Kajal Aggarwal | డబ్బు, స్టేటస్ కాదు .. అదే ముఖ్యం – వైవాహిక జీవితంపై కాజల్ పోస్ట్
వైవాహిక జీవితంపై కాజల్ అగర్వాల్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. డబ్బు, స్టేటస్ కంటే మంచి భర్త దొరకడమే అదృష్టం అంటూ ఈ పోస్ట్‌లో కాజల్ పేర్కొన్నది. ఈ పోస్ట్‌కు తన భర్త గౌతమ్ కిచ్లూను ట్యాగ్ చేసింది. భర్తతో కాజల్‌కు విభేదాలు నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Sep 13, 2026, 2.08 pm IST
Kajal Aggarwal | వైవాహిక జీవితంపై కాజల్ అగర్వాల్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. డబ్బు, పేరు ఎవరైనా సంపాదించగలరని, కానీ మంచి భర్త అందరికి దొరకడని కాజల్ పేర్కొన్నది. యంగ్ హీరోయిన్ల పోటీ కారణంగా అందాల చందమామ జోరు తగ్గింది. ప్రస్తుతం బాలకృష్ణ దాదాలో హీరోయిన్‌గా నటిస్తోంది. భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీ డిసెంబర్ 24న థియేటర్లలోకి రాబోతుంది.
ఇన్‌స్టా పోస్ట్...
దాదా షూటింగ్‌లో బిజీగా ఉన్న కాజల్ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. "డబ్బు, స్టేటస్, పెద్ద ఇల్లు...ఇవేవీ గొప్ప విషయాలు కావు. మన ఆలోచనలను, అభిప్రాయాలను గౌరవిస్తూ అర్థం చేసుకునే జీవిత భాగస్వామిని దొరకడమే నిజమైన గొప్పతనం. ఆ అదృష్టం అందరికి దొరకదు" అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. ఈ పోస్ట్‌కు తన భర్త గౌతమ్ కిచ్లూను ట్యాగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. భర్తపై ప్రశంసలు కురిపిస్తూ కాజల్ ఈ పోస్ట్ పెట్టిందా? లేదంటే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
2020లో పెళ్లి....
2020 అక్టోబర్‌లో కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూ పెళ్లి జరిగింది. వివాహానికి ముందు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమలో ఉన్నారు. గౌతమ్ ఇంటీరియర్ బిజినెస్ చేస్తుంటాడు. డిస్సెర్న్ లివింగ్ అనే పేరుతో ఓ ఇంటీరియర్ డిజైన్ సంస్థను స్థాపించాడు. 2022లో కాజల్ కొడుకు పుట్టాడు. తనయుడికి నీల్ అనే పేరు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలను కొనసాగిస్తోంది.
వెబ్ సిరీస్...
ప్రస్తుతం దాదాతో పాటు తెలుగులో విశాఖ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు – స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 13, 2026

Irumudi OTT | అఫీషియల్ – థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి – నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
సెప్టెంబర్ 13, 2026

Adarsha Kutumbam | ఫ్యామిలీ మ్యాన్ .. యాక్షన్ బాట పడితే – ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చేసింది – రిలీజ్ డేట్‌పై క్లారిటీ
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Chiranjeevi | ఇరుముడి టీమ్‌కు మెగాభినందనలు
- ●Toll Booths | ఇక టోల్ దగ్గర ఆగాల్సిన పనిలేదు!
- ●BRICS Dinner Menu | బ్రిక్స్ డిన్నర్లో ప్రపంచ నేతలకు వడ్డించిన మెనూ ఇదే..!
- ●Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మమ అనిపించారు
- ●Xi Jinping Skips Modi Dinner | మోదీ ఇచ్చిన డిన్నర్‌కు జిన్‌పింగ్ డుమ్మా: సదస్సుకు వచ్చి విందుకు ఎందుకు పోలేదు?
- ●Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా

Chiranjeevi | ఇరుముడి టీమ్‌కు మెగాభినందనలు

Toll Booths | ఇక టోల్ దగ్గర ఆగాల్సిన పనిలేదు!

BRICS Dinner Menu | బ్రిక్స్ డిన్నర్లో ప్రపంచ నేతలకు వడ్డించిన మెనూ ఇదే..!

Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మమ అనిపించారు



