Bigg Boss 9 Telugu | బిగ్‌బాస్ 9 తెలుగు విన్నర్ పేరు లీకయ్యిందిగా? – ఇమ్మాన్యుయేల్‌కు షాక్
Bigg Boss 9 Telugu | బిగ్‌బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరన్నది లీకయ్యింది. కళ్యాణ్ పడాల (Kalyan Padala)టైటిల్ గెలుచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనూజ రన్నరప్‌గా సరిపెట్టుకున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ సీజన్ 9 (Bigg Boss 9 Telugu)ఫైనల్ నేడు జరుగనుంది.
Entertainment | Published On Dec 21, 2025, 1.57 pm IST
Bigg Boss 9 Telugu | బిగ్‌బాస్ 9 తెలుగు ఫైనల్ నేడు జరుగనుంది. వంద రోజులకుపైగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ఇంట్రెస్టింగ్ టాస్కులు, ఊహించని ఎలిమినేషన్లతో ఆసక్తికరంగా సాగిన లేటేస్ట్ సీజన్‌కు ఆదివారం నాటితో ముగింపు పడనుంది. బిగ్‌బాస్ 9 తెలుగు (Bigg Boss 9 Telugu) ఫైనల్‌కు ఐదుగురు కంటెస్టెంట్స్ చేరుకున్నారు. కళ్యాణ్ పడాల, తనూజతో పాటు ఇమ్మాన్యుయేల్, సంజనా గల్రానీ, డిమోన్ పవన్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌గా నిలిచారు. ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరన్నది అభిమానుల్లో అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
బిగ్‌బాస్ ఫైనల్‌కు గెస్ట్‌లుగా పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీస్ అటెండ్ కానున్నట్లు సమాచారం. సంక్రాంతి సినిమాలతో పాటు క్రిస్మస్‌కు రిలీజ్ కానున్న మూవీస్ తాలూకు ప్రమోషన్స్‌లో భాగంగా పలువురు హీరోలు, హీరోయిన్లు బిగ్‌బాస్ హౌజ్‌లో సందడి చేయనున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి, శ్రీకాంత్, రోషన్‌తో పాటు పలువురు స్టార్స్ ఫైనల్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నారట.
రవితేజ చీఫ్ గెస్ట్...
బిగ్‌బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా చిరంజీవి రానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ మన శంకర వరప్రసాద్ గారు డబ్బింగ్ పనుల కారణంగా చిరంజీవి ఫైనల్‌కు హాజరుకాలేకపోతున్నట్లు తెలిసింది. చిరంజీవి ప్లేస్‌లో రవితేజ చీఫ్ గెస్ట్‌గా గ్రాండ్ ఫినాలేలో సందడి చేయనున్నారట.
గత సీజన్స్‌కు భిన్నంగా ఈ సారి ఫైనల్ జరుగనున్నట్లు సమాచారం. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫైనల్ ఎపిసోడ్‌కు రానున్నట్లు చెబుతున్నారు.
కాగా ఫైనల్‌లో మొదటగా సంజనా గల్రానీ ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత నాలుగో రన్నరప్‌గా ఇమాన్యుయేల్ షాకింగ్ ఎలిమినేట్ ఉంటుందని అంటున్నారు. ఎలాంటి ప్రైజ్‌మనీ లేకుండానే వీరిద్దరు హౌజ్ నుంచి బయట అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అనూహ్యంగా లాస్ట్ వీక్ ఓటింగ్‌లో ముందున్న డీమోన్ పవన్ టాప్ త్రీ చేరుకున్నట్లు సమాచారం. 25 లక్షల సూట్‌కేస్ తీసుకొని డీమోన్ పవన్ హౌజ్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.
చివరగా ఫైనల్ రేసులో కళ్యాణ్ పడాలతో పాటు తనూజ నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరిలో కళ్యాణ్ విన్నర్‌గా నిలిచాడని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. కళ్యాణ్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. తనూజ రన్నరప్‌గా నిలిచిందట. ఫైనల్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. బిగ్‌బాస్ ఫైనల్ స్టార్ మాతో పాటు జియో హాట్ స్టార్‌లో సాయంత్రం ఏడు గంటల నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Bigg Boss Ayesha | హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్
మే 18, 2026

Divvela Madhuri | సినిమాల్లోకి దువ్వాడ మాధురి ఎంట్రీ – గైరమ్మత్తగా బిగ్ స్క్రీన్‌పై రచ్చ
ఏప్రిల్ 28, 2026

Tollywood | చిరు, వెంకీ , నాగ్, బాలయ్య కలిసి నటించిన ఒకే ఒక తెలుగు సినిమా ఏదో తెలుసా!
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



