త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kajal Aggarwal | కాజ‌ల్ సినిమాల‌కు గుడ్‌బై చెప్ప‌నుందా? … సోష‌ల్ మీడియాలో రూమ‌ర్ల‌లో నిజ‌మెంత‌!

కాజ‌ల్ అగ‌ర్వాల్ తెలుగులో సినిమా చేసి రెండేళ్లు దాటిపోయింది. అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో సినిమాల‌కు గుడ్‌బై చెప్పాల‌ని కాజ‌ల్ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ప్రాధాన్య‌త లేని పాత్ర‌ల్లో క‌నిపించ‌డం కంటే సినిమాల‌కు దూరంగా ఉండ‌ట‌మే మంచిద‌ని ఈ అందాల చంద‌మామ నిర్ణ‌యించుకున్న‌ట్లు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.

N

Entertainment | Published On Apr 16, 2026, 2.58 pm IST

Kajal Aggarwal | కాజ‌ల్ సినిమాల‌కు గుడ్‌బై చెప్ప‌నుందా? … సోష‌ల్ మీడియాలో రూమ‌ర్ల‌లో నిజ‌మెంత‌!
Advertisement

Kajal Aggarwal | టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా కొన‌సాగింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసింది. చిరంజీవి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు అగ్ర హీరోలంద‌రితో జోడీక‌ట్టింది. పెళ్లి త‌ర్వాత కాజ‌ల్‌కు అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. కాజ‌ల్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చి రెండేళ్లు దాటిపోయింది. 2024లో రిలీజైన స‌త్య‌భామ త‌ర్వాత కొత్త సినిమా ఏది అంగీక‌రించ‌లేదు. యంగ్‌ హీరోయిన్ల‌తో పోటీ కార‌ణంగా కాజ‌ల్‌కు అవ‌కాశాలు త‌గ్గాయి. సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కొన్ని ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. కానీ ప్రాధాన్యం లేని పాత్ర‌లు కావ‌డంతో వాటిని కాజ‌ల్ రిజెక్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. సినిమా ఆశ‌లు వ‌దులుకున్న కాజ‌ల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. భ‌ర్త‌తో క‌లిసి బిజినెస్ వ్య‌వ‌హారాల‌ను చూసుకోవాల‌ని కాజ‌ల్ ఫిక్సైన‌ట్లు చెబుతోన్నారు.

సెలెక్టివ్‌గా...

ఈ రూమ‌ర్ల‌పై కాజ‌ల్ రియాక్ట్ అయ్యింది. సినిమాల‌కు దూర‌మ‌వుతోన్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని అన్న‌ది. గ‌తంతో పోలిస్తే సినిమాల ఎంపిక‌లో మ‌రింత సెలెక్టివ్‌గా అడుగులు వేస్తోన్నాన‌ని చెప్పింది. పెళ్లి త‌ర్వాత ఫ్యామిలీ లైఫ్‌ను, కెరీర్‌ను రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవ‌డానికే వ‌చ్చిన అన్ని సినిమాలు కాకుండా మ‌న‌సుకు న‌చ్చిన‌వి కొన్ని మాత్ర‌మే చేస్తున్నాన‌ని అన్న‌ది.

పోటీ ఎప్పుడూ ఉంటుంది...

"హీరోయిన్ల మ‌ధ్య పోటీ లేద‌ని అన్న‌ను. అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పోటీతో సంబంధం లేకుండా ఇక్క‌డ ఎవ‌రి అవ‌కాశాలు వారికి ఉంటాయి. కావాల‌ని అనుకున్నంత మాత్రానా ఏ పాత్ర మ‌న‌ల్ని వెతుక్కుంటూ రాదు. ఫ‌లానా పాత్ర నేనే చేయాల‌ని రాసి పెట్టి ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా అది మ‌న‌ల్నే వెతుక్కుంటూ వ‌స్తుంది. ఆ సిద్ధాంతాన్నే నేను న‌మ్ముతా. ఒక‌ప్పుడు నా వ్య‌క్తిగ‌త జీవితాన్ని గురించి ఆలోచించే తీరిక‌ ఉండేది కాదు. ఏడాదిలో అన్ని రోజులు సెట్స్‌లోనే గ‌డిచిపోయేవి. కానీ ఇప్పుడు వేరు. నాకు పెళ్లైంది. త‌ల్లిగా మారాను. ఆ బాధ్య‌త‌ల్ని చ‌క్క‌బెడుతూనే సినిమాలు చేయ‌డం కొంత క‌ష్ట‌మ‌వుతోంది. అందుకే సినిమాల సంఖ్య త‌గ్గించా. ఏ క్యారెక్ట‌ర్‌ను ఎవ‌రిని తీసుకోవాల‌న్న‌ది ద‌ర్శ‌కుల చేతుల్లోనే ఉంటుంది. న‌న్ను దృష్టిలో పెట్టుకొని కొంద‌రు ద‌ర్శ‌కులు మంచి క‌థ‌లు రెడీ చేస్తున్నారు. నా పాత్ర‌కు ప్రాధాన్య‌ముంటే సెకండ్ హీరోయిన్‌గా క‌నిపించ‌డానికి నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు" అని చెప్పింది.

ప్ర‌స్తుతం తెలుగులో వైశాఖ అనే వెబ్‌సిరీస్ చేస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. బాలీవుడ్‌లో హిట్టైన ఆర్య వెబ్‌సిరీస్‌కు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న వైశాఖ‌కు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిందీ రామాయ‌ణ మూవీలో య‌శ్‌కు జోడీగా మండోద‌రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

 

Advertisement
Advertisement