త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kajal Aggarwal | రామాయ‌ణ మూవీ నుంచి కాజ‌ల్ సీన్లు క‌ట్ – అందుకే ప్ర‌మోష‌న్ల‌కు దూరమా?

ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన రామాయ‌ణ మూవీ న‌వంబ‌ర్ 5న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ మైథాల‌జీ మూవీలో య‌శ్‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌బోతుంది. కాగా రామాయ‌ణ ప్ర‌మోష‌న్స్‌కు కాజ‌ల్ దూరంగా ఉండ‌టం బాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సోష‌ల్ మీడియాలో ఈ సినిమాను ఉద్దేశించి ఎలాంటి పోస్ట్‌లు పెట్ట‌డం లేదు కాజ‌ల్‌. అందుకు కార‌ణ‌మేమిటంటే?

N

Entertainment | Published On Oct 24, 2026, 4.14 pm IST

Kajal Aggarwal | రామాయ‌ణ మూవీ నుంచి కాజ‌ల్ సీన్లు క‌ట్ – అందుకే ప్ర‌మోష‌న్ల‌కు దూరమా?
Advertisement

Kajal Aggarwal | ప్ర‌స్తుతం పాన్ ఇండియ‌న్ వైడ్‌గా అన్ని ఇండ‌స్ట్రీల‌లో రామాయ‌ణ గురించిన చ‌ర్చ న‌డుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌, టికెట్ రేట్ల‌తో పాటు సినిమా గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ హంగులు అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి. ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న ఈ బాలీవుడ్ మూవీ న‌వంబ‌ర్ 5న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. కేజీఎఫ్ ఫేమ్ య‌శ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ సినిమాకు నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మండోద‌రి...

రామాయ‌ణ గాథ ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, స‌న్నీడియోల్‌, లారా ద‌త్తాతో పాటు ప‌లువురు బాలీవుడ్ యాక్ట‌ర్స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. య‌శ్‌కు జోడీగా ఈ మైథాల‌జీ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌బోతున్న‌ది. య‌శ్ రావ‌ణాసురుడిగా న‌టిస్తోండ‌గా...అత‌డి భార్య మండోద‌రి పాత్ర‌ను కాజ‌ల్ పోషిస్తోన్న‌ట్లు మేక‌ర్స్‌ వెల్ల‌డించారు.

ర‌న్‌టైమ్ స‌మ‌స్య‌లు...

కానీ టీజ‌ర్ ట్రైల‌ర్‌ల‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ పాత్ర క‌నిపించ‌లేదు. అంతే కాకుండా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ల‌కు ఈ ముద్దుగుమ్మ హాజ‌రుకాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముంబైతో పాటు పాన్ ఇండియ‌న్ వైడ్‌గా ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో రామాయ‌ణ ఈవెంట్ల‌ను నిర్వ‌హించారు. ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు న‌టీన‌టులంద‌రూ ఈ వేడుక‌ల్లో సంద‌డి చేశారు. కానీ కాజ‌ల్ మాత్రం ఒక్క ఈవెంట్‌లో పాల్గొన‌లేదు. ప్ర‌మోష‌న్స్‌లో అందాల చంద‌మామ క‌నిపించక‌పోవ‌డం వెనుక పెద్ద కార‌ణ‌మే ఉంద‌ని టాక్‌. ర‌న్‌టైమ్ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ మైథాల‌జీ మూవీ నుంచి కాజ‌ల్ అగ‌ర్వాల్ సీన్ల‌ను చివ‌రి నిమిషంలో క‌ట్ చేశార‌ని వార్త‌లొస్తున్నాయి. మేక‌ర్స్ నిర్ణ‌యంతో హార్ట‌యిన ఈ అందాల చంద‌మామ కావాల‌నే రామాయ‌ణ ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉంటుంద‌ని అంటున్నారు.

ఓటీటీలో...

సోష‌ల్ మీడియాలో రామాయ‌ణ మూవీని ఉద్దేశించి ఎలాంటి పోస్ట్‌లు, ట్వీట్స్ కూడా పెట్ట‌డం లేదు కాజ‌ల్‌. దాంతో ఈ రూమ‌ర్లు నిజ‌మేన‌ని అంటున్నారు. నిడివి పెర‌గ‌డానికే త‌ప్ప మండోద‌రి పాత్ర‌కు క‌థ‌లో పెద్ద‌గా ప్రాధాన్య‌త‌లేక‌పోవ‌డంతోనే మేక‌ర్స్ కాజ‌ల్ పాత్ర‌ను తొల‌గించిన‌ట్లు చెబుతున్నారు. ఓటీటీ వెర్ష‌న్‌లో మాత్రం కాజ‌ల్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని స‌మాచారం.

బాల‌కృష్ణ దాదా...

హీరోయిన్‌గా అవ‌కాశాలు త‌గ్గ‌డంతోనే కాజ‌ల్ రామాయ‌ణ‌లో మండోద‌రి రోల్ చేయ‌డానికి అంగీక‌రించింది. క‌నీసం ఈ చిన్న రోల్‌తోనైనా మ‌ళ్లీ లైమ్‌లైట్‌లోకి రావాల‌ని అనుకున్న ఈ టాలీవుడ్ బ్యూటీకి నిరాశే ఎదురైంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో బాల‌కృష్ణ దాదా సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత రెండేళ్ల గ్యాప్ అనంత‌రం ఈ మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

 

Advertisement
Advertisement