Jet Lee Review | జెట్‌లీ రివ్యూ …కామెడీ తక్కువ…కన్ఫ్యూజన్ ఎక్కువ…
కమెడియన్ సత్య హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన జెట్‌లీ శుక్రవారం థియటర్లలోకి వచ్చింది. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On May 1, 2026, 6.31 pm IST
Jet Lee Review | కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జెట్ లీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించాడు. వెన్నెలకిషోర్, రియా సింఘా, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సత్య హీరోగా మెప్పించాడా? జెట్‌లీ తెలుగు ప్రేక్షకులను నవ్వించిందా? లేదా? అంటే...
వేదవ్యాస్ హంగామా....
ప్రజాపతి పేరుతో బ్యాంకు పెట్టి జనాలను మోసం చేస్తాడు బిజినెస్‌మెన్ ప్రజాపతి (అజయ్). చివరకు హోమ్ మినిస్టర్‌కు కూడా టోకరా వేసి విదేశాలకు పారిపోతాడు. ప్రజాపతిని ఆచూకీ కనిపెట్టిన ఏజెంట్ శివానీ రాయ్ (రియా సింఘా) ఇండియాకు ఫ్లైట్‌లో అతడిని తీసుకువస్తుంది. ఈ జర్నీలో శివానీ బారి నుంచి తప్పించుకోవాలని తన మనషులతో కలిసి ప్రజాపతి ప్లాన్ చేస్తాడు. మరోవైపు అతడిని చంపేందుకు ఓ సీక్రెట్ టీమ్ అదే ఫ్లైట్‌లోకి ఎక్కుతుంది. వారందరి బారి నుంచి ప్రజాపతిని కాపాడిన వేదవ్యాస్ (సత్య) ఎవరు? అసలు వేదవ్యాస్ డాక్టరా? సీక్రెట్ ఏజెంటా? గతం మర్చిపోయిన అతడు ఆ ఫ్లైట్‌లోకి ఎలా వచ్చాడు? ఆ ఫ్లైట్ జర్నీలో ఎలాంటి అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయన్నదే జెట్‌లీ మూవీ కథ.
విజయ్ మాల్యా...నీరవ్ మోదీ...
ఓ కథ అనుకున్నప్పుడే జానర్ ఏమిటన్నది దర్శకుడికి క్లారిటీ ఉండాలి. అయోమయంలో ఉండి సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందన్నది జెట్‌లీ చూస్తే అర్థమవుతుంది. బ్యాంకుల పేరుతో స్కామ్‌లు చేసి విదేశాలకు పారిపోయిన ఓ వ్యక్తులు అనగానే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ గుర్తొస్తారు. వారి జీవితాల నుంచే స్ఫూర్తి పొంది జెట్‌లీ బేసిక్ ఐడియాను అనుకున్నారు డైరెక్టర్ రితేష్ రానా. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను విదేశాల నుంచి ఇండియాకు ఫ్లైట్‌లో తీసుకురావాలని ఓ స్పెషల్ ఏజెంట్ అనుకోవడం...నాలుగు గంటల జర్నీలో అతడిని చంపాలని ప్రయత్నించే వ్యక్తులు, అతడిని తప్పించాలని ప్లాన్ చేసిన వారు అందరూ ఒకే ఫ్లైట్‌లో ఉండటం ..అసలు విలన్ ఎవరు...మంచివారు ఎవరూ.... ఈ నేపథ్యంలో నెలకొన్న కన్ఫ్యూజన్లతో ఈ కథను రాసుకున్నారు. థ్రిల్లర్ కథకు కావాల్సినంత సరంజామా ఈ కథలో ఉంది.
తొలి అడుగు దగ్గరే...
కానీ స్టార్ కమెడియన్ సత్య హీరో కావడంతో రితేష్ రానా వినోదాత్మకంగా జెట్‌లీని తెరకెక్కించి ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలనుకున్నారు. మొదటి స్టెప్ దగ్గరే తడబడిపోయారు. సత్య కోసమే కామెడీ, క్యారెక్టర్లను బలవంతంగా కథలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది.
మీమ్స్...
హాస్యం పేరుతో సోషల్ మీడియా మీమ్స్, సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్ స్ఫూఫ్‌లు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. జెట్‌లీలో అదే ఫార్ములాను ఫాలో అయ్యారు డైరెక్టర్. మహేష్ బాబు, బాలకృష్ణ నుంచి చాలా మంది హీరోలను ఇమిటేట్ చేశారు. ఆగడు, దేవరతో పాలు సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్ వాడేశారు...చిరంజీవి రిఫరెన్స్‌లు ఉపయోగించారు. కామెడీ పేరుతో రకరకాల జిమ్కిక్కులు చేశారు. అవన్నీ నవ్వించకపోగా చిరాకును తెప్పిస్తాయి. సినిమా నిడివి రెండు గంటల పది నిమిషాలే అయినా మూడు గంటల సినిమా ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా జెట్‌లీ అటు కామెడీకి...ఇటు థ్రిల్లర్ సినిమాకు మధ్యలో ఆగిపోయి కలగాపులగంగా మారిపోయింది.
ఆల్‌రౌండ్ షో...
సత్య ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. కామెడీ, యాక్షన్...ఇలా సినిమా కోసం అన్ని చేశాడు. కానీ కథలో బలం లేకపోవడంతో అతడి కష్టం వృథాగా మారింది. వెన్నెలకిషోర్ పంచ్‌లు కొన్ని నవ్వించాయి. యాక్షన్ రోల్‌లో రియా సింఘా నటన బాగుంది. అజయ్ పాత్ర రొటీన్‌గా సాగింది. శ్రీనివాసరెడ్డి, హర్ష చెముడు, గుండు సుదర్శన్ కామెడీ ట్రాక్‌లు నవ్వించలేకపోయాయి. కాల భైరవ బీజీఎమ్ ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఫ్లైట్‌లోనే సాగుతుంది. సెట్ విషయంలో రియాలిటీ మిస్సయ్యింది.
రేటింగ్ : 2/5
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



