త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naveen Nicolas | పాఠ‌శాలల భ‌వ‌నాలు పూర్త‌య్యేలోపు ఫ‌ర్నీచ‌ర్ ఉండాలి.. నిధుల స‌మ‌స్య రాకుండా చూసుకోండి

Naveen Nicolas | రంగారెడ్డి జిల్లాలోని మంచాల, నాగ‌ర్‌క‌ర్నూర్ జిల్లాలోని వంగూరు, పొల్కంపల్లి పాఠశాల ప‌నుల‌ను వ‌చ్చే డిసెంబ‌ర్‌లో పూర్తి చేయాల‌ని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. నిధుల సమస్య కారణంగా పనులు నిలిచిపోకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాల‌న్నారు.

S

Telangana | Published On Aug 11, 2026, 7.28 pm IST

Naveen Nicolas | పాఠ‌శాలల భ‌వ‌నాలు పూర్త‌య్యేలోపు ఫ‌ర్నీచ‌ర్ ఉండాలి.. నిధుల స‌మ‌స్య రాకుండా చూసుకోండి
Advertisement
  • ఖైదీలు త‌యారు చేసే ఫ‌ర్నీచ‌ర్‌ను టీపీఎస్‌ల‌కు ఉప‌యోగించుకోండి
  • డిసెంబర్‌లోపు మంచాల, వంగూరు, పోల్కంపల్లి స్కూళ్ల ప‌నులు పూర్తి చేయండి
  • ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశం

Naveen Nicolas |  త్రినేత్ర‌.న్యూస్: రంగారెడ్డి జిల్లాలోని మంచాల, నాగ‌ర్‌క‌ర్నూర్ జిల్లాలోని వంగూరు, పొల్కంపల్లి పాఠశాల ప‌నుల‌ను వ‌చ్చే డిసెంబ‌ర్‌లో పూర్తి చేయాల‌ని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. నిధుల సమస్య కారణంగా పనులు నిలిచిపోకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాల‌న్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. పూర్తయిన, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై మంగ‌ళ‌వారం ఆయ‌న సమీక్షించారు. నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై చర్చించారు.

ఫర్నీచర్‌కు ఇండెంట్ సిద్ధం చేయండి

పాఠశాలలకు అవసరమైన ఫర్నీచర్‌ను జైళ్ల శాఖ నుంచి సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. చ‌ర్ల‌ప‌ల్లి, చంచ‌ల్ గూడ జైళ్లో ఖైదీలు త‌యారు చేసే ఫ‌ర్నీచ‌ర్‌ను టీపీఎస్ ల‌కు ఉప‌యోగించుకోవాల‌ని.. దీనికి సంబంధించి ప్రతి పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్ వివరాలతో పూర్తి ఇండెంట్‌ను సిద్ధం చేయాలని హెచ్ఎంలను నవీన్ నికోలస్ ఆదేశించారు.

విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల అవసరాలకు అనుగుణంగా డెస్క్‌లు, బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు తదితర ఫర్నీచర్ అవసరాలను ముందుగానే గుర్తించి ఇండెంట్ సిద్ధం చేయాలన్నారు. పాఠశాల భవనాల పనులు పూర్తయ్యే సమయానికి ఫర్నీచర్ కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్ ఎంల‌కు సూచించారు.

ఎంబీల నమోదులో ఇబ్బందులు లేకుండా చూస్తాం

ఈ మూడు టీపీఎస్‌ల‌లో ఇప్పటివరకు పూర్తయిన పనులకు సంబంధించి ఎంబీలు (మెజర్‌మెంట్ బుక్స్) నమోదు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తెలంగాణ‌ ఎడ్యుకేషన్ఎడ్యుకేష‌న్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎండీ గణపతి రెడ్డి తెలిపారు. పనుల కొలతలు, రికార్డుల నిర్వహణ, బిల్లుల ప్రక్రియ తదితర అంశాల్లో సమన్వయంతో వ్యవహరిస్తామని చెప్పారు. పాఠశాలల అభివృద్ధి పనుల్లో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సమావేశంలో సూచించారు. అధికారులు, హెచ్ఎంలు, నిర్మాణ సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ స‌మీక్ష‌లో కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్నా శివారెడ్డి, ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్, ఆరుట్ల, వంగూరు, పొల్కంపల్లి, మంచాల పాఠశాలల హెచ్ఎంలు, కాంట్రాక్ట‌ర్స్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement