త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ntr | ఎన్టీఆర్ బర్త్ డే బ్లాస్టింగ్ అప్‌డేట్ – త్రివిక్ర‌మ్ గాడ్ ఆఫ్ వార్ టైటిల్ ఫిక్స్‌

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ మైథ‌లాజిక‌ల్ మూవీ రాబోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లొస్తున్నాయి. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మే 20న ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాకు ష‌ణ్ముఖుడు అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Apr 14, 2026, 3.37 pm IST

Ntr |  ఎన్టీఆర్ బర్త్ డే బ్లాస్టింగ్ అప్‌డేట్ – త్రివిక్ర‌మ్ గాడ్ ఆఫ్ వార్ టైటిల్ ఫిక్స్‌
Advertisement

Ntr | యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ మైథ‌లాజిక‌ల్ మూవీ రాబోతున్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. యుద్ధ దేవుడిగా పురాణాలు అభివ‌ర్ణించిన కుమార‌స్వామి క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మే 20న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రానుంద‌ని అంటున్నారు. గాడ్ ఆఫ్ వార్ సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నార‌ట‌. అదే రోజు టైటిల్‌తో పాటు షూటింగ్ వివ‌రాల‌ను మేక‌ర్స్ రివీల్ చేయ‌బోతున్నార‌ట‌.

ష‌ణ్ముఖుడు...

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమాకు ష‌ణ్ముఖుడు అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. కుమార‌స్వామిని ష‌ణ్ముకుడిగా కూడా పిలుస్తారు. ష‌ణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు క‌ల‌వాడు అని అర్థం. త్రివిక్ర‌మ్ రెడీ చేసిన క‌థ‌లో ఎన్టీఆర్ పాత్ర మ‌ల్టీపుల్ షేడ్స్‌తో సాగుతుంద‌ట‌. అత‌డి రోల్‌కు త‌గ్గ‌ట్లుగానే ఈ సినిమాకు ష‌ణ్ముఖుడు అనే టైటిల్‌ను ఫైన‌ల్ చేయాల‌ని త్రివిక్ర‌మ్ భావిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్‌ను త్రివిక్ర‌మ్ దాదాపు పూర్తిచేశార‌ట‌. ఎన్టీఆర్ డేట్స్ కోస‌మే వెయిటింగ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా చేశారు.

ఎన్టీఆర్ డ్రాగ‌న్‌...

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ డ్రాగ‌న్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ మూవీ త‌ర్వాత కొర‌టాల శివ‌తో దేవ‌ర 2 చేయ‌బోతున్నాడు. దేవ‌ర 2తో పాటుగానే ష‌ణ్ముఖుడు షూటింగ్‌ల‌ను ఒకే సారి పూర్తిచేయాల‌ని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఆద‌ర్శ‌కుటుంబం...

మ‌రోవైపు ప్ర‌స్తుతం వెంక‌టేష్‌తో ఆద‌ర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement