డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: నాగార్జున
Nagarjuna | దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ (PM Modi) తీసుకున్న సంకల్పం విజయవంతం కావాలని హీరో నాగార్జున (Nagarjuna) అన్నారు. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Nagarjuna | త్రినేత్ర న్యూస్: దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ (PM Modi) తీసుకున్న సంకల్పం విజయవంతం కావాలని హీరో నాగార్జున (Nagarjuna) అన్నారు. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రి కిషన్ (Kishan Reddy) చేపట్టిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున.. నషా ముక్త్ భారత్ (Nasha Mukt Bharat) కోసం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్రకు యువత నుంచి వస్తున్న మద్దతు అభినందనీయమన్నారు. ఇంతమంది యువత, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
దేశం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా తొలగించాలనే గొప్ప సంకల్పంతో ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి స్ఫూర్తినిచ్చారని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములై ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇది వారి భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆలోచనతో ప్రారంభమైందని ప్రశంసించారు. గత రెండు రోజులుగా ఈ యాత్రను గమనిస్తున్నానని, పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత ఇందులో భాగస్వాములవడం ఆనందంగా ఉందన్నారు. డ్రగ్స్ రహిత భారతదేశం (Drug Free India) కోసం కిషన్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని, ఈ సంకల్పానికి అందరూ తమ మద్దతు అందించాలని నాగార్జున పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..
- ●Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత - కమ్‌బ్యాక్ అప్పుడేనా?
- ●Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?
- ●PM Modi | నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
- ●Ramchandar Rao | పూలే దంపతుల స్ఫూర్తితో మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తం
- ●Bisleri water | బిస్లరీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి

Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..

Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత - కమ్‌బ్యాక్ అప్పుడేనా?

Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?

PM Modi | నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ




