Kaattaan Web Series Review | కాట్టాన్ రివ్యూ – విజయ్ సేతుపతి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి హీరోగా నటిస్తూ నిర్మించిన తమిళ వెబ్‌సిరీస్ కాట్టాన్ శుక్రవారం జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. నేషనల్ అవార్డ్ విన్నర్ మణికందన్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
Entertainment | Published On Mar 27, 2026, 4.35 pm IST
Kaattaan Web Series Review | కోలీవుడ్‌లో ప్రయోగాలకు పెట్టింది పేరు విజయ్ సేతుపతి. హీరో విలన్ అనే భేదాలు లేకుండా కథ నచ్చితే ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటారు. విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది అనగానే తమిళ ఆడియెన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిగా ఎదురుచూశారు. కాట్టాన్ పేరుతో రూపొందిన ఈ సిరీస్ శుక్రవారం జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు మణికందన్ దర్శకత్వం వహించాడు. కాట్టాన్ సిరీస్ ఎలా ఉంది? ఈ వెబ్‌సిరీస్‌తో తెలుగు ఆడియెన్స్‌ను విజయ్ సేతుపతి మెప్పించాడా? లేదా? అంటే?
లైఫ్ ఆఫ్ ముత్తు...
తమిళనాడులోని అటవీ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో కాళి పాండియన్ (వడివేల్ మురుగన్) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. సొంత ఊరిలో పోస్టింగ్ కావడంతో ఆనందంగా జీవిస్తుంటాడు. వారి పోలీస్ స్టేషన్ పరిధిలోనే మొండెం లేని ఓ తల దొరుకుతుంది.ఈ కేసును ఎస్ఐ సిద్ధార్థన్‌తో (ముత్తుకుమార్) పాటు కాళీ పాండియన్ ఛాలెంజింగ్‌గా తీసుకుంటారు. వారి ఇన్వేస్టిగేషన్‌లో చనిపోయిన వ్యక్తి పేరు ముత్తు( విజయ్ సేతుపతి) అని తెలుస్తుంది. ముత్తు గురించి పోలీసులకు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి? గ్యాంగ్‌స్టర్ శివన్న (మిలింద్ సోమన్) దగ్గర పని మానేసిన ముత్తు ఓ డ్యాన్స్ గ్రూప్‌లో మేనేజర్‌గా ఎందుకు జాయినయ్యాడు. రకరకాల వృత్తులు చేసే ముత్తు దగ్గర కోట్ల కొద్ది డబ్బు ఎందుకుంది? ముత్తు ప్రేమించిన సింధు ఎలా చనిపోయింది? తనను ప్రేమించిన మీనాను వదిలిపెట్టి ముత్తు ఎక్కడికి వెళ్లిపోయాడు? జానీ అనే డ్రగ్స్ డీలర్‌తో పాటు మరికొంత మందిని ముత్తు ఎందుకు దారుణంగా హత్య చేశాడు? అన్నదే ఈ సిరీస్ కథ.
పది ఎపిసోడ్స్...
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ మణికందన్ కాట్టాన్ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడు. మొత్తం పది ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్ సాగింది. సాధారణంగా విషాదాంత కథల్లో నటించడానికి స్టార్ హీరోలు అంతగా ఆసక్తి చూపరు. ఫ్యాన్స్ నుంచి వ్యతిరేక వస్తుందని భయపడుతుంటారు. ఇలాంటి ఓ డిఫరెంట్ స్టోరీని ఆడియెన్స్‌కు చెప్పాలనే విజయ్ సేతుపతి తపన, ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.
రివేంజ్ డ్రామా...
పాత కథలనే కొత్తగా చెప్పడం ఇప్పుడు ట్రెండ్. సినిమా అయినా, సిరీస్ అయినా ఈ సూత్రాన్నే బాగా వంటబట్టించుకుంటున్నారునేటితరం డైరెక్టర్లు. కాట్టాన్‌తో దర్శకుడు మణికందన్ అనే ఫార్ములాను ఫాలో అయ్యాడు. ప్రియురాలితో పాటు స్నేహితుడి మరణానికి కారణమైన వారిపై ఓ వ్యక్తి ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ వెబ్‌సిరీస్ కథ.
రెండే లైన్లలో ముగిసిపోయే ఈ కథను ఐదు గంటలు ఇంట్రెస్టింగ్‌గా చెప్పాడు. కాళి పాండియన్‌తోపాటు పోలీస్ స్టేషన్‌లోని ఇతర పాత్రల పరిచయానికి ఫస్ట్ ఎపిసోడ్ వాడుకున్నారు డైరెక్టర్. ఆ తర్వాత ముత్తు తల దొరికే సీన్ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఎలాంటి ఆనవాళ్లు లేని ముత్తు గురించి పోలీసులు సాగించే ఇన్వేస్టిగేషన్‌లో అతడి జీవితం గురించి ఒక్కో సంఘటన బయటపడటం ఆసక్తిని పంచుతుంది.
ముత్తు లైఫ్‌లోని ప్రేమకథలు డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లలో నడిపించారు. డ్యాన్స్ గ్రూప్‌కు బాడీగార్డ్‌గా పనిచేసే ముత్తుతో మీనా ప్రేమలో పడే సన్నివేశాలు సినిమా లెవెల్‌లో ఉన్నాయి. వాటి నుంచి హీరోయిజాన్ని బాగా రాబట్టుకున్నారు. జాతర యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయింది. సింధు లవ్‌స్టోరీ మాత్రం హడావిడిగా ముగించినట్లు అనిపిస్తుంది. బెన్నీ, శివన్నలతో ముత్తుకు పరిచయం ఏర్పడే సన్నివేశాల్లో డ్రామా అంతగా పండలేదు. ఎరువుల వ్యాపారం సీన్లు సిల్లీగా ఉన్నాయి. బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో కథను చెప్పడం వల్ల ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని కలిగించింది.
ప్రెడిక్టబుల్....
కాట్టాన్ కథ బాగున్నా అనవసరపు సన్నివేశాలతో దర్శకుడు సిరీస్‌ను నింపేశారు. కాళిపాండియన్ ఫ్యామిలీ కష్టాలకు సిరీస్ నిడివి పెంచడానికే ఉపయోగపడ్డాయి. పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో సీరియస్‌నెస్ కనిపించదు. పాటలను ఈజీగా ఫార్వర్డ్ చేసేయచ్చు. ఒకటి రెండు ట్విస్ట్‌లు మినహా మిగిలినవన్నీ ప్రెడిక్టబుల్‌గానే ఉన్నాయి. విజయ్ సేతుపతి పాత్రకు ఓ రేంజ్‌లో ఎలివేషన్లు, బిల్డప్‌లు ఇస్తూ వచ్చి చివరకు తుస్ మనిపించాడు.
మాసీగా...
ముత్తు పాత్రలో విజయ్ సేతుపతి నటన బాగుంది. అతడి గెటప్, బాడీ లాంగ్వేజ్ మాసీగా ఉన్నాయి. పాత్రకు ఎంత వరకు కావాలో అంతే సెటిల్డ్‌గా నటించాడు. ఈ సిరీస్‌లో మిలింద్ సోమన్, సుదేవ్ నాయర్‌తో పాటు పలువురు టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నా వారిని డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు. ఎస్ఐగా సిద్ధార్థన్, కానిస్టేబుల్‌గా వడివేల్ మురుగన్ కామెడీ టైమింగ్ పర్వాలేదు. వీజే పార్వతి, రిచా జాకబ్ తమ పరిధుల మేర ఆకట్టుకున్నారు.
తెలుగు డబ్బింగ్ విషయంలో మేకర్స్ ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. సినిమా కథ మొత్తం ఆంధ్రలో జరుగుతుందని చెబుతారు. కానీ ఊరి పేర్లు మాత్రం అన్ని తమిళనాడువే వినిపిస్తాయి. ఈ సిరీస్‌కు కాట్టాన్ కంటే లైఫ్ ఆఫ్ ముత్తు అనే టైటిల్ యాప్ట్. ఇప్పటికే ఆ పేరుతో సినిమా రావడంతో మేకర్స్ కాట్టాన్‌గా పెట్టినట్లు అనిపించింది.
కాట్టాన్ విజయ్ సేతుపతి యాక్టింగ్ కోసమే చూడొచ్చు. రన్‌టైమ్ మైనస్. కంప్లీట్ చేయడానికి చాలా ఓపిక అవసరం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Wamiqa Gabbi | పంతొమ్మిదేళ్ల కెరీర్లో ఫస్ట్ టైమ్ – స్పెషల్ సాంగ్‌లో వామికా గబ్బి…
నవంబర్ 28, 2026

OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు , వెబ్‌సిరీస్‌లు ఇవే
నవంబర్ 27, 2026

Raashi Khanna | ఓ వైపు సినిమా – మరోవైపు వెబ్‌సిరీస్ – బ్రేక్ లేకుండా కష్టపడుతోన్న రాశీఖన్నా
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



