారు. విజయ్ గురించి, అతడి పార్టీ, రాజకీయాల నాకు అవనసరం. నా పనులు నాకున్నాయి. వాటిపై మాత్రమే నేను దృష్టిపెట్టాను. ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదంటూ" కమల్ సమాధానమిచ్చారు. కాస్త కఠువుగానే మాట్లాడాడు. కమల్ కామెంట్లపై దళపతి విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కమల్ ఇలాంటి చీప్ కామెంట్లు చేస్తున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు.
సభల్లో విజయ్‌ని చూడటానికి వచ్చిన వారందరూ అతడికే ఓట్లు వేస్తారని కలలు కనొద్దు. సినిమా గ్లామర్ వేరు. పాలిటిక్స్ వేరు అంటూ గతంలో విజయ్‌పై కమల్‌హాసన్ వ్యాఖ్యలు చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Anitha Radhakrishnan | విజయ్ ప్రభుత్వం నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



