త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss 9 Telugu Winner | బిగ్‌బాస్ 9 తెలుగు విన్న‌ర్‌గా క‌ళ్యాణ్ ప‌డాల – విజేత‌కు ద‌క్కిన ప్రైజ్‌మ‌నీ ఎంతంటే?

Bigg Boss 9 Telugu Winner | బిగ్‌బాస్ సీజ‌న్ 9 విన్న‌ర్‌గా కామ‌న్ మ్యాన్ క‌ళ్యాణ్ ప‌డాల నిలిచాడు. విన్న‌ర్‌గా నిలిచిన క‌ళ్యాణ్‌కు 35 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీతో పాటు 11 ల‌క్ష‌ల విలువైన కారు బ‌హుమ‌తిగా ద‌క్కింది. త‌నూజ పుట్ట‌స్వామి ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది.

N

Entertainment | Published On Dec 21, 2025, 10.49 pm IST

Bigg Boss 9 Telugu Winner | బిగ్‌బాస్ 9 తెలుగు విన్న‌ర్‌గా క‌ళ్యాణ్ ప‌డాల – విజేత‌కు ద‌క్కిన ప్రైజ్‌మ‌నీ ఎంతంటే?
Advertisement

Bigg Boss 9 Telugu Winner | బిగ్‌బాస్ 9 తెలుగు విన్న‌ర్‌గా క‌ళ్యాణ్ ప‌డాల (Kalyan Padala) నిలిచాడు. బిగ్‌బాస్ అగ్ని ప‌రీక్ష ద్వారా కామ‌న్ మ్యాన్ గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన క‌ళ్యాణ్ ఏకంగా టైటిల్ గెలుచుకున్నాడు. త‌నూజ పుట్ట‌స్వామి ర‌న్నర‌ప్‌గా నిలిచింది. ఆదివారం బిగ్‌బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే జ‌రిగింది. ఈ ఫినాలేలో క‌ళ్యాణ్‌ను విజేత‌గా హోస్ట్ నాగార్జున ప్ర‌క‌టించారు. విన్న‌ర్‌గా నిలిచిన క‌ళ్యాణ్‌కు 35 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. ప‌ద‌కొండు ల‌క్ష‌ల విలువైన ఓ కారును కూడా బ‌హుమ‌తిగా అందుకున్నాడు క‌ళ్యాణ్‌.
ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన త‌నూజ‌కు ఎలాంటి ప్రైజ్‌మ‌నీ ద‌క్క‌లేదు. సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన డీమోప్ ప‌వ‌న్ ప‌దిహేను ల‌క్ష‌లు ప్రైజ్‌మ‌నీతో హౌజ్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.
గ్రాండ్ ఫినాలేకు క‌ళ్యాణ్‌, త‌నూజ‌తో పాటు ఇమ్మాన్యుయేల్‌, సంజ‌నా గ‌ల్రానీ, డీమోన్ ప‌వ‌న్ చేరుకున్నారు. వీరిలో సంజ‌నా గ‌ల్రానీ ఫ‌స్ట్ ఎలిమినేట్ కాగా...ఇమ్మాన్యుయేల్ మూడో ర‌న్న‌ర‌ప్‌గా ఇమ్మాన్యుయేల్ హౌజ్ నుంచి వెళ్లిపోయాడు. వీరిద్ద‌రికి రెమ్యూన‌రేష‌న్ త‌ప్ప ఎలాంటి ప్రైజ్‌మ‌నీ ద‌క్క‌లేదు.
బిగ్‌బాస్ సీజ‌న్ 9 గ్రాండ్ ఫినాలేలో ర‌వితేజ‌, ఆషికా రంగ‌నాథ్‌, డింపుల్ హ‌య‌తితో పాటు న‌వీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌద‌రి, శ్రీకాంత్‌, రోష‌న్ స‌హా ప‌లువురు సెలిబ్రిటీలు సంద‌డి చేశారు.

Advertisement
Advertisement