Rashmika Mandanna | వరలక్ష్మి వ్రతం చేసిన రష్మిక మందన్న – ఇన్‌స్టా పోస్ట్‌తో గుడ్‌న్యూస్
ఫ్యాన్స్‌కు నేషనల్ క్రష్ ఓ గుడ్‌న్యూస్ వినిపించింది. గాయం కారణంగా గత కొద్ది వారాలుగా షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చిన రష్మిక తాను పూర్తిగా కోలుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. త్వరలోనే తిరిగి షూటింగ్‌లలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించింది. రష్మిక పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Entertainment | Published On Aug 30, 2026, 7.46 pm IST
Rashmika Mandanna | గాయం కారణంగా సినిమాలకు దూరమైన రష్మిక మందన్న అభిమానులకు గుడ్‌న్యూస్ వినిపించింది. మైసా మూవీ సాంగ్ చిత్రీకరణలో రష్మిక ప్రమాదం బారినపడింది. తుంటి భాగంలో తీవ్ర గాయం కావడంతో నేషనల్ క్రష్‌కు సర్జరీ జరిగింది. ఈ సర్జరీ కారణంగా దాదాపు నెల రోజుల పాటు ఇంటికే పరిమితమైంది. షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంది. తాజాగా గాయం నుంచి పూర్తిగా కోలుకుంది.
మిస్ అవుతాను....
తన హెల్త్ అప్‌డేట్‌ను వెల్లడిస్తూ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. "త్వరలోనే తిరిగి షూటింగ్‌లను మొదలుపెట్టబోతున్నాను. ఖచ్చితంగా వీటిని మిస్సవుతాను" అంటూ కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో ఓ ఫొటోలో వరలక్ష్మి వ్రతం చేస్తూ రష్మిక మందన్న కనిపించింది. అమ్మవారిని పూలతో అలంకరించింది. వరలక్ష్మి వ్రతంతో ఫజిల్, బిల్డింగ్ బ్లాక్ గేమ్స్ ఫొటోలను పోస్ట్ చేసింది. వీటిలో పాటు పురివిప్పిన ఓ నెమలి వీడియోను పోస్ట్ చేసింది. ఈ ఎంజాయ్‌మెంట్‌ను మిస్సవుతానంటూ రష్మిక ఫొటోలు పెట్టిందని నెటిజన్లు అంటున్నారు. రష్మిక పోస్ట్‌కు వైరల్ అవుతోంది. మృణాల్ ఠాకూర్‌తో పాటు పలువురు హీరోయిన్లు ఈ ఫొటోలను లైక్ చేశారు.
రణబాలి...
సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి రష్మిక మందన్న రణబాలి చిత్రీకరణలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రష్మిక మందన్న భర్త విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతుంది.
అల్లు అర్జున్ రాకా...
రణబాలితో పాటు సెప్టెంబర్‌లోనే అల్లు అర్జున్ రాకా షూటింగ్‌ను రష్మిక మొదలుపెట్టబోతుంది. హైదరాబాద్‌లో జరుగనున్న షెడ్యూల్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఐశ్వర్య లక్ష్మిపై దర్శకుడు అట్లీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.
తెలుగులో మైసా పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది రష్మిక. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ ఈ ఏడాదే థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?
- ●Vijay Mallya | బ్రిటన్ నుంచి బయటకు రాలేను.. మాల్యా సంచలన వ్యాఖ్యలు..
- ●oxygen cylinder explodes | పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఒకరు మృతి
- ●Balmoor Venkat | బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక విధానం: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
- ●Surat textile market | సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు ధ్వంసం
- ●Addanki Dayakar | మేము అప్డేటెడ్ వర్షన్ దళితులం

Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?

Vijay Mallya | బ్రిటన్ నుంచి బయటకు రాలేను.. మాల్యా సంచలన వ్యాఖ్యలు..

oxygen cylinder explodes | పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఒకరు మృతి

Balmoor Venkat | బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక విధానం: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్





