త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

బిగ్‌బాస్ సీజ‌న్ 9 ఫ‌స్ట్ ఫైన‌లిస్ట్‌గా క‌ళ్యాణ్ ప‌డాల – సెంటిమెంట్ తిర‌గ‌రాస్తాడా?

N

Entertainment | Published On Dec 6, 2025, 5.53 am IST

బిగ్‌బాస్ సీజ‌న్ 9 ఫ‌స్ట్ ఫైన‌లిస్ట్‌గా క‌ళ్యాణ్ ప‌డాల – సెంటిమెంట్ తిర‌గ‌రాస్తాడా?

కళ్యాణ్ పడాల

Advertisement

బిగ్‌బాస్ సీజ‌న్ 9 శుభం కార్డుకు చేరువ‌లో ఉంది. ఈ సీజ‌న్‌లో గ్రాండ్ ఫినాలేకు ఎవ‌రు చేరుతారు? విజేత‌గా నిలిచే కంటెస్టెంట్ ఎవ‌ర‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. టాస్కుల్లో ఎవ‌రికి వారే త‌గ్గేదేలే అన్న‌ట్లుగా ఉండ‌టంతో ఈ సారి ఫైన‌ల్ పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. తాజాగా బిగ్‌బాస్ సీజ‌న్ 9 ఫ‌స్ట్ ఫైన‌లిస్ట్ ఎవ‌ర‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది. టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో విజ‌యాన్ని సాధించిన క‌ళ్యాణ్ ప‌డాల ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టాడు. బిగ్‌బాస్ అగ్ని ప‌రీక్ష ద్వారా కామ‌న్‌మ్యాన్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన క‌ళ్యాణ్ సీజ‌న్ 9లో ఫ‌స్ట్ ఫైన‌లిస్ట్‌గా నిలిచాడు.
బిగ్‌బాస్ ఫ‌స్ట్ ఫైన‌లిస్ట్ కోసం జ‌రిగిన టాస్క్‌లో క‌ళ్యాణ్‌కు భ‌ర‌ణి, రీతూ, ఇమాన్యుయేల్ గ‌ట్టిగానే పోటీ ఇచ్చారు. ఈ టాస్క్‌లో తొలుత భ‌ర‌ణి ఓడిపోయాడు. సంచాల‌క్ సంజ‌న త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్లే తాను ఓట‌మి పాలైన‌ట్లు భావించిన భ‌ర‌ణి ఆమెతో గొడ‌వ ప‌డ్డాడు. రీతూపైన కూడా అర‌వ‌డంతో ఆమె క‌న్నీళ్లు పెట్టుకుంది. చివ‌ర‌కు ఈ గొడ‌వ‌లోకి క‌ళ్యాణ్‌ను కూడా లాగాడు భ‌ర‌ణి. ఈ టాస్క్ మొత్తం గొడ‌వ‌ల‌తోనే సాగింది. టాస్క్‌లో విజేత‌గా నిలిచిన క‌ళ్యాణ్ టికెట్ టూ ఫినాలేను ద‌క్కించుకొని ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టాడు.
క‌ళ్యాణ్ టైటిల్ రేసులో ఉంటాడా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఫ‌స్ట్ డే నుంచే త‌న ఆట‌తీరుతో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. ఒకానొక ద‌శ‌లో ఎలిమినేష‌న్ వ‌ర‌కు వెళ్లిన క‌ళ్యాణ్ తిరిగి ఓటింగ్‌లో టాప్‌లోకి వ‌చ్చాడు. హౌజ్‌లో చాలా అవ‌మానాలు భ‌రించాడు. కానీ ఏ రోజు ఎవ‌రితో అన‌వ‌స‌రంగా గొడ‌వ‌లు ప‌డ‌లేదు. నోరుపారేసుకోలేదు. అదే అత‌డిని ఫైన‌ల్ వ‌ర‌కు తీసుకొచ్చింది.
రాహుల్ సిప్లిగంజ్ మిన‌హా టికెట్ టూ ఫినాలే ద్వారా ఫైన‌ల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవ‌రూ ఇప్ప‌టివ‌ర‌కు బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచిన దాఖ‌లాలు లేవు. అంద‌రూ ఫైన‌ల్‌తోనే స‌రిపెట్టుకున్నారు. ఆ సెంటిమెంట్‌ను క‌ళ్యాణ్ తిర‌గ‌రాస్తాడా? లేదా? అన్న‌ది చూడాల్సిందే. క‌ళ్యాణ్‌కు త‌నూజ, సంజ‌న‌ల నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. క‌ళ్యాణ్‌తో పాటు ఇమాన్యుయేల్‌, సంజ‌న‌, త‌నూజ టాప్ ఫోర్‌లో నిలిచే అవ‌కాశం ఉంది. భ‌ర‌ణి, సుమ‌న్ శెట్టిల‌లో ఒక‌రు ఫైన‌ల్‌కు చేరుతార‌ని టాక్ వినిపిస్తోంది. బిగ్‌బాస్ సీజ‌న్ 9 ఫైన‌ల్ డిసెంబ‌ర్ 21న జ‌రుగ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement