Jr Ntr | బెస్ట్ విలన్‌గా జూనియర్ ఎన్టీఆర్ – అవార్డ్ నామినేషన్స్‌పై యంగ్ టైగర్ ఫ్యాన్స్ గరం
జీ సినీ అవార్డ్స్ తాలూకు నామినేషన్స్ ఆదివారం రివీలయ్యాయి. ఈ నామినేషన్స్‌లో వార్ 2 సినిమాకుగాను బెస్ట్ విలన్‌గా జూనియర్ ఎన్టీఆర్ నిలవడంపై యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. .
Entertainment | Published On Feb 15, 2026, 7.30 pm IST
Jr Ntr | బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. యశ్‌రాజ్‌ఫిల్మ్స్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ కావడానికి జీ సినీ అవార్డ్ నామినేషన్స్ కారణం.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ....
యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన వార్ 2 మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ స్పై యాక్షన్ మూవీలో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ మరో హీరోగా కనిపించాడు. వైఆర్ఎఫ్ స్పై యానివర్స్‌లో హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.
ప్రీ రిలీజ్ బిజినెస్ ...
ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్‌కు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడటంతో రిలీజ్‌కు ముందు వార్ 2పై భారీగానే హైప్ ఏర్పడింది. మరోవైపు టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు ఉన్న స్టార్‌డమ్ కారణంగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది. బిజినెస్‌లో రికార్డులు క్రియట్ చేసిన వార్ 2 కలెక్షన్స్‌లో మాత్రం డీలా పడింది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. కాన్సెప్ట్, వీఎఫ్ఎక్స్ తో పాటు ఎన్టీఆర్ రోల్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. తెలుగులోనూ వార్ 2 ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది.
నెగెటివ్ రోల్....
కాగా జీ సినీ అవార్డ్ నామినేషన్స్ ఆదివారం రివీలయ్యాయి. మొత్తం ఎనిమిది కేటగిరీలలో వార్ 2 నామినేషన్స్‌ను దక్కించుకుంది. జీ సినీ అవార్డుల్లో బెస్ట్ నెగెటివ్ రోల్‌లో ఎన్టీఆర్ నామినేషన్స్‌లో నిలిచాడు. ఈ నామినేషన్స్ లిస్ట్‌ను వైఆర్ఎఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. విలన్‌గా ఎన్టీఆర్ నామినేషన్స్‌లో నిలవడంపై యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఫ్యాన్స్ ఫైర్....
వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర.... హృతిక్‌కు సమానంగా ఉంటుందని ...వీరిద్దరూ సినిమాలో హీరోలేనని ప్రమోషన్స్‌లో యశ్ రాజ్ ఫిల్మ్స్ చెబుతూ వచ్చింది. రిలీజైన తర్వాత ప్లేట్ ఫిరాయించిన నిర్మాణ సంస్థ ఇప్పుడు ఎన్టీఆర్‌ను విలన్‌గా పేర్కొనడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్ అభిమానులు పేర్కొంటున్నారు. . ఈ నామినేషన్స్ ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా వార్ 2లో ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ చేసినట్లు చెప్పకనే యశ్‌రాజ్ ఫిల్మ్స్ చెప్పిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్స్, పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. వీఎఫ్ఎక్స్ విభాగంలో ఈ సినిమా నామినేషన్స్‌లో నిలవడంపై తెగ ట్రోల్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న డ్రాగన్ మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. జార్జియాలో ఇటీవలే ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలైంది. డ్రాగన్ తర్వాత కొరటాల శివతో దేవర 2 మూవీ చేయబోతున్నాడు ఎన్టీఆర్.
సంబంధిత వార్తలు

Trp Rating | బుల్లితెరపై కూడా డిజాస్టర్ – ఎన్టీఆర్ వార్ 2కు షాకింగ్ టీఆర్పీ రేటింగ్ – మరీ అంత తక్కువా!
మే 14, 2026

Ntr | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్ – డ్రాగన్ టైటిల్ ఛేంజ్?
ఏప్రిల్ 21, 2026

Jr Ntr | భార్య బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ – ఫొటోలు వైరల్
మార్చి 26, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



