Jim Jim Tara Song | జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ వచ్చేసింది – లిరిక్స్ ఇవిగో…
జిమ్ జిమ్ తార సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సామాన్యుల నుంచి సెలిబ్రిటీల వరకు చాలా మంది ఈ పాటకు ఫ్యాన్స్‌గా మారిపోయారు. తాజాగా జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ మంగళవారం రిలీజైంది. పర్ణశాల మూవీలోని ఈ పాటను పాడటమే కాకుండా లక్ష్మిదేవి స్వయంగా లిరిక్స్ అందించారు.
Entertainment | Published On Oct 13, 2026, 6.16 pm IST
Jim Jim Tara Song | జిమ్ జిమ్ తార సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. సెలిబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతో మంది ఈ పాటకు అభిమానులుగా మారిపోయారు. తమ సినిమాల ప్రమోషన్స్‌లో పలువురు స్టార్స్ జిమ్ జిమ్ తారకు స్టెప్పులు వేస్తున్నారు. చివరకు ఫుల్‌బాట్ స్టార్ మెస్సీ సైతం ఈ పాటకు ఫిదా అయ్యారు.
పర్ణశాల...
పర్ణశాల అనే హారర్ కామెడీ సినిమా కోసం లక్ష్మిదేవి ఈ పాటను ఆలపించారు. కేవలం ప్రోమోతోనే సెన్సెషన్ అయిన జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ వచ్చేసింది. మంగళవారం మేకర్స్ ఈ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను పాడటమే కాకుండా లిరిక్స్ కూడా లక్ష్మిదేవి అందించారు. వినయ్ శశిధర్ మ్యూజిక్ అందించారు.
హారర్ కామెడీ...
జిమ్ జిమ్ తార పాటతో పర్ణశాల మూవీ టాలీవుడ్‌లో మంచి హైప్ వచ్చింది. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కార్తికేయ, అన్యుక్త హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. టాక్సీవాలా విష్ణు, అజయ్ ఘోష్, చందు జేసీ, జోష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజీ భరత్ దర్శకత్వం వహిస్తున్నారు.
నవ్విస్తూనే థ్రిల్...
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ, “ పర్ణశాల సినిమా కోసం జి.లక్ష్మిదేవి రాసి పాడిన జిమ్ జిమ్ తార’ పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆనందాన్ని కలిగిస్తోంది. ఫుల్ సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్టవుతుందని నమ్ముతున్నాం. హారర్ కామెడీ సస్పెన్స్ అంశాలతో నవ్విస్తూనే ఈ సినిమా థ్రిల్‌ను పంచుతుంది" అని అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sai Pallavi | రామాయణ రిలీజ్ ముంగిట తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా సాయిపల్లవి – జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ప్రారంభం
అక్టోబర్ 13, 2026

Rukmini Vasanth | వరుసగా ఎనిమిది ఫ్లాప్‌లు – అయినా ఛాన్స్‌లు – హీరో నాని ప్రేమకథలో రుక్మిణి వసంత్
అక్టోబర్ 13, 2026

Pooja Hegde | బుట్టబొమ్మ బర్త్‌డే ట్రీట్ – అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●Aishwarya Death Case | మెడికవర్ ఆసుపత్రిని తగలబెడ్తం.. అది మూత పడాల్సిందే
- ●China Ladakh Names Row | లడఖ్‌లోని 28 కీలక ప్రాంతాలకు భారత్ పేర్లు: తట్టుకోలేక విషం కక్కిన చైనా
- ●Sanjay Jaju | ఎల్‌నినో ఎఫెక్ట్.. హైదరాబాద్‌కు నీటి భరోసా!
- ●Sai Pallavi | రామాయణ రిలీజ్ ముంగిట తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా సాయిపల్లవి - జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ప్రారంభం
- ●Sridhar Babu | చినగవు, తడవవు.. ఇక మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త పేపర్
- ●NMMS | నవంబర్ 1న ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష

Aishwarya Death Case | మెడికవర్ ఆసుపత్రిని తగలబెడ్తం.. అది మూత పడాల్సిందే

China Ladakh Names Row | లడఖ్‌లోని 28 కీలక ప్రాంతాలకు భారత్ పేర్లు: తట్టుకోలేక విషం కక్కిన చైనా

Sanjay Jaju | ఎల్‌నినో ఎఫెక్ట్.. హైదరాబాద్‌కు నీటి భరోసా!

Sai Pallavi | రామాయణ రిలీజ్ ముంగిట తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా సాయిపల్లవి - జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ప్రారంభం



