Bollam Mallaiah Yadav | సీఎం వరుణ యాగంతో వర్షాలు బంద్ అయినయ్.. ఎండలు మొదలైనయ్
Bollam Mallaiah Yadav | నిన్న నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ చేసిన వరుణ యాగంతో రాష్ట్రంలో వర్షాలు ఆగిపోయి ఎండలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వ్యంగ్యంగా విమర్శించారు. సీఎం వర్షాలు పడాలని కోరుకోలేదని.. తన పదవి ఉండాలనే కోరుకున్నారని ఆరోపించారు.
- రేవంత్, ఉత్తమ్ వర్షాలు పడాలని కోరుకోలే.. వాళ్ల పదవులు ఉండాలనే కోరుకున్నరు
- వాళ్లకు దేవుని మీద నమ్మకం లేదు.. అందుకే వానలు పడుతలేవ్
- మానవ ప్రయత్నం చేయకుండా దేవున్ని నమ్ముకుంటే దేవుడు కూడా కరుణించరు
- సీఎం రేవంత్‌పై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సెటైర్లు
Bollam Mallaiah Yadav | త్రినేత్ర.న్యూస్: నిన్న నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ చేసిన వరుణ యాగంతో రాష్ట్రంలో వర్షాలు ఆగిపోయి ఎండలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వ్యంగ్యంగా విమర్శించారు. సీఎం వర్షాలు పడాలని కోరుకోలేదని.. తన పదవి ఉండాలనే కోరుకున్నారని ఆరోపించారు. దేవుడి మీద వాళ్లకు నమ్మకం లేదని.. అందుకే యాగాలు చేసినా వర్షాలు పడటం లేదన్నారు. మానవ ప్రయత్నం చేయకుండా దేవుడిని నమ్ముకుంటే దేవుడు కూడా కరుణించరని వ్యాఖ్యానించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ వరుణ యాగంపై విమర్శలు గుప్పించారు.
రైతులకు క్షమాపణ చెప్పి యాగం చేయాల్సింది..
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ యాగం చేశారు. వాళ్లు తమ పదవులు కాపాడుకోవడానికే ఈ యాగం చేశారు. రైతులకు క్షమాపణ చెప్పి యాగం చేయాల్సింది. కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టిన ఘనత రేవంత్ సర్కార్‌దే. తుంగభద్ర, బీమా నదులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. తన సొంత నియోజకవర్గానికి లిఫ్ట్ కోసం రేవంత్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం చేశారు. నీళ్లున్నా లిఫ్ట్ చేయక తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారు అని మల్లయ్య యాదవ్ మండిపడ్డారు.
ఏపీ బనకచర్ల ద్వారా నీళ్లు తరలించుకుపోతుంటే చోద్యం చూస్తున్నారు. కృష్ణా జలాల్లో మనకున్న వాటాను కూడా వినియోగించుకోలేని అసమర్ధ సర్కార్ ఇది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఎనిమిది మంది చనిపోయినా శవాలు తీయని ఉత్తమ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్, ఉత్తమ్ పోటీ పడుతున్నారు. కన్నెపల్లి దగ్గర లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా లిఫ్ట్ చేయడం లేదు. ఎల్‌నినో హెచ్చరికలు ఎప్పుడో వచ్చినా ఈ ప్రభుత్వం నిద్రపోయింది. ఉత్తమ్ సొంత జిల్లాకు ద్రోహం చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతలే అసలైన దుష్ట శక్తులు..
క్షుద్ర పూజలు అని హరీష్ రావును కావాలనే కాంగ్రెస్ నేతలు బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలైన దుష్ట శక్తులు కాంగ్రెస్ నేతలే. తెలంగాణను సశ్యశ్యామలం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తే కాంగ్రెస్ నేతలు ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలకులకు కమీషన్ల మీద ఉన్న ధ్యాస రైతాంగ సంక్షేమం మీద లేదు. దేవుడి మీద భారం వేయడం కాదు.. గోదావరి కృష్ణా నీళ్లను సద్వినియోగం చేసే ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేయాలి. ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి. కన్నెపల్లి పంప్‌ను వెంటనే ఆన్ చేయాలి. గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవహిస్తున్న నీళ్లను చెరువులకు రైతుల బీళ్లకు మళ్లించాలి అని మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో రవినాయక్, ఫయాజ్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Pocharam Srinivas Reddy | అసలు… నా ఫోనే ఎత్తుతలేరు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఆగస్టు 11, 2026

Vaddiraju Ravichandra | ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు సంస్కరణలు ఓకే.. కానీ సరిగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది
ఆగస్టు 11, 2026

Minister Tummala | దళారుల జోక్యం లేకుండా పత్తి కొనుగోళ్లు
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Pocharam Srinivas Reddy | అసలు... నా ఫోనే ఎత్తుతలేరు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
- ●Dayanidhi Maran on Congress | రేవంత్ రెడ్డికి ఒక న్యాయం.. తమిళనాడుకు మరో న్యాయమా?
- ●Minister Ponguleti | నిషేధిత భూములపై ఆందోళన వద్దు
- ●Vishnu Priya | హీరోయిన్గా విష్ణుప్రియ - ఇంద్ర లోకం నుంచి వచ్చిన ఊర్వశిగా...
- ●Hisense UR8S | హైసెన్స్ నుంచి ఆర్జీబీ మినీ ఎల్ఈడీ టీవీలు.. తక్కువ ధరలకే లాంచ్..
- ●Kadiyam Kavya | కాకతీయ జూ అభివృద్ధికి కాంపా నిధులు ఇవ్వండి.. ఎంపీ కావ్య రిక్వెస్ట్

Pocharam Srinivas Reddy | అసలు... నా ఫోనే ఎత్తుతలేరు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

Dayanidhi Maran on Congress | రేవంత్ రెడ్డికి ఒక న్యాయం.. తమిళనాడుకు మరో న్యాయమా?

Minister Ponguleti | నిషేధిత భూములపై ఆందోళన వద్దు

Vishnu Priya | హీరోయిన్గా విష్ణుప్రియ - ఇంద్ర లోకం నుంచి వచ్చిన ఊర్వశిగా...



