త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chandrahas | బూతు సాంగ్ వివాదం – యాటిట్యూడ్ స్టార్‌ చంద్ర‌హాస్‌పై పోలీస్ కేసు న‌మోదు

బుల్లితెర న‌టుడు ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ చిక్కుల్లో ప‌డ్డాడు. జ‌ర్న‌లిస్ట్‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డిన అత‌డిపై మాదాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయ్యింది.

N

Entertainment | Published On Feb 5, 2026, 11.39 am IST

Chandrahas | బూతు సాంగ్ వివాదం  – యాటిట్యూడ్ స్టార్‌ చంద్ర‌హాస్‌పై పోలీస్ కేసు న‌మోదు
Advertisement

Chandrahas | టాలీవుడ్ హీరో చంద్ర‌హాస్ బూతు సాంగ్ వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినీ ప్ర‌ముఖుల‌తో పాటు నెటిజ‌న్లు చంద్ర‌హాస్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న్స్ పేరుతో ఇంత‌లా దిగ‌జారాల్సిన అవ‌స‌రం లేదంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బూతులు మాట్లాడితే జ‌నాలు సినిమాల‌కు రార‌ని అంటున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో...

బ‌రాబ‌ర్ ప్రేమిస్తా పేరుతో చంద్ర‌హాస్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇటీవ‌ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ వేడుక‌లో గుంజి గుంజి అంటూ స్టేజ్‌పై చంద్ర‌హాస్ ఓ పాట పాడాడు. ఈ సాంగ్‌లో చంద్ర‌హాస్ ఉప‌యోగించిన అస‌భ్య‌ప‌ద‌జాలం, భాష‌పై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ విమ‌ర్శ‌ల‌పై చంద్ర‌హాస్ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. తాను ఎవ‌రికి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌నంటూ పేర్కొన్నారు.

బెదిరింపులు...

తాజాగా బూతు సాంగ్ వివాదానికి సంబంధించి చంద్ర‌హాస్‌పై పోలీసు కేసు న‌మోదు అయ్యింది. ఈ బూతు సాంగ్‌లో చంద్ర‌హాస్ వాడిన భాష స‌రిగ్గా లేదంటూ అశోక్ కుమార్ వేముల‌ప‌ల్లి అనే జ‌ర్న‌లిస్ట్ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అశోక్ కుమార్ విమ‌ర్శ‌ల‌పై చంద్ర‌హాస్ స్పందించాడు. స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ త‌న కుటుంబాన్ని కించ‌ప‌రుస్తూ కామెంట్స్ చేశాడ‌ని అన్నారు. జ‌ర్న‌లిస్ట్‌ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే అత‌డిపై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటాన‌ని చంద్ర‌హాస్ చెప్పాడు. అశోక్‌కుమార్‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు.

ప్రాణ‌హాని...

చంద్ర‌హాస్ వీడియోపై అశోక్ కుమార్ వేముల‌ప‌ల్లి మాదాపూర్‌ పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చాడు చంద్ర‌హాస్ త‌న‌పై ప‌బ్లిక్‌గానే బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు. చంద్ర‌హాస్ నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ తెలిపాడు. అశోక్ కుమార్‌ కంప్లైంట్‌ను స్వీక‌రించిన పోలీసులు చంద్ర‌హాస్‌పై కేసు న‌మోదు చేశారు.

వివాదంపై క్లారిటీ....

మ‌రోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అటెండ్ అయిన సినీ న‌టుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తితో పాటు హీరో ఆది కూడా చంద్ర‌హాస్ సాంగ్‌పై రియాక్ట్ అయ్యారు. ప‌బ్లిక్‌గా బూతులు మాట్లాడ‌టం స‌రికాదంటూ పేర్కొన్నారు. చంద్ర‌హాస్ అలాంటి పాట పాడుతాడ‌ని త‌మ‌కు తెలియ‌ద‌ని బ‌రాబ‌ర్ ప్రేమిస్తా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. బుల్లితెర న‌టుడు ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు చంద్ర‌హాస్‌. బ‌రాబ‌ర్ ప్రేమిస్తా కంటే ముందు రామ్ న‌గ‌ర్ బ‌న్నీ పేరుతో ఓ సినిమా చేశాడు.

Advertisement
Advertisement