త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anjali | పంతొమ్మిదేళ్ల త‌ర్వాత త‌మిళ హీరో స‌ర‌స‌న అంజ‌లి – నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ ట్రాజెడీ ల‌వ్‌స్టోరీ…

జీవా, అంజ‌లి హీరోహీరోయిన్లుగా న‌టించిన కాట్రాదు త‌మిళ్ మూవీ కోలీవుడ్‌లో క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా త‌ర్వాత పంతొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ అనంత‌రం జీవా, అంజ‌లి మ‌ళ్లీ జోడీ క‌ట్ట‌బోతున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ వ‌సంత‌బాల‌న్‌తో సినిమా చేయ‌బోతున్నారు.

N

Entertainment | Published On May 24, 2026, 2.39 pm IST

Anjali | పంతొమ్మిదేళ్ల త‌ర్వాత త‌మిళ హీరో స‌ర‌స‌న అంజ‌లి – నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ ట్రాజెడీ ల‌వ్‌స్టోరీ…
Advertisement

Anjali | యంగ్ హీరోయిన్ల జోరుతో సినిమాల స్పీడును త‌గ్గించింది అంజ‌లి. ఒక‌ప్పుడు ఏడాదికి నాలుగైదు మూవీస్ చేస్తూ తెలుగుతో పాటు త‌మిళంలో బిజీగా ఉండేది. ట్రెడిష‌న‌ల్ హీరోయిన్‌ రోల్స్ అంటే ఫ‌స్ట్ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపించేది. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఈ ఏడాది అంజ‌లి న‌టించిన ఒక్క సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. మంచి హిట్టుతో క‌మ్ బ్యాక్ ఇవ్వాల‌ని ఎదురుచూస్తోంది. తాజాగా అంజ‌లి త‌మిళంలో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు స‌మాచారం. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ వ‌సంత్ బాల‌న్‌తో ఓ సినిమా చేయ‌బోతుంది.

వ‌సంత‌బాల‌న్ డైరెక్ష‌న్‌లో...

రంగం ఫేమ్ జీవా హీరోగా వ‌సంత బాల‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విషాదాంత‌ ప్రేమ‌క‌థ‌తో ఓ సినిమా తెర‌కెక్క‌బోతుంద‌ట‌. ఈ మూవీలో హీరోయిన్‌గా అంజ‌లిని మేక‌ర్స్ క‌న్ఫామ్ చేసిన‌ట్లు స‌మాచారం. రా అండ్ ర‌స్టిక్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌తో అంజ‌లి చేయ‌బోతున్న సెకండ్ మూవీ ఇది. వ‌సంత బాల‌న్ రూపొందించిన అంగ‌డితెరు మూవీలో అంజ‌లి హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాలోనే త‌మిళంలో ఆమెకు ఫ‌స్ట్ బ్రేక్ ద‌క్కింది. దాదాపు ప‌ద‌హారేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ డైరెక్ట‌ర్‌తో అంజ‌లి సినిమా చేయ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం.

వేశ్య పాత్ర‌లో...

జీవా అంజ‌లి క‌లిసి సినిమా చేయ‌బోతుండ‌టం కూడా ఇది రెండోసారి. 2007లో వ‌చ్చిన కాట్రాదు త‌మిళ్ అనే సినిమాలో వీరిద్ద‌రు జంట‌గా న‌టించారు. ఇందులో అంజ‌లి వేశ్య పాత్ర‌లో క‌నిపించింది. ఈ సినిమాలో జీవా, అంజ‌లి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. త‌మిళంలో క‌ల్ట్ క్లాసిక్‌గా ఈ మూవీ నిలిచింది. పంతొమ్మిదేళ్ల త‌ర్వాత జీవా, అంజ‌లి జోడీ రిపీట్ కాబోతుండ‌టం త‌మిళంలో ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ట‌.

 

Advertisement
Advertisement