Keerthy Suresh | ప్యారడైజ్ కోసం కీర్తి సురేష్ రెండు రోజులు నిద్రకు దూరం – మహానటిపై నెటిజన్ల ప్రశంసలు
సినిమాల కోసం కీర్తి సురేష్ పడుతోన్న కష్టంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు రోజుల పాటు నిద్ర కూడా పోకుండా షూటింగ్‌లు చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. నాని ప్యారడైజ్ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసమే నిద్ర లేకుండా కీర్తి సురేష్ కష్టపడినట్లు నెటిజన్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Aug 3, 2026, 5.11 pm IST
Keerthy Suresh | సినిమాల పట్ల మహానటి కీర్తి సురేష్‌కు ఉన్న అంకితభావం, ప్రేమపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతలా కష్టపడటం మహానటికి తప్ప మరెవరికి సాధ్యం కాదంటూ మెచ్చుకుంటున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు స్మాల్ గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ మళ్లీ బిజీ అయ్యింది. దక్షిణాదిలో ఏడు, బాలీవుడ్‌లో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఓ వైపు కుటుంబానికి సమయం కేటాయిస్తూనే మరోవైపు సినిమాలు చేస్తోంది.
స్పెషల్ సాంగ్...
ఈ బిజీ షెడ్యూల్స్‌లో నాని ప్యారడైజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించింది కీర్తి సురేష్. తొలుత ఈ ఐటెంసాంగ్ కోసం మేకర్స్ పూజా హెగ్డేను అప్రోచ్ అయ్యారు. కానీ డేట్స్ ఇష్యూ కారణంగా పూజా హెగ్డే తప్పుకోవడంతో చివరి నిమిషంలో కీర్తి సురేష్ ఫైనల్ అయ్యింది. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో నాని, కీర్తి సురేష్‌లపై కోరియోగ్రాఫర్ ఆట సందీప్ సారథ్యంలో ఈ పాటను షూట్ చేశారు. నానితో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అతి కష్టంగా కీర్తి సురేష్ ఈ సినిమా కోసం రెండు రోజులు కాల్షీట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ డేట్స్‌ను వృథా కాకూడదని గ్యాప్ లేకుండా షూటింగ్ చేసినట్లు తెలిసింది. ప్యారడైజ్ ఐటెంసాంగ్ పూర్తిచేసిన వెంటనే కీర్తి సురేష్ వెంటనే... వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లో అడుగుపెట్టింది.
41 గంటలు నిద్రకు దూరం...
నాన్‌స్టాప్ షూటింగ్‌ల కారణంగా 41 గంటలు నిద్ర పోలేదని కీర్తి సురేష్ అన్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. "ఓ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మరో షూటింగ్... 41 గంటలు మెలకువగా ఉంటూ పనిచేస్తున్నానే ఉన్నా. కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి కూడా ఓపిక లేదు" అంటూ కీర్తి సురేష్ పేర్కొన్నది. అలసిపోయి కనిపిస్తున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
కీర్తి సురేష్ కష్టంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ హార్ట్ వర్కే కీర్తి సురేష్‌ను నంబర్ వన్ హీరోయిన్‌గా నిలబెడుతోందని అంటున్నారు.
రౌడీ జనార్ధన...
ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధనలో హీరోయిన్‌గా నటిస్తోంది కీర్తి సురేష్. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజావారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇటీవలే వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్‌ను అంగీకరించింది. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా కనిపించబోతుంది. తమిళంలో మూడు, మలయాళంలో రెండుతో పాటు హిందీలో రాఫ్తార్ అనే సినిమా చేస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన






