త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ntr | స‌ర్జ‌రీ త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ – రాజ‌మౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా

డ్రాగ‌న్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ఎన్టీఆర్ మూడు నెల‌ల గ్యాప్ త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ మీడియా ముందుకు రాబోతున్నారు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ నిర్మించిన డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రుకానున్నారు. ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన ఫాంట‌సీ యాక్ష‌న్ మూవీ అక్టోబ‌ర్ 2న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

N

Entertainment | Published On Sep 26, 2026, 5.12 pm IST

Ntr | స‌ర్జ‌రీ త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ – రాజ‌మౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా
Advertisement

Ntr | డ్రాగ‌న్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ఎన్టీఆర్ మూడు నెల‌ల గ్యాప్ త‌ర్వాత మీడియా ముందుకు రాబోతున్నారు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌యుడు నిర్మించిన సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌నున్నారు. బాహుబ‌లి నిర్మాత‌లు ప్ర‌సాద్ దేవినేని, శోభు యార్ల‌గ‌డ్డ‌ల‌తో క‌లిసి రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్ ఎస్ కార్తికేయ నిర్మించిన మూవీ డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్. . మ‌ల‌యాళ అగ్ర న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమా అక్టోబ‌ర్ 2న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. శ‌శాంక్ యేలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌...

ఫాంట‌సీ అడ్వెంచ‌ర్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్నడోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబ‌ర్ 29న హైద‌రాబాద్‌లో జ‌రుగ‌బోతుంది. ఈ వేడుక‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ కాబోతున్నారు. ఈ విష‌యాన్ని నిర్మాత కార్తికేయ ఓ వీడియో ద్వారా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

డ్రాగ‌న్ మూవీ...

ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్‌తో డ్రాగ‌న్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్‌. జూలైలో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో గాయ‌ప‌డ్డ ఆయ‌న గ‌త మూడు నెల‌లుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. యాక్ష‌న్ స‌న్నివేశాలు షూట్ చేస్తోండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. భుజానికి గాయం కావ‌డంతో డాక్ట‌ర్లు ఎన్టీఆర్‌కు స‌ర్జ‌రీ చేశారు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఈ టాలీవుడ్ హీరో అక్టోబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి తిరిగి డ్రాగ‌న్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఫ‌స్ట్ టైమ్ మీడియా ముందుకు...

డ్రాగ‌న్ షూటింగ్‌లో పాల్గొన‌డానికంటే ముందు డ్రోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ అటెండ్ కానుండ‌టం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. మూడు నెల‌ల త‌ర్వాత ఎన్టీఆర్‌ మీడియా ముందుకు రానుండ‌టంతో ఆయ‌న ఫ్యాన్స్ ఖుషీ అవుతోన్నారు.

రాజ‌మౌళి ప్ర‌జెంట‌ర్‌...

డోంట్ ట్ర‌బుల్ ది ట్రుబ‌ల్ మూవీకి డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కీర‌వాణి త‌న‌యుడు కాళ‌భైర‌వ సంగీతం అందించారు. పుష్ప, పుష్ప 2 త‌ర్వాత తెలుగులో ఫ‌హాద్ ఫాజిల్ చేసిన స్ట్రెయిట్ మూవీ ఇది. ఇటీవ‌ల ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్‌కు బాల‌కృష్ణ వాయిస్ ఓవ‌ర్ అందించారు.

Advertisement
Advertisement